"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Sunday, March 05, 2023

"ChatGPT says Telugu 3rd most spoken language, experts disagree"

ChatGPT says Telugu 3rd most spoken language, experts disagree Per experts' opinion, if we take people's mother tongue into consideration, then Telugu would be the 2nd most spoken language in India. Any thoughts on this? https://timesofindia.indiatimes.com/city/hyderabad/chatgpt-bing-blinks-on-telugu-language-mostly-off-the-mark/articleshow/98106562.cms

Labels: , , , , , ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Monday, February 27, 2023

Disney+ Hotstar, BBC Studios to make a Telugu version of Dead Pixels

"Disney+ Hotstar, BBC Studios to make a Telugu version of Dead Pixels https://www.televisual.com/news/disney-hotstar-bbc-studios-to-make-a-telugu-version-of-dead-pixels/

Labels: , , , ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Saturday, February 18, 2023

New Yorker interview with "RRR" director - S.S. Rajamouli

'The Man Behind India’s Controversial Global Blockbuster “RRR”' https://www.newyorker.com/culture/the-new-yorker-interview/the-man-behind-indias-controversial-global-blockbuster-rrr-s-s-rajamouli

Labels: , , , , , , ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Saturday, February 04, 2023

Veteran Telugu filmmaker K. Viswanath passes away at 92

Padma Shri awardee, filmmaker K Vishwanath has died. He was 92. Read more here

Labels: , , , , ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Sunday, October 02, 2011

First International Telugu meet begins

The first international Telugu Internet conference began here on Wednesday. Unicode Consortium vice-president and Unicode Technical Committee Lisa Moore delivered the keynote address at the First International Telugu Internet Conference organised jointly by Andhra Pradesh Government, SiliconAndhra and Global Internet Forum for Telugu (GIFT).

Minister for Information Technology and Computers Ponnala Lakshmaiah said that Andhra Pradesh Government had become a permanent member of the Unicode Consortium. Attempts were being to develop six fonts to begin with. The Minister said that he would donate the Rs. 6 lakh needed for developing one font to be named after his family ‘Ponnala'. Principal Secretary for Information Technology and Computers Sanjay Jaju said that Andhra Pradesh Government was the only Government to become a full member of the Unicode Consortium. He said that the full membership would give the Government voting rights and a lot of space for Telugu language on the internet.

He said the Minister was the first to come forward to contribute for the development of a Telugu font. He said a unicode font for cellphone would also be developed soon.

Former Minister and honorary chairman of the conference Mandali Buddha Prasad said that internet was the only thing that could integrate the Telugus all over the world. Languages with smaller populations have made tremendous advances in the field of computers and internet. Andhra Pradesh Society for Knowledge of Networks CEO A. Amarnath Reddy said making Telugu more internet friendly would improve the chances of Telugu people getting better jobs.

Tokyo University of foreign Studies faculty Peri Bhaskara Rao and University of Hyderabad faculty memberG. Uma maheswara Rao. TV 9 CEO Ravi Prakash spoke. Several language and computer experts are presenting papers in the three-day conference closing on Friday. Chief Minister N.Kiran Kumar Reddy is scheduled to address the delegates through the internet on the closing day for 15 minutes beginning at 9.30 a.m. local time.

Courtesy: The Hindu

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Wednesday, October 07, 2009

తెలుగు పీఠానికి సాయం చేయండి!

"అమెరికా ప్రపంచంలో చాలా రాజ్యాలను ప్రభావితం చేయగలుగుతుంది.. అక్కడ మనగలిగి ప్రచారంలోకి వస్తే ఆ భాష విశ్వవ్యాప్తం కావటం సులభం అవుతుంది'' అంటారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ వేమూరి వెంకటేశ్వరరావు. ఆ పని జరగాలంటే అక్కడ తెలుగు పీఠాల అవసరం ఎంతైనా ఉందంటారు. ఆయన ప్రస్తుతం అమెరికాలోని విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయంలో మాత్రమే తెలుగు పీఠం ఉంది. అది మరికొన్నేళ్లలో మూతపడే అవకాశం ఉన్నందున కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్కిలీలో తెలుగు పీఠం ఏర్పాటుకు ప్రవాసాంధ్రులు గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. వీటిలో రావు విశేషమైన కృషి చేస్తున్నారు. ఈ ప్రయత్నాలలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన వేమూరి రావును 'నవ్య' పలకరించింది. ఆ విశేషాలలోకి వెళ్తే..

నవ్య: బర్కిలీలో తెలుగు పీఠం ఏర్పాటు ఎక్కడిదాకా వచ్చింది?
రావు: విరామం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. అనేక మంది మిత్రులు- అమెరికాలోను, ఇక్కడా మద్దతు ఇస్తున్నారు. పీఠం ఏర్పాటుకు సంబంధించి ఏం చేస్తున్నామో స్థూలంగా చెబుతాను. ప్రస్తుతం విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయంలో వెల్చేరు నారాయణరావుగారి నేతృత్వంలో ఒక పీఠం ఉంది.

