Silicon Fab City in Hyderabad : some updates
నిరంతర విద్యుత్తు, నీరు
ఇతర పరిశ్రమల్లాగే రాయితీలు
ముఖ్యమంత్రి సమీక్షలో కీలక నిర్ణయాలు
ఇతర పరిశ్రమల్లాగే రాయితీలు
ముఖ్యమంత్రి సమీక్షలో కీలక నిర్ణయాలు
సెజ్‌లకు మించిన రాయితీలిస్తాం: పృథ్వీరాజ్
హైదరాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఫ్యాబ్‌సిటీ అభివృద్ధికి సంబంధించి మంగళవారం పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఫ్యాబ్‌సిటీలో కంపెనీలకు కేటాయించే స్థలాల్ని ఎకరానికి రూ.20 లక్షల చొప్పున విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన ఈక్విటీలో దీనిని జమ చేయనుంది. ఫ్యాబ్‌సిటీపై మంగళవారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో భారీ పరిశ్రమల మంత్రి గీతారెడ్డి, పరిశ్రమల సలహాదారు సి.ఎస్.రావు, ముఖ్యకార్యదర్శి లక్ష్మిపార్థసారధి, ఏపీఐఐసీ ఎండీ బి.పి.ఆచార్య తదితరులు పాల్గొన్నారు. ఫ్యాబ్‌సిటీ కోసం దాదాపు 1200 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం... మొదటిదశలో 300 ఎకరాల్ని అభివృద్ధి చేస్తోంది. ఇందులో 75 ఎకరాల్ని సెమ్ ఇండియాకు కేటాయించింది. కేంద్రం రాయితీలు ప్రకటించిన తర్వాత స్థలాల ధరల్ని నిర్ణయించాలని తొలుత భావించింది. కానీ ఇప్పటిదాకా కేంద్ర విధానం ఖరారు కాలేదు. దీంతో సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. పరిశ్రమల శాఖ అధికారులు ఎకరానికి రూ. 20 లక్షల ధర ప్రాథమిక ధరను ప్రతిపాదించగా దానిని ముఖ్యమంత్రి ఆమోదించారు. ఫ్యాబ్‌సిటీలో ప్రభుత్వ ఈక్విటీ 11 శాతం కాగా, భూముల్ని విక్రయించడం ద్వారా వచ్చే మొత్తాన్ని కూడా అందులో జమ చేయాలని సూచించారు. మొత్తం 1200 ఎకరాలకు కంచె ఏర్పాటు చేయాలని వైఎస్ ఆదేశించారు.

హైదరాబాద్ - న్యూస్‌టుడే * మురుగునీటి పారుదల లైన్ల ఏర్పాటు * 24 గంటల పాటు విద్యుత్ సరఫరాకు ఫీడర్ నిర్మాణం * ఇతర పరిశ్రమల మాదిరిగానే సబ్సిడీపై విద్యుత్ సరఫరా - వంటి ప్రతిపాదనల్ని కూడా వైఎస్ ఆమోదించారు. మొదటిదశ నిర్మాణ పనులను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. ఫ్యాబ్‌సిటీ అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టాలని సూచించారు. త్వరలోనే జీవో: గీతారెడ్డి ఫ్యాబ్‌సిటీకి కేంద్ర సూత్రప్రాయంగా ఆమోదాన్ని తెలిపిందని, రాయితీలపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశముందని మంత్రి గీతారెడ్డి తెలిపారు. ఫ్యాబ్‌సిటీ మొదటిదశ పనులపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఇప్పటికే దీనికి కాలుష్య నియంత్రణ మండలి అనుమతులతో పాటు ప్రభుత్వపరంగా అన్ని పనులకు ఆమోదం లభించిందని తెలిపారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని, ఇందులో స్థలాల ధర గురించి పేర్కొంటామని చెప్పారు. బడ్జెట్ ముందే ప్రకటిస్తాం: చవాన్ సెమీకండక్టర్ పరిశ్రమ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానం బడ్జెట్‌కు ముందుగానే వెలువరించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. సెమీకండక్టర్లపై హైదరాబాద్‌లో జరుగుతున్న సదస్సులో ఆయన మాట్లాడుతూ... బడ్జెట్‌కు ముందుగానే సెమీకండక్టర్ విధానాన్ని విడుదల చేసి, రాయితీలతో సహా అవసరమైన అన్ని వివరాల్ని అందిస్తామని చెప్పారు. ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రస్తుతం ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్) ప్రభుత్వం అందిస్తున్న వాటికన్నా అధికంగా ఉంటాయని హామీనిచ్చారు. ప్రతిపాదిత ప్యాకేజీ ఎల్సీడీ, ప్లాస్మా డిస్‌ప్లే టెక్నాలజీ, సొలార్, ఫొటో వోల్టాయిక్ సెల్స్ తదితర సెమీకండక్టర్ ఆధారిత ఉపకరణాల తయారీరంగానికి సైతం వర్తిస్తుందని వివరించారు. దేశంలో ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్న తయారీ రంగంలో సెమీకండక్టర్ల తయారీ అత్యంత కీలక పాత్ర పోషించనుందని చవాన్ అభిప్రాయపడ్డారు. |
|
Courtesy: ఈనాడు
Labels: Andhra Pradesh, Fab City, Hyderabad, IT, Semiconductors chips silicon wafers, Software, Telugu