"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Saturday, December 31, 2005

న్యూ ఇయర్ సోకులు


Courtesy: ఆంధ్ర జ్యోతి


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


తెలుగు నెలతో పాటే ఇంగ్లిషు సంవత్సరం

2005వ సంవత్సరం అమావాస్యతో ముగియనుంది. అదీ ఒకే నెలలో వచ్చిన రెండో అమావాస్యతో కావడం అరుదైన విషయం. ఈ నెల 1వ తేదీన మొదటి అమావాస్య వచ్చింది. మళ్లీ 31వ తేదీన రెండవది వచ్చింది. తెలుగు నెల(పుష్య మాసం)తో ఇంగ్లిషు కొత్త సంవత్సరం 2006 ప్రారంభంకానుండటం గమనార్హం. మరోవైపు 2005 ఒక సెకను ఆలస్యంగా ముగియనుంది.

Courtesy: ఈనాడు


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


రేపటి ఇంజినీర్లకు రూట్‌ మ్యాప్‌ !


ముందస్తుగానే కాదు, పకడ్బందీగానూ ఉండాలి... కెరియర్‌ ప్రణాళిక! భావి ఇంజినీర్లకు ఇప్పుడిది మరీ అవసరం. భారీ సంఖ్యలో ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలిపోతూ... విద్యా ప్రమాణాలు ప్రశ్నార్థకమవుతున్న తరుణమిది! అందుకే... ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఫైనలియర్‌లోకి ప్రవేశించకముందే తమ స్థాయిలోనే మెరుగైన భవిష్యత్‌ వ్యూహం రచించుకోవాలి! ముందడుగు వెయ్యాలి!

రగతులూ, సెమినార్లూ, పరీక్షల మధ్య సెమిస్టర్లు దొర్లిపోతుంటాయి. ఈ క్రమంలో వచ్చే మూడో సంవత్సరం... ఇంజినీరింగ్‌ విద్యార్థికి చాలా కీలకమైనది. ఎందుకంటే- వెుదటి రెండు సంవత్సరాల అనుభవంతో కెరియర్‌ పట్ల స్పష్టత వస్తుంది. ఉన్నత విద్య చదవాలా, ఉద్యోగ ప్రయత్నం చేయాలా అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కునేది అప్పుడే. దాన్నిబట్టే ప్రణాళిక వేసుకోగలిగేది.

చదువు, ఉద్యోగం అనే రెండిట్లో ఏదో ఒకదానిపైనే దృష్టి పెట్టటం ఒక పద్ధతి. అయితే రెండిటికీ ప్రయత్నించి, చివరికి మెరుగైనదానిపై వెుగ్గు చూపటం శ్రేయస్కరమని ఎక్కువమంది అభిప్రాయం.

ఎంట్రన్సులు ఎప్పుడు?
ఉన్నతవిద్య కోసం ఎంట్రన్స్‌ పరీక్షలకు మూడో సంవత్సరంలో ప్రిపేరై, నాలుగో సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలపై దృష్టి పెట్టటం ఉత్తమ మార్గమని సీనియర్‌ విద్యార్థులు సలహా ఇస్తున్నారు. గేట్‌, జీఆర్‌ఈ, టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌ లాంటి పరీక్షల స్కోర్‌ 2-5 ఏళ్ళకు వర్తిస్తుంది కాబట్టీ, ఫైనలియర్లో ఒత్తిడి తగ్గుతుంది కాబట్టీ మూడో సంవత్సరంలోనే ఎంట్రన్సులు రాయాలని సూచిస్తున్నారు.
ఎంటెక్‌ మనదేశంలోనే చదవాలనుకునేవారు గేట్‌ రాసి, మంచి స్కోర్‌ వస్తే ప్రతిష్ఠాత్మక సంస్థలైన ఐఐటీలు/ఎన్‌ఐటీల్లో సీటు కోసం ప్రయత్నించవచ్చు. డీమ్డ్‌ యూనివర్సిటీలకు ప్రత్యేకంగా ప్రవేశపరీక్షలు రాయాల్సివుంటుంది.
ఐఐఎంలలో ఎంబీఏ చేయాలనుకుంటే CAT రాయాలి. అయితే దీనికి ఏడాది పాటైనా గట్టిగా ప్రిపరేషన్‌ అవసరమవుతుంది.
విదేశాల్లో ఎం.ఎస్‌./ పీహెచ్‌డీ చేయాలనుకునేవారు GRE , TOEFL /IELTS రాయాల్సివుంటుంది. వీటికి కనీసం 4 నెలల ప్రిపరేషన్‌ అవసరం. విదేశాల్లో ఎంబీఏ చేయాలంటే GMAT కు ప్రిపేరవ్వాల్సివుంటుంది.

రాత పరీక్ష కోసం...
ఈసీఈ, సీఎస్‌ఈ, సీఎస్‌ఐటీ, ఈఈఈ బ్రాంచిలవారు సాధారణంగా సాఫ్ట్‌వేర్‌ రంగం వైపు వెుగ్గు చూపిస్తుంటారు. ఏ కంపెనీ అయినా వెుదట రాతపరీక్ష నిర్వహిస్తుంది. వివిధ కంపెనీల పాత ప్రశ్నపత్రాలను సేకరించి, వాటిని సాధన చేసుకోవాలి.
దీనికి ఇంటర్నెట్‌ సాయపడుతుంది. www.freshersworld.com, www.koolkampus.com, www.ieg.gov.in వెబ్‌సైట్లూ, యాహూ గ్రూప్స్‌లో jkc0405, chetana ఇందుకు ఉపయోగపడతాయి.
రాతపరీక్ష కోసం Verbal & non-verbal reasoning, Quantitative aptitude, Analytical skills ను పెంపొందించుకోవాలి. ఇవన్నీ ప్లేస్‌మెంట్‌ సంబంధిత నైపుణ్యాలు. ఈ నైపుణ్యాలపైనే ఐఈజీకి చెందిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ మిషన్‌ నవంబరు 26- డిసెంబరు 12 తేదీల మధ్య ఉచితంగా శిక్షణ ఇచ్చింది. రాష్ట్రంలోని 52 కాలేజీల్లో 3,150 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు దీన్ని ఉపయోగించుకున్నారు.
ఈసీఈ, సీఎస్‌ఈ, సీఎస్‌ఐటీ, ఈఈఈ బ్రాంచిల వారికి పై నైపుణ్యాలతో పాటు C language, operating systems తెలిసివుండాలి.