ఆయన పదవీ విరమణ చేసిన తరువాత ఆ పీఠాన్ని తెలుగుకు కాకుండా మరో భాషకు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే అమెరికాలో ఉన్న ఏకైక తెలుగు పీఠం మూసేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల బర్కిలీలో తెలుగు పీఠం ఏర్పాటు చెయ్యాలని అమెరికాలోని తెలుగువారు ప్రయత్నిస్తున్నారు.

నవ్య: అమెరికాలో ప్రతి నలుగురు ప్రవాస భారతీయులలోను ఒకరు ఆంధ్రులు. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది..?
రావు: ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విస్కాన్సిన్‌లో తెలుగు పీఠానికి కావాల్సిన సొమ్మును అమెరికా ప్రభుత్వమే ఇస్తూవచ్చింది కాని దాన్ని తెలుగువాళ్లు ఎక్కువగా ఉపయోగించుకోలేదు. అందువల్లనో మరెందువల్లనో ఆ పీఠాన్ని మరొక భాషకు ఇవ్వాలని నిర్ణయించారు.

ఎక్కువ మంది ఎందుకు చదువుకోవటం లేదని విశ్లేషిస్తే - విస్కాన్సిన్‌ విపరీతమైన చలి ప్రదేశం. అందువల్ల కాలిఫోర్నియా, జార్జియా, అట్లాంటా వంటి ప్రదేశాల్లో ఉన్నట్టుగా అక్కడ మనవాళ్లు ఉండలేరు. దాంతో అక్కడ తెలుగు ప్రజలు తక్కువ, విద్యార్థులు ఇంకా తక్కువ.

నవ్య: బర్కిలీలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడదని ఎలా చెప్పగలం?
రావు: విస్కాన్సిన్‌లో పీఠం అమెరికా ప్రభుత్వ సొమ్ముతో నడుస్తోంది. కాని బర్కిలీలో పీఠం నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం - పది లక్షల డాలర్లు ( నాలుగు కోట్ల డెబై ్బ లక్షల రూపాయలు ) మనం సేకరించి ఇస్తే తెలుగు పీఠాన్ని ఏర్పాటు చేయటానికి ఒప్పుకుంది. అంటే ఆ సొమ్ముతో పీఠానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.

ఒకసారి పది లక్షల డాలర్లను మూలధనంగా సమకూర్చుకోగలిగితే శాశ్వతంగా పీఠం ఏర్పడుతుంది. దీని కోసం గత రెండేళ్లుగా మేం ప్రయత్నాలు చేస్తున్నాం. అందరి సహకారంతో దాదాపు మూడు లక్షల యాభై వేల డాలర్లు ( ఒక కోటీ అరవై నాలుగు లక్షల రూపాయలు ) దాకా సేకరించాం. దీనిని విశ్వవిద్యాలయానికి అందించాం. అప్పుడు వారు తాత్కాలిక ప్రాతిపదికన- తెలుగును బోధించటానికి ఒక బోధకురాలిని నియమించారు. అంతవరకూ బానే ఉంది.

కాని ఇటీవల నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కొన్ని కోట్ల డాలర్లు నష్టపోయింది. అదృష్టవశాత్తు మనం ఇచ్చిన సొమ్మును వారు ఎక్కడా పెట్టుబడి పెట్టలేదు. ఆ విధంగా మనం సేకరించిన సొమ్ముకు నష్టం రాకుండా బయటపడ్డాం. కాని వీలైనంత త్వరలో మిగిలిన సొమ్మును వారికి అందించాల్సిన అవసరం ఉంది.

నవ్య: మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇక్కడివారి నుంచి సాయం అడిగారా?
రావు: గతంలో మన రాష్ట్రంలోని తెలుగు విశ్వవిద్యాలయంతో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఈ పీఠానికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలుగు విశ్వవిద్యాలయం కొంత సొమ్మును కూడా అందించింది. ఆ తర్వాత నిధుల కొరత వల్ల కాబోలు.. దానిపై కూడా కోత పడింది.

తెలుగు విశ్వవిద్యాలయం ఇవ్వాల్సిన సొమ్మును ఇచ్చి, ప్రభుత్వమూ సహకరిస్తే - తెలుగు పీఠం ఏర్పాటు పెద్ద కష్టం కాదు. ఈ పరిణామాలను వివరించి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరడానికి ముఖ్యమంత్రిగారిని కలిసి సాయం అర్థించాల్సి ఉంది. ప్రభుత్వమే కాదు.. తెలుగు భాష మీద మమకారం ఉన్నవారందరూ మాకు సహకరించాలి. అప్పుడే ఈ ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

నవ్య: తెలుగు భాషాభిమానుల నుంచి స్పందన ఎలా ఉంది?
రావు: అందరికీ ఈ ప్రయత్నం సఫలమవ్వాలనే ఉంది. కాని పది లక్షల డాలర్లు సేకరించటం అంత సులభమైన పని కాదు. ఇది మాకు ముందే తెలుసు. అయినా పట్టువీడకుండా ప్రయత్నిస్తున్నం లేదు. తెలుగుభాష అమెరికాలో కలకాలం నిలిచిపోవాలంటే ఇదొక మంచి అవకాశం. దీనిని వదిలేసుకుంటే మళ్లీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. అంతేకాకుండా ఈ ప్రయత్నంలో కొంత వరకూ విజయం సాధించాం కాబట్టి మరింత ముందుకు వెళ్తేనే మంచిది.