ఇంటర్వ్యూలో ఏం అవసరం?
ఇంటర్వ్యూల్లో అభ్యర్థి ఆత్మవిశ్వాస స్థాయి, స్వభావం, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు, సాంకేతిక నైపుణ్యాలూ, ప్రాజెక్టు వర్క్‌లను చూస్తారు.
సాంకేతిక నైపుణ్యాలను పరిశీలించేటప్పుడు 'మీ కోర్సులో మీకు నచ్చిన సబ్జెక్టులేమిటి?' అంటూ అభ్యర్థికే అవకాశాన్ని వదిలేస్తుంటారు. అందుకని కనీసం రెండు సబ్జెక్టుల్లోనైనా పట్టు సాధించాలి. కంప్యూటర్‌ సంబంధిత విద్యార్థులు C language, Data structures, operating systems, micro processors, computer networks తెలుసుకునివుంటే సరిపోతుంది.
జావా, డాట్‌ నెట్‌ లేని విద్యార్థులు కంగారు పడనక్కర్లేదు. ఏ కంపెనీ అయినా తాజా గ్రాడ్యుయేట్లను తీసుకునేటప్పుడు అభ్యర్థి త్వరగా నేర్చుకోగలుగుతాడా? అతడి ఇంజినీరింగ్‌ సబ్జెక్టులో strong గా ఉన్నాడా లేదా అనేది ప్రధానంగా చూస్తుందని గుర్తించాలి.
ప్రాధాన్యం లేని అనవసర విషయాలకు వెచ్చించే సమయం ఎంతో గుర్తించగలిగితే సమయం ఎంతో ఆదా చేసుకోవచ్చు. ప్రతి గంటనూ కెరియర్‌ అభివృద్ధి కోసం వెచ్చించాలనే సంకల్పం ఉండాలి. ఆచరణ దానికి తగ్గట్టు ఉండాలి.

మార్కులు మెరుగ్గా...
కాలేజీలో ఉన్నపుడే కెరియర్‌ ప్రణాళిక వేసుకోవడమంటే కోటలో ఉండి యుద్ధం చేయటం లాంటిది. ీకాలేజీ దాటితే 50 శాతం సంబంధాలు తెగిపోవటమే కాదు, 50 శాతం పోటీ కూడా పెరుగుతుంద'ని జేఎన్‌టీయూ క్యాంపస్‌ కాలేజ్‌లో ఫైనలియర్‌ చదువుతున్న (సివిల్‌) వంశీకృష్ణ చెప్పినమాట విద్యార్థుల అవగాహనను తెలుపుతోంది. గేట్‌ ప్రిపరేషన్‌ వల్ల సబ్జెక్టుపై అధికారం వస్తుందని ఈ విద్యార్థి అభిప్రాయపడ్డారు. ీడిగ్రీ పర్సంటేజి చాలా ముఖ్యం. దాని తర్వాతే ఏదైనా. కొన్ని కంపెనీలు 60-75 శాతం మార్కులుంటే గానీ కాల్‌లెటర్లు పంపించటం లేదు' అన్నారు. ఇతనికి నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌లో సైట్‌ ఇంజినీర్‌గా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ లభించింది.
మరో ఫైనలియర్‌ విద్యార్థి (ఈఈఈ) మహ్మద్‌ ఆసిఫ్‌ హుస్సేన్‌కు సైన్యాధికారి కావాలని వెుదట్నుంచీ లక్ష్యం. అందుకే కిందటి సంవత్సరం ఫిబ్రవరిలో SSB నోటిఫికేషన్‌ చూసి, దరఖాస్తు చేశారు. సుదీర్ఘమైన ఎంపిక ప్రక్రియలో నెగ్గి ఆర్మీ టెక్నికల్‌ ఇంజినీర్‌ (లెఫ్టినెంట్‌) గా ఎంపికయ్యారు. ఇతనికి సత్యం కంప్యూటర్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా ప్లేస్‌మెంట్‌ కూడా లభించింది.
వారానికోసారి జరుపుకున్న గ్రూప్‌ డిస్కషన్లు కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థి రాహుల్‌ వెంకట్‌కు బాగా ఉపయోగపడ్డాయి. ీఒక బ్రాంచి వాళ్ళు చేశారని మరో బ్రాంచి వాళ్ళు... ఇలా హాస్టల్లో అందరూ గ్రూప్‌ డిస్కషన్లు నిర్వహించుకున్నా'మని తెలిపారు. ఇతనికి క్యాన్‌బే సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌లో ప్లేస్‌మెంట్‌ వచ్చింది. ీక్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, వొకాబ్యులరీపై ప్రిపేరైతే మంచిదని సీనియర్లు చెప్పారు. థర్డ్‌ ఇయర్‌లో క్యాట్‌ కోచింగ్‌కు వెళ్ళాను. దీనిలో ఇవి కవరయ్యాయ'ని చెప్పారు.
'సబ్జెక్టు మీద పట్టు ముఖ్య'మని చెపుతున్న రాజేష్‌కు (ఈసీఈ) టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లలో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా ప్లేస్‌మెంట్లు లభించాయి. గ్రూప్‌ డిస్కషన్లలో పాల్గొనటం, స్నేహితులతో ఇంగ్లిష్‌లో సంభాషించటం ఉపకరిస్తాయని చెప్పారు. సీనియర్స్‌ గైడెన్స్‌ కెరియర్‌కు చాలా అవసరమని ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. వారిని ఫోన్స్‌, ఈ- మెయిల్స్‌ ద్వారా తరచూ సంప్రదిస్తూ తమ కెరియర్‌కు బాటలు వేసుకున్నారు.