నవ్య: మీరు తెలుగులో అనేక సైన్స్‌ పుస్తకాలు రాశారు. ప్రస్తుతం తెలుగులో సైన్స్‌ పరిభాష మీద మీ అభిప్రాయమేమిటి?
రావు: సైన్స్‌కు సంబంధించిన మరిన్ని తెలుగు పదాలు రావాల్సిన అవసరం ఉంది. కేవలం వీటిని పుట్టిస్తే చాలదు. వాటిని ప్రచారంలోకి కూడా తేవాలి. ఇక్కడ మీకో ఉదాహరణ చెబుతా. వికీపీడియా అనేది మన కళ్ల ముందు పుట్టింది. పీడియా అంటే విజ్ఞాన సర్వస్వం అని మనకు తెలుసు. హవాయ్‌లో వికీ వికీ అంటే చకచక అని అర్థం. వేగంగా వెళ్లే బస్సులను వికీ అని పిలుస్తారు.

ఏ సమాచారాన్నైనా వేగంగా అందించటం వికీపీడియా ప్రధాన లక్షణం. వికీపీడియా రూపకర్త దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఆ పేరును పెట్టాడు. హవాయ్‌ భాషలో ఉన్న ఒక పదం ఇంత విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినప్పుడు..తెలుగు పదాలను మనం ఎందుకు ప్రచారంలోకి తేలేకపోతున్నాం? తెలుగులో గబగబ..చకచక..లాంటి పదాలు ఉన్నాయి. మన ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు గబగబ అనో చకచక అనో ఎందుకు పేరు పెట్టుకోకూడదు? కొందరికి నా వాదన మొండిగా అనిపించవచ్చు.

కాని హవాయ్‌ భాషకు సాధ్యమైనది తెలుగుకి ఎందుకు కాదు? దీనికి నా దృష్టిలో ప్రధాన కారణం- ఇంగ్లీషు భాషపై మనకున్న మోజు. బ్రిటిష్‌వారికి ఫ్రెంచ్‌ అంటే మోజు. దానిలో మాట్లాడితే గొప్ప అని వారు భావిస్తారు. మనకి ఇంగ్లీషు.. అంతే తప్ప తెలుగు పదాలను ప్రచారంలోకి తేవటానికి భారీగా ప్రయత్నాలు జరగటం లేదు.

నవ్య: ఇంగ్లిషు విశ్వజనీనమైన భాష అయినప్పుడు దానిలోనే నేర్చుకోవటం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి కదా..
రావు: నేను ఇంగ్లీషు నేర్చుకోవద్దనటం లేదు. అది తిండి పెట్టే భాష. దానితో పాటుగా తెలుగును కూడా నేర్చుకోమంటున్నా. పరిపుష్ఠం చేయమంటున్నా. మీరు పుట్టకముందు సంగతి ఒకటి చెబుతా.

1968లో కంప్యూటర్‌కు సంబంధించిన అంశాలను అచ్చమైన తెలుగులో వివరిస్తూ వ్యాసాలు రాశాను. అవి పత్రికల్లో ప్రచురితమయ్యాయి కూడా. పుస్తకంగా వేద్దామనుకున్నాం కాని కుదరలేదు. అప్పుడే మనం కంప్యూటర్‌కు సంబంధించిన కొన్ని పదాలను ప్రచారంలోకి తెస్తే- ఇప్పుడు ఇంగ్లీషుపై ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా..?

నవ్య: మీ వంతు ప్రయత్నాలు ఇంకా ఏం చేస్తున్నారు?
రావు: నేను ఇండియా వదిలేసి చాలాకాలమయి పోయింది. నెట్‌లో సైన్స్‌కు సంబంధించి అనేక వ్యాసాలు రాస్తున్నా. ప్రస్తుతం మాత్రం తెలుగు పీఠంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించా. మీ ద్వారా పాఠకులకు నా విన్నపం ఒకటే. తెలుగును బతికించుకోవాలంటే అందరం కలిసి సంఘటితంగా ముందుకు వెళ్లాలి.