లక్ష్యం ఏదైనా ఇవి ముఖ్యం
విద్య, ఉద్యోగం దేన్ని లక్ష్యంగా పెట్టుకున్నా భావవ్యక్తీకరణ సామర్థ్యాలపై విద్యార్థులు దృష్టి పెట్టాలి. వెర్బల్‌, రైటింగ్‌, లిసనింగ్‌ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి. సమయ నిర్వహణ, ఒత్తిడిని జయించటం అవసరం. గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లో వీటికి ప్రాధాన్యం ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు ఉండవు కాబట్టి ఎక్కువమంది పీజీ చేస్తుంటారు. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరంలో గేట్‌ రాయటం మంచిది. స్కోర్‌ సరిగా రాకపోతే ఫైనలియర్లో రాసే అవకాశం ఉంటుంది. పాఠ్యపుస్తకాలనూ, ప్రామాణిక self learning books శ్రద్ధగా చదివి మంచి స్కోర్‌ కోసం ప్రయత్నించాలి. కోచింగ్‌ సదుపాయాలు లేవని నిరాశపడకుండా గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలి. గేట్‌ స్కోర్‌ బాగుంటే ఉపకారవేతనాలు కూడా వస్తాయి.
ఐఐఎంలాంటి ప్రముఖ సంస్థల్లో ఎంబీఏపై కూడా దృష్టి పెట్టవచ్చు. విదేశీ విద్య ఈ రోజుల్లో చాలామందిని ఆకర్షిస్తోంది. వీటి ప్రవేశపరీక్షలకు ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి.
ప్రైవేటు రంగంలోనే కాకుండా జాతీయస్థాయిలో యూపీఎస్‌సీ నిర్వహించే ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ (IES) ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు. అభిరుచీ, ఆసక్తులను బట్టి సివిల్‌ సర్వీసులు, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలను ప్రత్యామ్నాయాలుగా ఎంచుకోవచ్చు.
- డా. జి. తులసీ రాందాస్‌, ప్రిన్సిపల్‌,
జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ - హైదరాబాద్‌

ఇంటర్‌నెట్‌ వర్క్‌'
కెరియర్‌ ప్రణాళిక అనేది ఒంటరిగా కూర్చొని రూపొందించుకోవటం సరి కాదు. విద్యార్థి వెుదట తన బలాలూ, బలహీనతలను గుర్తించాలి. ఉన్న అవకాశాలూ, ఎదురయ్యే సమస్యలేమిటో ఆకళించుకోవాలి. దీనికి స్నేహితుల నెట్‌వర్క్‌ను రూపొందించుకోవాలి. అవసరమైన సమాచారం, ప్రేరణ, మద్దతు పొందటానికి ఇది ఉపకరిస్తుంది. ఈ రకంగా గరిష్ఠంగా లబ్ధి పొందవచ్చు. భవిష్యత్తు ప్రణాళికల గురించి సహాధ్యాయులతో, సీనియర్లతో, లెక్చరర్లు/ ప్రొఫెసర్లతో చర్చించాలి. వారు చెప్పే సలహాలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి.
తమ కాలేజీలోని వారితో మాత్రమే కాదు, ఇతర కాలేజీల్లోని సీనియర్లతో కూడా సంబంధాలు ఏర్పరచుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇంటర్మీడియట్‌లోని సన్నిహిత మిత్రులు కొందరైనా వేరే ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరతారు కాబట్టి, వారి ద్వారా అక్కడి సీనియర్లతో పరిచయం పెంచుకోవాలి.
నెట్‌వర్క్‌ విషయంలో ఇంటర్నెట్‌ను చక్కగా వినియోగించుకోవచ్చని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ గవర్నెన్స్‌ (ఐఈజీ) డిపార్ట్‌మెంట్‌ సమాచార అధికారి జి. రమేష్‌ తెలిపారు. ీయాహూ లాంటి సైట్లు వివిధ అంశాల్లో గ్రూప్స్‌ నిర్వహిస్తున్నాయి. వీటిలో రిజిస్టరైతే వేలమందితో సంబంధాలు సాధ్యమవుతాయి. ఉన్నత విద్యకూ, కెరియర్‌కూ సంబంధించి ఏ ప్రశ్న అడిగినా మీ గ్రూప్‌లోని వేలమందిలో ఎవరో ఒకరి దగ్గర్నుంచి జవాబు వస్తుంది.
* ఉద్యోగాలకు సంబంధించి chetana
* ప్రవేశ పరీక్షలకు సంబంధించి unpercentile.com
* విద్య, కెరియర్‌కు సంబంధించి jkc0405
ఈ గ్రూపులు విద్యార్థులకు అవసరమైన సమాచారాన్నీ, సలహాలనూ అందిస్తాయి.
ఉదాహరణకు groups.yahoo.com లోకి వెళ్ళి jkc0405 గ్రూప్‌ను search చేయవచ్చు' అని ఆయన వివరించారు.
తగిన సమాచారం, సహకారం కోసం ఇతరులను సంప్రదించటం చిన్నతనం కాదని గుర్తించాలి. సంకోచం, బిడియం వదిలి స్వేచ్ఛగా సందేహాలను వ్యక్తీకరించటం అలవాటు చేసుకోవాలి.

ప్రాజెక్టు వర్క్‌ ప్రధానం
సాధారణంగా ప్రాజెక్టు వర్క్‌ను ఫైనలియర్లో 3-4 నెలల వ్యవధిలో చేస్తుంటారు. డమ్మీ ప్రాజెక్టులు కాకుండా ఏవైనా రియల్‌ ప్రాజెక్టులు చేయడం వల్ల ప్రాక్టికల్‌ నైపుణ్యాలు వస్తాయి. విద్యార్థులు నేర్చుకున్న concepts కొంతవరకు implementation లోకి వస్తాయి.
'ప్రాజెక్టు గురించి విద్యార్థులకు కచ్చితంగా ఒక dream ఉండాలి. అది నిజంగా అద్భుతమైన ప్రాజెక్టు కావాలి. ఏదైనా నిజజీవిత సమస్యపై చేసేది అయివుండటం మంచిద'ని ఐఈజీ అకడమిక్‌ డైరెక్టర్‌ టి. శ్రీనివాసులురెడ్డి సూచించారు. జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ (జేకేసీ)ల పనితీరును ఆయన ఉదాహరించారు. ఇక్కడ ప్రభుత్వ విభాగాల్లోకి వెళ్ళి వాస్తవిక సమస్యలపై ప్రాజెక్టులు చేస్తుంటారు. దీనివల్ల organisation లో మాన్యువల్‌ వర్క్‌లో ఉన్న కష్టాలను గుర్తించి, పరిష్కారాలు ఇవ్వగలుగుతున్నారు.

టీమ్‌వర్క్‌... ఎంతో మేలు
ఇంజినీరింగ్‌ విద్యార్థులకు టీమ్‌ వర్క్‌ ఎక్కువ ప్రయోజనకరమని శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ీఎవరికి వారు కాకుండా సహాధ్యాయులు కొందరు కలిసి ఒక బృందంగా చర్చించుకుంటూ ప్రిపేరవ్వాలి. ఒకరు చదివిన టాపిక్స్‌ను మరొకరికి వివరించటం వల్ల సబ్జెక్టుపై పట్టు రావటమే కాకుండా సమయమెంతో కలిసివస్తుంది. ఏ విషయంపై అయినా అదనపు సమాచారాన్ని ఇంటర్నెట్‌లో వెదికి దానిపై మిత్రులతో చర్చించాల'ని సూచించారు.

Courtesy: ఈనాడు


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Buddha's relic to add attraction to State Archaeological Museum

Archaeologists stumble upon five caskets at Bavikonda
  • Dalai Lama to inaugurate the 16th enclosure of the museum
  • A number of Union Ministers and Chief Minister Y.S. Rajasekhara Reddy to attend the inaugural
  • The relic to be covered by bullet-proof glass dome
READY FOR INAUGURATION: A view of the holy relic gallery of the museum

HYDERABAD : The relic of the Buddha, unearthed at Bavikonda in Visakhapatnam district, will be on permanent display for the public viewing at the State Archaeological Museum, Public Gardens here, from January 2.

The Dalai Lama will inaugurate the 16th enclosure of the museum on the day named Holy Relic Gallery containing this rare possession marking its platinum jubilee. Union Ministers and Chief Minister Y.S. Rajsekhara Reddy will be present.

Free entry

The Government has decided to allow free entry into the gallery for a month, which, however, may be extended by another month. Apart from locals, thousands of Buddhist monks and pilgrims attending Kalachakra at Amaravathi are expected to visit the relic which has so far been kept in a strongroom for security reasons and shown only to VIPs on Buddha punima festival days.

The Bavikonda relic is held as unique and religiously significant unlike such corporal remains of the Buddha recovered at 17 other relic sites out of 155 Buddhist centres in the State, including Amaravathi, Bhattiprolu and Nagarjunakonda.

It was the first time in history of excavations in the State that archaeologists stumbled upon five caskets at a single place, Bavikonda, containing the relics.

This assumed significance because the finding of a single casket itself is normally held very high.

One such relic was to be transported from the State and displayed in Sri Lanka amidst tight security.

One lakh collections

The massive edifice of the museum in spotless white also stands out. It has one lakh collections to its credit, including an Egyptian mummy gifted by the Nizams, in contrast to 50,000 articles possessed by Salar Jung Museum, according to Minister for Archaeology N. Rajyalakshmi.

She and J. Kedareswari, director, Archaeology, said here on Friday that the relic would be covered by bullet-proof glass dome which has a facility to open up made by Godrej. As an additional security measure, a closed circuit TV will be installed at the enclosure for raising alarm if anybody comes as close as 4 ft when the enclosure is locked during nights.

On the occasion, the Government will bring out special publications on the Buddha relics and open a special museum at Amaravathi showcasing sculptures from 12 sites -- Chandavaram, Dhulikatta, Budham, Nandayepalem, Kesanapalli, Aluru, Vardhamanakota, Takkelapadu, Tirumalagiri, Nelakondapalli, Dhupadu and Bapatla.

*****

కాలచక్ర స్థూపాన్ని నిర్మించాలని ఉంది
కెలసాంగ్‌ ఈష్‌
న్యూస్‌టుడే-అమరావతి
'ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధులను ఒక చోటుకి చేర్చి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, శాంతిమార్గాన్ని ప్రబోధించనున్న స్థలం అమరావతి. ఈ భాగ్యాన్ని మాకు కల్పించినందుకు కృతజ్ఞతగా కాలచక్ర స్థూపాన్ని నిర్మించాలని అనుకొంటున్నాం' అని కాలచక్ర నిర్వాహక కమిటీ ఛైర్మన్‌ కెలసాంగ్‌ ఈష్‌ అన్నారు. కాలచక్ర ఏర్పాట్లు, బోధనల సందర్భంగా అమరావతికి వస్తున్న అతిథుల వివరాలను శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అమెరికా, యూరప్‌ ఖండాలు, మలేషియా, సింగపూర్‌, శ్రీలంక దేశాల నుంచి వచ్చే యాభై వేల మంది బౌద్ధ భిక్షువులకు తాము ఆతిథ్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అమరావతి రూపుదిద్దుకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

వ్యాపారం చేయడంలేదు
కాలచక్ర వేడుకల సందర్భంగా నార్బులింగ ఇన్స్‌స్టిట్యూట్‌ వ్యాపారం చేయడంలేదని కెలసాంగ్‌ ఈష్‌ అన్నారు. వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రముఖులకు వసతి సౌకర్యం కోసం ఏసీ సూట్లు నిర్మించామని ఇందులో వ్యాపార కోణం లేదన్నారు. కాలచక్ర కార్యక్రమం పూర్తయ్యేంతవరకు సామాన్యులకు రూ.800కే వసతి ఏర్పాటుచేశామని ఒక్కో టెంట్‌లో ఐదుగురు చొప్పున ఉండొచ్చన్నారు. రోజుకు 11 రూపాయలు మాత్రమే అవుతుందని వివరించారు. కాలచక్ర బోధనల సందర్భంగా నిర్వహణ ఖర్చుల కోసమే ఇలా చేస్తున్నామని తెలిపారు. అమరావతిలో మాంసాహారాన్ని తాము వద్దంటున్నామని కెలసాంగ్‌ ఈష్‌ తెలిపారు. తాము కేటాయించిన స్థలాల్లో తాత్కాలిక హోటళ్లు నిర్మించిన వారు, టెంట్లను తీసుకొన్నవారి నుంచి మాంసాహారం తయారు చేయబోమని హామీపత్రం తీసుకున్నామన్నారు.