అందరూ తలో చేయి వేయాలి. ఒక రూపాయా.. పది రూపాయలా అనేది ప్రశ్న కాదు. తెలుగు పీఠానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ కింది ఫోన్‌ నెంబర్‌ను సంప్రదించవచ్చు 9491822218.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం - పది లక్షల డాలర్లు ( నాలుగు కోట్ల డెబై ్బ లక్షల రూపాయలు ) మనం సేకరించి ఇస్తే తెలుగు పీఠాన్ని ఏర్పాటు చేయటానికి ఒప్పుకుంది. అంటే ఆ సొమ్ముతో పీఠానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఒకసారి పది లక్షల డాలర్లను మూలధనంగా సమకూర్చుకోగలిగితే శాశ్వతంగా పీఠం ఏర్పడుతుంది. దీని కోసం గత రెండేళ్లుగా మేం ప్రయత్నాలు చేస్తున్నాం. అందరి సహకారంతో దాదాపు మూడు లక్షల యాభై వేల డాలర్లు ( ఒక కోటీ అరవై నాలుగు లక్షల రూపాయలు ) దాకా సేకరించాం.

-సివిఎల్‌ఎన్‌

Courtesy: ఆంధ్ర జ్యోతి

Prof Vemuri Rao UC Davis university california Berkeley Andhra USA America united states classical

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Wednesday, October 22, 2008

India's First Lunar Mission launched from Andhra Pradesh


నింగికెగిరిన చంద్రయాన్‌-1
సంపూర్ణ ఫలితానికి 8 వరకూ ఆగాల్సిందే
శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
ఇతర దేశాల నుంచీ ప్రశంసలు
శ్రీహరికోట, నెల్లూరు- న్యూస్‌టుడే


ప్రపంచం మొత్తం ఆసక్తిగా మనవైపే చూస్తున్నవేళ.. గగనమంతా కరిమబ్బులు పందిళ్లు వేసినట్లు ఉన్న సమయాన.. సన్నని జల్లులే అక్షింతలైన శుభతరుణంలో.. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) తన అవిరళకృషితో భారతావని కీర్తిని అంతరిక్ష చిత్రపటంలో ఆ'చంద్ర'తారార్కం చేసింది. భారతీయుల ప్రతిష్ఠను చందమామ నుంచి చాటేందుకు సిద్ధమైన చంద్రయాన్‌-1 ఉపగ్రహాన్ని తీసుకొని ప్రయోగ వాహకనౌక పీఎస్‌ఎల్‌వీ సి-11 బుధవారం ఉదయం 6.22 గంటలకు వీక్షకుల కరతాళ ధ్వనుల మధ్య శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీంతో చంద్రుడి మీదకు యాత్ర చేపట్టిన ఆరో దేశంగా భారత్‌ అవతరించింది. ఉరుములు, వర్షం మంగళవారం సాయంత్రం నుంచి శాస్త్రవేత్తలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. అయితే బుధవారం ఉదయానికల్లా వరుణుడు కరుణించాడు. దీంతో ప్రయోగాన్ని చేపట్టారు.

ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 255 కి.మీ.ల పెరిజి (భూమికి అతి దగ్గరగా ఉండే బిందువు).. 22,860 కి.మీ.ల అపోజి (భూమికి అతి దూరంగా ఉండే బిందువు)తో ఉన్న దీర్ఘవృత్తాకార భూకక్ష్యలోకి 1,380 కేజీల చంద్రయాన్‌ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సి-11 విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో 49 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జరిగిన చంద్రయాన్‌-1లోని తొలి దశ ప్రయోగం విజయవంతంగా ముగిసింది.

రెండోదశలో చంద్రయాన్‌ ఉపగ్రహం భూకక్ష్యను విడతలవారీగా పెంచుకొంటూ వెళ్లి చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెడతారు. మూడోదశలో చంద్రుని చుట్టూ 100 కి.మీ.ల దూరంలో రెండేళ్లపాటు పరిభ్రమించేలా చంద్రయాన్‌ ఉపగ్రహ కక్ష్యలను నియంత్రిస్తారు. ఇందుకోసం ఉపగ్రహంలో ఉన్న లిక్విడ్‌ అపోగీ మోటార్‌ (లామ్‌)ను అవసరమైన సమయంలో పేలుస్తారు. అనంతరం ఉపగ్రహంలోని 11 ప్రయోగ పరికరాలను పనిచేసేలా చేస్తారు. దీంతో చంద్రయాన్‌ ఉపగ్రహం పూర్తిస్థాయిలో విజయవంతమైనట్లు ధ్రువీకరిస్తారు. ఈ మొత్తం కార్యక్రమం నవంబరు 8వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ పనిని ఇస్రోకు చెందిన టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఇస్ట్రాక్‌) చేపడుతుంది. నవంబర్‌ 8 తరువాత చంద్రయాన్‌-1 నుంచి వచ్చే సంకేతాలను బెంగళూరుకు సమీపంలోని బ్యాలాలులో ఉన్న డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ (డీఎస్‌ఎన్‌) చేపడుతుంది.

1,380 కేజీల చంద్రయాన్‌ ఉపగ్రహంలో 880 కేజీల ఇంధనాన్ని నింపారు. ఇందులో సుమారు 760 కేజీల ఇంధనాన్ని ఉపయోగించుకొని ఉపగ్రహం భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్యలోకి చేరుకోగలుగుతుంది. చంద్రుని కక్ష్యలోకి చేరే సమయానికి ఉపగ్రహంలో సుమారు 100 నుంచి 120 కేజీల ఇంధనం మాత్రమే మిగులుతుంది. ఇది చంద్రుని చుట్టూ పరిభ్రమించే సమయంలో ఉపగ్రహాన్ని నియంత్రించేందుకు ఖర్చవుతుంది.