ప్రత్యేక వైద్యవిభాగం భేష్‌..
కాలచక్ర సందర్భంగా వచ్చేవారికి వైద్య సేవలకోసం అమరావతి ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వైద్య విభాగాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని కెలసాంగ్‌ ఈష్‌ అన్నారు. చలిప్రదేశం నుంచి వచ్చినబౌద్ధులకు ఒక్కసారిగా వేడి వాతావరణం సరిపోక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ ఏర్పాటు చేయడం బౌద్ధులకు సేవచేయడమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఉడా ఛైర్మన్‌ మల్లాది విష్ణు, ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్‌, కాలచక్ర నిర్వహణ ప్రత్యేకాధికారి చల్లా విజయమోహన్‌ పాల్గొన్నారు.

Courtesy: ఈనాడు


Plan to build `stupa' at Amaravathi


Norbulingka Institute to bear all expenses for 1,500 monks who will conduct the rituals

  • Skin diseases reported among Tibetan visitors
  • 63 doctors deployed at the hospital and a 20-bedded ward specially earmarked for visitors
  • Tibetan visitors advised caution

GUNTUR: The Dharamshala-based Norbulingka Institute, which is organising the Kalachakra 2006, will construct a stupa as a memorial for the event taking place here from January 5 to 16.

The former Tibet Prime Minister and organising committee chairman Kelshang Yeshi told reporters at a press conference here on Friday that they did not mean to make it a one-time affair, but wanted the event to put Amaravathi on international Buddhist circuit. "We wish to continue our association with Amaravathi even after the event is over," he added.

Medical facilities

The Norbulingka Institute thanked the State Government for providing one of the best infrastructure facilities with all basic amenities. A 10-bedded special ward was inaugurated at the Government Hospital for the Kalachakra and ambulances kept ready. The Norbulingka also set up a special clinic.

Some skin diseases were reported among several Tibetan visitors, who came to the clinic for medicines. Sixty-three doctors from all disciplines were deployed at the hospital and a 20-bed ward was specially earmarked at Guntur Government General Hospital for the visitors.

When asked about the high tariff on tents, the Norbulingka representatives explained that they had to bear the overheads on several aspects of organising the event including paying the power bill.

The institute is bearing all expenses for the 1,500 monks who will be conducting all the rituals.

The organisers said that drowning of a Tibetan youth was negligence on the part of the visitor and advised all the Tibetans to take sufficient precautions.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Friday, December 30, 2005

ఇక్కడంతా బావుందా?


బౌద్ధులతో డీజీపీ మాటామంతీ..

న్యూస్‌టుడే-అమరావతి

'కాలచక్ర ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.. ఇప్పటివరకూ మీకు సంతృప్తికరంగా ఉన్నాయా?' అని డీజీపీ స్వరణ్‌జిత్‌సేన్‌ బౌద్ధభిక్షువులను అడిగారు. కాలచక్ర వేడుకల సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించేందుకు అమరావతికి వచ్చిన ఆయన టిబెట్‌ నుంచి వచ్చిన బౌద్ధులతో మాట్లాడారు. వాతావరణం, ఏర్పాట్లు బావున్నాయా? అంటూ ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా సన్నాహాలు చేస్తున్నామనీ, ఏ చిన్న సమస్యనైనా అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని చెప్పారు. అంతకు ముందు డీజీపీ కాలచక్ర బోధనల వేదికను పరిశీలించారు. ప్రతిరోజూ ఉన్నతాధికారి పర్యవేక్షణలో పరిశీలన జరగాలని ఆదేశించారు. ఏ విధమైన రక్షణ ఏర్పాట్లు చేశారని దలైలామా చీఫ్‌ సెక్యూరిటీ విభాగం అధికారి రించెన్‌ కర్మను ఆయన వాకబు చేశారు. కాలచక్ర సందర్భంగా అమరావతిలో భద్రత చర్యలను గుంటూరు రేంజ్‌ ఐజీ డాక్టర్‌ రజ్వంత్‌సింగ్‌, ఎస్పీ సజ్జనార్‌లు ఆయనకు వివరించారు.


*****

సాగర్‌కు బౌద్ధులు


మాచర్ల, డిసెంబరు 29 (న్యూస్‌టుడే): వచ్చే నెల అమరావతిలో జరగనున్న కాలచక్ర ఉత్సవాలలో భాగంగా పాల్గొనడానికి వచ్చే బౌద్ధులు నాగార్జునసాగర్‌ సందర్శిస్తున్నారు. గతవారం రోజులుగా బౌద్ధుల సంఖ్య పెరుగుతూనే ఉంది
సాగర్‌ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుతున్నారు.
సాగర్‌ నుంచి బౌద్ధనిక్షేపాలున్న నాగార్జునకొండకు లాంచీల ద్వారా చేరుతున్నారు.
లాంచి ప్రయాణంలో సాగర్‌ అందాలు వీక్షిస్తూ ఆనందపడుతున్నారు.
నాగార్జునకొండపై బుద్దుడి విగ్రహాలకు నమస్కరించి, మ్యూజియం తిలకించి గైడ్‌లు చెప్పే మాటలను శ్రద్ధగా వింటున్నారు.
తినుబండరాలు విక్రయించే సమయంలో భాష సమస్య టిబెటియన్లను మినలర్‌ వాటర్‌, య్యాంగ్‌ బాటిల్స్‌ బౌద్ధ బిక్షివుల చేతిలో కనిపిస్తున్నాయి.
గురువారం నేపాల్‌, టిబెటన్‌, శ్రీలంక బౌద్దులతో పాటుగా ఇంగ్లాండ్‌, అమెరికాకు చెందిన పర్యాటకులు సాగర్‌ సందర్శించారు.
సాగర్‌కు బౌద్ధుల రాకతో కొత్త అందాలు ఇనుమడించాయి.

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005 , Nagarjunasagar, Nagarjunakonda


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Kurnool : Move to retrieve rare manuscripts

Team with three coordinators and 50 volunteers formed


KURNOOL: An exercise to retrieve rare manuscripts and documents started in Kurnool district. Government Oriental Manuscripts, Library and Research Institute constituted a team with three coordinators and 50 volunteers to survey and collect information of manuscripts older than 70 years.

Director of the Institute Jayadheer Tirumal Rao said the exercise was to collect the information of existence of a document and not for taking it over. Prof. Rao told a meeting here on Thursday that after detection of the manuscript and its utility, the document would be converted into digital form through a formal procedure. He asked volunteers not to create confusion among the custodians of the manuscripts that the Government wanted to snatch it from them.

He said Kurnool district too was identified as one of the places where ancient culture flourished and hundreds of rare documents were available with the common man. He said though Dharmapuri and Krishnagiri districts were separated from Andhra to join to them with Tamil areas, 35 ancient Telugu folk arts existed among Telugu speaking population.

He said even nomadic tribes possessed certain rare documents regarding their marriages and divorce.

Coordinator

Deputy Director of Adult Education Balarami Reddy was named coordinator of the programme while two other coordinators Vaidyam Venkateswaracharyulu and Venkateswara Reddy would assist him.

Local literary figures and scholars--Gadiyaram Ramakrishna Sarma, K. Chandrasekhara Kalkura, K. Maddaiah, JSRK Sarma--and others attended the meeting.

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


'Telugu is a beautiful language' : says Actor Siddharth

Tamil actor Siddarth became Tollywood’s heartthrob after the successes of నువ్వువస్తానంటె నేనువద్దంటానా ( Nuvuvastanate Nenuvaddantana ). He has just completed his Sankranthi release చుక్కల్లొ చంద్రుడు ( Chukkallo Chandrudu ). Siddarha has penned the story and screenplay for that movie, not only that he has sung and scripted two songs for that movie. The prestigious creative commercials banner is producing that movie with director Shiva Kumar.

“Telugu is a beautiful language. I can decipher the meaning. So why stop myself from being learned? In fact my other films Yuva and Boys had my own voice.” Says Siddarth who doesn’t like getting his voice dubbed by other artists.” Language has never been a problem to me” adds Siddarth. When he asked about the songs in Telugu “I wrote the Telugu lyrics in English” smiles the handsome.

Courtesy: Andhra Herald


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Issue all orders in Telugu, staff told

Chittoor, Dec. 29: Telugu Official Language Committee chairman A.B.K. Prasad stressed that there was an absolute need to change the mindset of the district officers. Chief Minister Dr Y.S. Rajasekhar Reddy had given the green signal for initiating stern action against anybody violating the instructions and directions of the Official Language Committee, he added.

Addressing a meeting at the ZP meeting hall here on Thursday, he said that there was no difficulty in using the official Telugu language for all correspondence. He said that the High Court had given directions to lower courts to deliver their judgements in Telugu only. He said that he had visited nine districts and observed the implementation of the official language.

Chittoor RDO O. Seshaiah, municipal chairperson Sarala Mary and municipal commissioner V. Rajendra Prasad were present. District in-charge minister N. Raghuveera Reddy, district collector S.S. Rawat, Zilla Parishad chairperson Reddamma and SP V.V. Gopalakrishna did not turn up to take part in the meet because of their busy schedule for the CM’s visit to Tirupati on Thursday.

Courtesy: Deccan Chronicle


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Thursday, December 29, 2005

American university honors Telugu Ghazal master

Telugu ghajal maestro Ghazal Srinivas is very popular for his Ghazals. He received many domestic, national and international awards such as Gazal Maestro, Ghazal Ganaghandharva, Ghazal Ganaprapurna, Ghazal Ganavisarada, Ghazalganachiranjeevi, Pride of India, Gazal Ganasamrat, Ghazal Ganavibhusana, Ghazal Moghal, Ghazal Gayaka padusha, Ghazal Ganabrahma, Dr.B.R.Ambedkar life time achievement Award, Rotary international vocational Excellency, Lions international human Excellency, Jcs out standing young person etc.. For his outstanding contributions to Ghazal world.

Now American Cosmopolitan University honored him a doctorate. Ex German President Johno’s Raso, Ex South African president Nelson Mandela, 14 Dalai Lama Tenzin Gyatso. Intelligent Valtor Krohne is the few others who received the doctorates from the same university earlier.

Courtesy: Andhra Herald


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


ఆర్టీసీ 'బుద్ధా' టూర్‌ ప్యాకేజీ


ప్రణాళికలు రచిస్తున్న యంత్రాంగం
న్యూస్‌టుడే - గుంటూరు

కాలచక్ర ఉత్సవాలకు విచ్చేస్తున్న బౌద్ధులను ఆసక్తిని గమనించి వారికి అనుగుణంగా టూర్‌ ప్యాకేజీలను రూపొందించి అదనపు ఆదాయాన్ని గడించేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాతో పాటుగా చుట్టుపక్కల జిల్లాల్లోని బౌద్ధ యాత్రాస్థలాలను గుర్తిస్తున్నారు. వీటితోపాటుగా చారిత్రక ప్రాధాన్యత కల ప్రదేశాలను కూడా కలుపుతూ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను రూపొందించనున్నారు. అమరావతికి విచ్చేసిన బౌద్ధ యాత్రికులు పలువురు ఇప్పటికే ఆర్టీసీ అధికారులను యాత్రా స్థలాల గురించి ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలో..
* గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పవిత్ర బౌద్ధ క్షేత్రాలైన ఘంటశాల, భట్టిప్రోలు, నాగార్జునకొండ వంటి బౌద్ధ యాత్రా స్థలాలను కలుపుతూ ఒక ప్యాకేజీని రూపొందించనున్నారు.
* బౌద్ధులతోపాటుగా వస్తున్న ఇతర యాత్రికులను ఆకర్షించేందుకు వీలుగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని చారిత్రక ప్రాధాన్యత ఉన్న దార్శనిక ప్రాంతాలను కలుపుతూ పర్యటన రూపొందిస్తే ఆదాయానికి తోడుగా పర్యాటక రంగం కూడా మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
* ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన గైడ్‌లను రప్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
* పర్యటనకు ఇచ్చే లగ్జరీ బస్సులకు 24 గంటల సమయానికి పగటి ప్రయాణం గంటకు 20 కిలోమీటర్లు, రాత్రి 15 కిలోమీటర్ల చొప్పున లెక్కించి రోజుకు కిలోమీటరుకు రూ.17.50 చొప్పున వసూలు చేస్తారు. అదే నిర్ణయించుకున్న రోజుల్లో మొత్తం తిరిగిన కిలోమీటర్లు ఎక్కువైతే వాటిని రూ.17.50 చొప్పున లెక్కగట్టి తీసుకుంటారు.
* రూపొందించిన ప్యాకేజీ వివరాలను హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటుగా టిబెట్‌ భాషలోనూ ప్రచారం కల్పించేందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటున్నారు.