చంద్రయాన్‌-1 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించడంతో షార్‌లోని మిషన్‌ కంట్రోల్‌లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. చంద్రయాన్‌-1.. భారతీయులకు ఓ మధుర జ్ఞాపకమని ఇస్రో ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రయాన్‌-1 ప్రాజెక్టు డైరెక్టర్‌ మైలస్వామి అన్నాదురై మాట్లాడుతూ.. ''మా బేబీ జాబిలి దిశగా పయనం ఆరంభించింది'' అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లు ఇస్రోకు అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కూడా ఇస్రోపై ప్రశంసల జల్లు కురిపించాయి. రూ.386 కోట్లతో చేపట్టిన చంద్రయాన్‌-1.. ఇప్పటి వరకూ చేపట్టిన అంతరిక్ష యాత్రలన్నింటిలోకి అత్యంత చౌకైనదిగా భావిస్తున్నారు. చంద్రయాన్‌-1 తొలిసారిగా చంద్రుడి త్రీడీ మ్యాప్‌లు తయారుచేస్తుంది.
Courtesy: ఈనాడు
*****

Hyderabad, Oct 22 (IANS) Andhra Pradesh Chief Minister Y.S. Rajasekhara Reddy Wednesday congratulated Indian space scientists on the successful launch of the country’s first unmanned moon mission Chandrayaan-I. The chief minister, in his congratulatory message to Indian Space Research Organisation (ISRO) chief Madhavan Nair, said it was a truly historic moment for the entire country and “more so for Andhra Pradesh since it is from our soil that the Chandrayaan-I lifted off successfully”.

“I wholeheartedly congratulate all the space scientists and all others connected with the Chandrayaan-I mission. The whole nation is proud of you all today as India enters the moon club.”

Wednesday morning’s launch was a historic and momentous event, he said.

“I am happy that the launch was perfect and precise. With this, we have completed the first leg of the mission and it will take 15 days to reach the lunar orbit.”

The chief minister hoped that the mission will help Indian scientists locate He-3, which has the potential to produce a large amount of energy. The scientists hope to transport it to the earth to run nuclear plants.

The 44.4-metre-tall, 316-tonne rocket, Polar Satellite Launch Vehicle (PSLV-C11), had a copybook launch at 6.22 a.m. from Sriharikota in Andhra Pradesh Wednesday morning and completed its mission by placing Chandrayaan-1 into its scheduled orbit around the earth within 18 minutes, as planned.

The spacecraft carries 11 scientific instruments, five from India and six from universities and laboratories of the European Space Agency, the US and Bulgaria.