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Wednesday, December 28, 2005

బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దుతాం : గీతారెడ్డి


విజయపురిసౌత్‌, మాచర్ల, డిసెంబరు 26 (న్యూస్‌టుడే): రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి గీతారెడ్డి సోమవారం వి.పి.సౌత్‌ లాంచి స్టేషన్‌లో రూ.12 లక్షలతో మరమ్మతులు చేసిన ఎం.ఎల్‌. విజయలక్ష్మి లాంచీని ప్రారంభించారు. హోం మంత్రి కె.జానారెడ్డి లాంచి మోటర్‌ స్విచ్‌ను ఆన్‌ చేశారు. 10 నిమిషాలు పాటు జలాశయంలో విహరించారు. అనంతరం విలేకరులతో శాంతిసిరి లాంచీలో మాట్లాడారు. మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ ఎ.పి. టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీఠ వేసిందన్నారు. ఇందులో భాగంగా నాగార్జునసాగర్‌లో బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దుతామన్నారు. రూ.24 కోట్లతో 270 ఎకరాల స్థలంలో ఏడు జోన్లుగా విభజించి బౌద్ధారామం పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.12 కోట్లు వెచ్చించి పనులు చేపట్టామన్నారు. ప్రపంచ పర్యాటకుల ఆహార అభిరుచులకు అనుగుణంగా అన్ని వంటకాలు సిద్ధం చేసేందుకు ఫుడ్‌ బోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాగార్జునకొండ లోయ నుంచి ఆచార్య నాగార్జునుడు ప్రపంచ దేశాలకు బౌద్దమతాన్ని వ్యాప్తి చేసిన ఘనత ఉందని చెప్పారు. హోం మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేక పలువురు వలస బాట పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ ప్రాంతాలలో బౌద్దవనం, విహార కేంద్రాల నిర్మాణాలు చేపడుతుందన్నారు. నాగార్జునకొండ బౌద్ద ప్రాధాన్యత తెలిపే నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందన్నారు. విజయపురిని విజ్ఞాన కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీటర్‌ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు, నల్గొండ జడ్‌.పి. ఛైర్‌పర్సన్లు పాతూరి నాగభూషణం, సీతాలక్ష్మమ్మ, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి, సహకార బ్యాంకు ఛైర్మన్‌ కుర్రి పున్నారెడ్డి, మాచర్ల ఎంపీపీ చామకూర రాజారెడ్డి, స్థానిక నాయకులు సి.హెచ్‌.నాగిరెడ్డి, డాక్టర్‌ బసివిరెడ్డి, తోటకూర పరమేష్‌, సురేష్‌, ఉన్నూర్‌ సాహెబ్‌, టూరిజం అధికారులు, డ్యామ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005, Nagarjuna University


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


కాలచక్ర బౌద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు

గుంటూరు రైల్వే డివిజన్‌ సమాయత్తం
న్యూస్‌టుడే - గుంటూరు

కాలచక్ర మహోత్సవానికి విచ్చేసే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు రైల్వే డివిజన్‌ అధికారులు అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిగా విచ్చేయనున్న బౌద్ధులకు రైల్వే సమాచారం, విశ్రాంతి మందిరాల కల్పన విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు డి.ఆర్‌.ఎం. చౌహాన్‌ 'న్యూస్‌టుడే'కు చెప్పారు. * గుంటూరు ప్రధాన రైల్వే స్టేషన్లో విశ్రాంతికి 12 గదులను సిద్ధం చేస్తున్నారు. వీటిల్లో నాలుగు ఏసీ, ఎనిమిది సాధారణ గదులు.
* ఏసీ గదుల అద్దె (24 గంటల సమయానికి) రూ. 250, నాన్‌ ఏసీ గది రూ. 150.
* డార్మెటరీలో 10 మంచాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మంచానికి 24 గంటలకు రూ. 50. 12 గంటలు వినియోగించుకొంటే రూ.30 వసూలుచేస్తారు.
* స్టేషన్‌కు పశ్చిమం వైపున స్త్రీలకు ప్రత్యేక గదిని అదనపు సౌకర్యాలతో నిర్మిస్తున్నారు.
* ప్రధాన స్టేషన్లోని రెండు రెస్ట్‌ రూములను తీర్చి దిద్దుతున్నారు. ప్లాట్‌ఫారం 1, 4, 5ల్లో ఉన్న విశ్రాంతి గదులలో అధునాతన వసతులు కల్పిస్తున్నారు.
* కాలచక్ర ఉత్సవాల సమయంలో ఆర్టీసీ, ప్రయివేటు బస్సులను స్టేషన్‌ వద్దకు అనుమతిస్తారు.
* ఉత్సవాలకు వేదికైన అమరావతి బస్సుస్టాండులో రైల్వే రిజర్వేషన్‌, విచారణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే సమాచారం తెలుసుకొనేందుకు కంప్యూటర్‌ను కూడా ఉంచబోతున్నారు.
* గుంటూరు స్టేషన్‌కు రెండు వైపులా ఉన్న రిజర్వేషన్‌ కేంద్రాల వద్ద రెండు అదనపు కౌంటర్లు ప్రారంభిస్తారు.
* ప్రయాణికులకు అనుగుణంగా రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తారు.
* మంచినీరు సమృద్ధిగా లభించేలా చర్యలు తీసుకొన్నారు.
* భద్రత కోసం అదనపు ఆర్‌.పి.ఎఫ్‌. బలగాలు రానున్నాయి.
* అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు 0863-2330761 నంబరుకు సమాచారాన్ని తెలపాలని డి.ఆర్‌.ఎం. చౌహాన్‌ తెలిపారు.