Courtesy: ThaIndian

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Wednesday, May 30, 2007

Telugus dominate IIT-JEE 2007

ఐఐటీలో తెలుగు వెలుగులు
ఎంట్రన్స్‌లో వేలాదిగా ర్యాంకులు


ఐటీ-జేఈఈ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. గత కొన్నేళ్లుగా అధికశాతం సీట్లతో విజయబావుటా ఎగరేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఈసారి మరింతగా మంచి ఫలితాలు సాధించారు. రాష్ట్రంలోని పలు కార్పొరేట్‌ విద్యాసంస్థలు సహా ఐఐటీ కోచింగు కేంద్రాలు.. వందల సంఖ్యలో తమ విద్యార్థులు ఐఐటీ ర్యాంకులు సంపాదించినట్లుగా ప్రకటించాయి. ఇవన్నీ పరిశీలిస్తే గత ఏడాదికన్నా ఈసారి సీట్లు సాధించగల ర్యాంకులు కనీసం రెండు రెట్లు అధికంగా వచ్చాయి. దాదాపు 2 వేల ర్యాంకులు వచ్చినట్టు అంచనా. నిజానికి గతంతో పోలిస్తే తాజా ర్యాంకుల సంఖ్య బాగా పెరగడానికి కొన్ని ముఖ్య కారణాలను విద్యావేత్తలు పేర్కొంటున్నారు. వాటిలో ప్రధానమైనది.. విశ్లేషణాత్మక ప్రశ్నలు గాకుండా రెండేళ్లుగా ఐఐటీ ప్రవేశపరీక్షలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తుండటం. విశ్లేషణాత్మక జవాబులు రాసే దిశలో ఇన్నాళ్లూ కోచింగు ఇచ్చే విద్యాసంస్థలు.. మారిన ప్రశ్నల సరళికి అనుగుణంగా వాటి శిక్షణ విధానాన్ని ఈసారి గణనీయంగా మార్చేసుకున్నాయి. గతంలో శిక్షణ విధానం మార్చుకోవడంలో ఒకింత తడబడిన విద్యాసంస్థలూ ఈసారి గాడిన పడ్డాయి. పైగా రకరకాల ప్రవేశపరీక్షల్లో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు జవాబులు రాయటానికి అలవాటుపడిన మన విద్యార్థులు... ఈ మారిన ప్రశ్నల సరళిని అద్భుతంగా వినియోగించుకున్నారు. అలాగే ఈసారి సీట్ల సంఖ్య పెరిగి, ఆ మేరకు మన ర్యాంకుల వాటా కూడా పెరిగింది. ఈ సంవత్సరం రాష్ట్రానికి చెందిన 25 వేల మంది దాకా పరీక్ష రాసినట్లు అంచనా. దేశంలోని ఏడు ఐఐటీలకు తోడు బెనారస్‌లో ఐటీబీహెచ్‌యూ, ధన్‌బాద్‌లోని ఐఎస్‌ఎంలో ప్రవేశాలకూ ఈ ర్యాంకులే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వీటన్నింటిల్లో 5,444 సీట్లున్నాయి. ఇవేగాకుండా ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ పేరిట లెక్కలు, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రాల్లో ప్రత్యేక కోర్సులను ప్రారంభించనున్నారు. వీటికై పుణె, కోల్‌కతా కేంద్రాల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి (ఐఐఎస్‌ఈఆర్‌), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో సీట్లు సుమారు 400 దాకా ఉంటాయి. వీటిల్లో ప్రవేశాలకూ ఐఐటీ ర్యాంకులే ప్రాతిపదిక. అదనపు మెరిట్‌ జాబితా (ఈఎంఎల్‌) పేరిట ఈసారి రెగ్యులర్‌ ఐఐటీ ర్యాంకులకు అదనంగా వందలాది మందిని ఎంపిక చేశారు. కటాఫ్‌ మార్కులకు 0.5 శాతం తక్కువ మార్కులు వచ్చిన వారిని ప్రిపరేటరీ అర్హులుగా ప్రకటించారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, మరుసటి సంవత్సరం మళ్లీ ఐఐటీ ప్రవేశ పరీక్ష రాయిస్తారు. అందులో మంచి ర్యాంకులు వస్తే సీట్లు దొరుకుతాయి. ప్రత్యేక శిక్షణవల్ల వీరి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు. ఇలా ఈసారి ఐఐటీ అర్హుల సంఖ్య రాష్ట్రంలో బాగా పెరిగిపోయింది. ఈసారి ప్రశ్నపత్రం సులభంగా రావడం కూడా మన ర్యాంకుల పెరుగుదలకు మరో ప్రధాన కారణంగా చెబుతున్నారు. రాష్ట్రంలో ర్యాంకులు పెరగడం మంచిదే అయినా... ఈసారి ప్రశ్నపత్రం ఐఐటీ స్థాయికి తగినట్లు లేనేలేదనీ, ఇదిలా కొనసాగడమూ మంచిది కాదనీ వివిధ విద్యాసంస్థల్లోని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రతిభ గలవారు, లేనివారూ ఒకే గాటన చేరుతున్నారని, ప్రతిభ నిరూపణ జరగడంలేదని వారి విశ్లేషణ. రెగ్యులర్‌ ఐఐటీ ర్యాంకులు, ఈఎంఎల్‌ ర్యాంకులు కలిసి రాష్ట్రంలో కనీసం 2000 ర్యాంకులు వచ్చినట్లుగా అంచనా. దీంతో దేశంలోని అన్ని ఐఐటీ క్యాంపసులలోనూ మనవాళ్ల ఆధిపత్యం కొనసాగుతుందనడంలో సందేహం లేదు.

బాలురదే హవా
ముంబయి: ఐఐటీ-జేఈఈలో బాలుర హవా కొనసాగింది. దేశవ్యాప్తంగా 2,43,029 మంది ఈ పరీక్షకు పోటీపడ్డారు. ఇందులో 7209 మంది అర్హత సాధించారు. ఈ దఫా 54,025 మంది విద్యార్థినులు పరీక్ష రాయగా, 587 మందే అర్హత సాధించారు. పంజాబ్‌కు చెందిన అక్సిన్‌ బన్సాల్‌ దేశంలోనే టాపర్‌గా నిలిచారు. బాలికల విభాగంలో ముంబయికి చెందిన అంకిత శర్మ (55వ ర్యాంకు) ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఓబీసీ రిజర్వేషన్లను అమలుచేయడం లేదని జేఈఈ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ పండాలాయ్‌ చెప్పారు.

జిప్‌మర్‌ ఫలితాలూ విడుదల:
బుధవారం జిప్‌మర్‌ ఫలితాలూ విడుదలయ్యాయి. ఈ జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలో ఒకటి, పది ర్యాంకుల్ని శ్రీ చైతన్య గ్రూపు విద్యార్థులు సాధించారు.


Courtesy: ఈనాడు

*****



Over 600 students from State may get admission into various IITs

BRILLIANT BRAINS: Ankit (left) and Santosh Kumar in a jubilant mood in Hyderabad on Wednesday. — Photo: G. Krishnaswamy

HYDERABAD: Students from the State have reaped a rich harvest in the Indian Institutes of Technology - Joint Entrance Examination (IIT-JEE) this year and more than 600 students are likely to get admission into various IITs.

The top ranker from the State this year is Santosh Kumar who secured all India 15th rank and he belongs to Narayana IIT Academy at Habsiguda. The second best rank from the State is Varun Tripuraneni, a student of Ramaiah coaching institute. Varun secured 18th rank.

Mr. Ramaiah's institute continued its good performance with 115 students out of the 135 getting ranks and these include 12 ranks below 100. Satish Kumar got 7th rank in the SC category. Mr. Ramaiah said 80 out of the 115 are from areas other than Hyderabad indicating the growing awareness of IIT education in the State.

Corporate colleges also contributed heavily to the success story. Narayana Group of institutions claimed that 1,149 students from its institutions would get into IITs this year of which 623 are from the State alone. About 180 students from the reserves category were also successful. Similarly, Sri Chaitanya Institutions claimed that 344 students from its institutions in the State would get into IITs. Another 259 qualified for other institutes like IIST and AISR.

Both the institutes claimed the all India 6th ranker Ankit as `their' student. However, Ankit later at a press conference, clarified that he had registered for Test Series of Sri Chaitanya but also pursued Intensive Condensed Classroom programme of Narayana institution.

The FIITJEE centre in Hyderabad said 91 of its classroom programme students got a place in the merit list. Similarly, Delta Education Academy said 41 students out of the 90 who appeared got seat-securing ranks from its institute. Other institutes like Krishna Murthy IIT Academy and PAGE claimed a lot of their students also secured good ranks.

State topper Santosh Kumar prefers to join Computer Science at IIT Kanpur. He scored 962 marks in Intermediate and 41st rank in EAMCET.

Courtesy: The Hindu

*****

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Wednesday, February 07, 2007

Silicon Fab City in Hyderabad : some updates

నిరంతర విద్యుత్తు, నీరు
ఇతర పరిశ్రమల్లాగే రాయితీలు
ముఖ్యమంత్రి సమీక్షలో కీలక నిర్ణయాలు

సెజ్‌లకు మించిన రాయితీలిస్తాం: పృథ్వీరాజ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఫ్యాబ్‌సిటీ అభివృద్ధికి సంబంధించి మంగళవారం పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఫ్యాబ్‌సిటీలో కంపెనీలకు కేటాయించే స్థలాల్ని ఎకరానికి రూ.20 లక్షల చొప్పున విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన ఈక్విటీలో దీనిని జమ చేయనుంది. ఫ్యాబ్‌సిటీపై మంగళవారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో భారీ పరిశ్రమల మంత్రి గీతారెడ్డి, పరిశ్రమల సలహాదారు సి.ఎస్‌.రావు, ముఖ్యకార్యదర్శి లక్ష్మిపార్థసారధి, ఏపీఐఐసీ ఎండీ బి.పి.ఆచార్య తదితరులు పాల్గొన్నారు. ఫ్యాబ్‌సిటీ కోసం దాదాపు 1200 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం... మొదటిదశలో 300 ఎకరాల్ని అభివృద్ధి చేస్తోంది. ఇందులో 75 ఎకరాల్ని సెమ్‌ ఇండియాకు కేటాయించింది. కేంద్రం రాయితీలు ప్రకటించిన తర్వాత స్థలాల ధరల్ని నిర్ణయించాలని తొలుత భావించింది. కానీ ఇప్పటిదాకా కేంద్ర విధానం ఖరారు కాలేదు. దీంతో సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. పరిశ్రమల శాఖ అధికారులు ఎకరానికి రూ. 20 లక్షల ధర ప్రాథమిక ధరను ప్రతిపాదించగా దానిని ముఖ్యమంత్రి ఆమోదించారు. ఫ్యాబ్‌సిటీలో ప్రభుత్వ ఈక్విటీ 11 శాతం కాగా, భూముల్ని విక్రయించడం ద్వారా వచ్చే మొత్తాన్ని కూడా అందులో జమ చేయాలని సూచించారు. మొత్తం 1200 ఎకరాలకు కంచె ఏర్పాటు చేయాలని వైఎస్‌ ఆదేశించారు.

'ఫ్యాబ్‌సిటీ' ప్రతిపాదనలివీ...
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే

* ఫ్యాబ్‌సిటీకి రోజుకు 20 మిలియన్‌ గ్యాలన్ల నీటి పంపిణీకి పైపులైన్ల ఏర్పాటు
* మురుగునీటి పారుదల లైన్ల ఏర్పాటు
* 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు ఫీడర్‌ నిర్మాణం
* ఇతర పరిశ్రమల మాదిరిగానే సబ్సిడీపై విద్యుత్‌ సరఫరా
- వంటి ప్రతిపాదనల్ని కూడా వైఎస్‌ ఆమోదించారు. మొదటిదశ నిర్మాణ పనులను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. ఫ్యాబ్‌సిటీ అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టాలని సూచించారు.

త్వరలోనే జీవో: గీతారెడ్డి
ఫ్యాబ్‌సిటీకి కేంద్ర సూత్రప్రాయంగా ఆమోదాన్ని తెలిపిందని, రాయితీలపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశముందని మంత్రి గీతారెడ్డి తెలిపారు. ఫ్యాబ్‌సిటీ మొదటిదశ పనులపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఇప్పటికే దీనికి కాలుష్య నియంత్రణ మండలి అనుమతులతో పాటు ప్రభుత్వపరంగా అన్ని పనులకు ఆమోదం లభించిందని తెలిపారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని, ఇందులో స్థలాల ధర గురించి పేర్కొంటామని చెప్పారు.

బడ్జెట్‌ ముందే ప్రకటిస్తాం: చవాన్‌
సెమీకండక్టర్‌ పరిశ్రమ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానం బడ్జెట్‌కు ముందుగానే వెలువరించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ పేర్కొన్నారు. సెమీకండక్టర్లపై హైదరాబాద్‌లో జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడుతూ... బడ్జెట్‌కు ముందుగానే సెమీకండక్టర్‌ విధానాన్ని విడుదల చేసి, రాయితీలతో సహా అవసరమైన అన్ని వివరాల్ని అందిస్తామని చెప్పారు. ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రస్తుతం ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్‌) ప్రభుత్వం అందిస్తున్న వాటికన్నా అధికంగా ఉంటాయని హామీనిచ్చారు. ప్రతిపాదిత ప్యాకేజీ ఎల్సీడీ, ప్లాస్మా డిస్‌ప్లే టెక్నాలజీ, సొలార్‌, ఫొటో వోల్టాయిక్‌ సెల్స్‌ తదితర సెమీకండక్టర్‌ ఆధారిత ఉపకరణాల తయారీరంగానికి సైతం వర్తిస్తుందని వివరించారు. దేశంలో ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్న తయారీ రంగంలో సెమీకండక్టర్ల తయారీ అత్యంత కీలక పాత్ర పోషించనుందని చవాన్‌ అభిప్రాయపడ్డారు.

ఫ్యాబ్‌సిటీలో సోలార్‌సెమ్‌ యూనిట్‌

ఫ్యాబ్‌సిటీలో పరిశ్రమ స్థాపనకు సోలార్‌ సెమ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అనే మరో సంస్థ ముందుకు వచ్చింది. తొలిదశలో సుమారు 3కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ సంస్థకు 10 నుంచి 25 ఎకరాల స్థలం కేటాయించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థ స్థాపనకు పర్యావరణ అనుమతి కూడా లభించిందని వివరించాయి. దశలవారీగా ఇది పెట్టుబడిని 25 కోట్ల డాలర్లకు పెంచుతుందని తెలిపాయి.



Courtesy: ఈనాడు

Labels: , , , , , ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Sunday, February 04, 2007

Ugadi Telugu Creative Writing Contest

Ahead of Sarvajit Nama Ugadi (March 20, 2007), Vanguri Foundation of America, Inc has announced the 12th Telugu Creative Writing Contest open for all writers of North America and also for all Telugu writers present globally.

The contest, conducted for the past eleven years, is intended to encourage and inspire all Telugu writers to continue their creative writing. A panel of qualified Telugu Literary persons of North America and India will judge the winning entries.

The Contest categories include (1) Short Story (2) Kavitha and (3) Essay (4) Novel

Two prizes ($116 and $58) will be awarded in each of the Short Story, Poetry and Essay categories.

One prize in the novel category will be awarded with Cash Award of $250. The prize money for VFA may increase the prize money for deserving entries. All winners will receive a Certificate of Excellence.

The winning and other selected entries will be published by Vanguri Foundation of America, Inc. in accordance with its publication schedules.

Contest rules are as follows:

1. Submissions to Short Story and Essay categories must be less than 15 hand written pages and 5 pages for Poetry.

Participants are encouraged to explore themes that are related to the various phases of the lives of Telugu Americans, such as professional careers, future expectations or plain utopian dreams and the impact of globalization on the lives of Telugu people.

2. Only original, unpublished works will be accepted. The authors must send their real name, address, phone number and e-mail even though pen name can be used for the purpose of publication.

3. Last date to receive entries is March 20, 2007 (Sarvajit Nama Samvatsara Ugadi Day). Articles can be sent to the following addresses:

By Postal mail:

Vanguri Foundation of America, Inc.
P.O. Box 1948
Stafford, Texas 77497

By E-mail with PDF attachments:

rvanguri@wt. net
phspvr@physics. emory.edu

4. The results of the Contest will be announced on or before June 1, 2007

For more information, please contact

Pemmaraju Venugopala Rao (404) 727 4297 (W)
e-mail: phspvr@physics. emory.edu

Vanguri Chitten Raju (832) 594 9054 (C), (281) 277 0445 (W)
e-mail: rvanguri@wt. net

Courtesy: AndhraCafe

Labels: , ,


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'