*****
కాలచక్రపై ఆర్‌అండ్‌బీ 'షో'

కలెక్టరేట్‌, డిసెంబరు 26 (న్యూస్‌టుడే) : కాలచక్ర ఉత్సవాల సందర్భంగా ఆర్‌ అండ్‌ బీ నిర్మిస్తున్న రోడ్లలో నాణ్యతను రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డికి తెలియజేసేందుకు అధికారులు ల్యాప్‌టాప్‌ 'షో' నిర్వహించారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హైదరాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కాలచక్ర ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ఆర్‌ అండ్‌ బీ నిర్మించిన రోడ్లను, నిర్మాణదశలో ఉన్న రోడ్లను వీడియో తీసి ల్యాప్‌టాప్‌ ద్వారా వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రికి చూపారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతపరమైన లోపాలు ఉన్నట్టు పత్రికల్లో వస్తున్న కథనాల గురించి ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న రోడ్లలో ఎక్కడా నాణ్యతాపరమైన సమస్య తలెత్తడంలేదని అన్నారు. నూతన పరిజ్ఞానం ప్రకారం బూడిదను ఉపయోగిస్తున్నామని అది రోడ్డును మరింత గట్టిగాఉండేలా చేస్తుందని ఆర్‌ అండ్‌ బీ పర్యవేక్షక ఇంజినీర్‌ భావన్నరావు వివరించారు. నిర్మాణంలో ఉన్న రోడ్లను చూపించాలని ముఖ్యమంత్రి భావన్నరావును ఆదేశించారు. బూడిదతో నిర్మాణం జరుగుతున్న దశలను కూడా ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. నిర్మాణంలో ఎక్కడా నాణ్యతలోపం లేకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Cultural Extravaganza

ENTHRALLING: Students of S.D.M. Siddhartha Mahila Kalasala performing a folk dance at Satavahana College in Vijayawada on Tuesday as part of the district-level youth festival of NSS volunteers under the aegis of Acharya Nagarjuna University. — PHOTO: CH. VIJAYA BHASKAR

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


God's Grace

Amitabh Bachchan offering prayer at Tirumala Lord Venkateswara temple in Tirupati on Monday night. (PTI)



Courtesy: Times of India


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Monday, December 26, 2005

Ancient language status for Telugu sought

It may not be the dialect of elite by 2015: UNESCO report

  • Call for movement to rejuvenate Telugu language, literature
  • Globalisation has tell-tale effect on Telugu, says Thelakapalli
  • Sahithi Sravanthi to conduct Sahityasala at Kadapa soon

KADAPA: Telugu language, whose script dated back to 1,000 years, requires recognition as an ancient language, on the lines of Tamil, Sahitya Sravanthi State convenor తెలంకపల్లి రవి ( Thelakapalli Ravi ) demanded on Monday.

Modernisation of Telugu literature and recognising the language an ancient one were imperative in the golden jubilee year of Telugu as official language, he said at a press conference here. Tamil could attain its due status due to extensive research, he said.

He called for a movement to rejuvenate Telugu language and literature. A cultural renaissance was needed to counter the growing influence of globalisation, which posed newer challenges to Telugu literature, he stated.

In the wake of UNESCO's recent report that Telugu may not be the dialect of elite sections by 2015 due to growing influence of English, concerted efforts were needed to rejuvenate the language and literature, he said.

Onset of globalisation in the 1990s gave rise to insecurity and imbalances, which had its tell-tale effect on Telugu language, he said.

Kavi sammelanam

Sahithi Sravanthi, a broader literary forum, would organise జనకవనం ( Janakavanam ), a kavi sammelanam here on January 2, in which about 150 progressive writers would amply portray people's aspirations and woes, Mr. Ravi said.

The sammelanam slated at ZP Sabha Bhavan would be inaugurated by noted poet K. Siva Reddy and Jwalamuki, Rachapalem Chandrasekhara Reddy and Singamaneni Narayana would take part, he said.

The forum promoted writings with a social outlook and against globalisation, communalism and terrorism, he said. Sahithi Sravanthi would conduct a Sahityasala and it would be held at Kadapa in the next quarter.

It was also bringing out a quarterly journal Sahitya Prasthanam, he said. Its Kadapa district convener D. Syam, Anantapur convenor S. Kumaraswamy and CITU district president A. Raghunatha Reddy took part.

Courtesy: The Hindu

Keywords: Telugu , Andhra Pradesh , ancient classical language status demand , TCLD2006

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


భానుమతి : A legend no Telugu will ever forget

She was a singer, actress, director, music director, producer and studio owner, all rolled into one

HYDERABAD: She was light years ahead of her times yet so wedded to her present. At a time when women would refuse to come out of the four walls of the home, she was already ruling the male oriented Telugu film industry and conquering the Telugu masses with her sublime voice, the stories that she wrote, the films that she directed and her enduring images on the silver screen.

Tough and sweet

No sauntering Cinderella clueless about firm footing, Bhanumathi was the other name for substance as she strode like a colossus through the Telugu film and literary worlds. She was a singer, actress, director, music director, producer and studio owner, all rolled into one.

Bhanumathi was the enduring image of self-esteem, Telugu character and the alluring zeal for taking the road less taken though many dubbed it arrogance. She would not only call a spade a spade, but also shovel out the living daylights out of anyone. She was a woman of steel endowed with nerves of tungsten and the sweetest of voices.

Even at the ripe age of 70-something, when she rendered her immortal number from `Malleswari', "Manasuna Mallela maalalugene... " in that honey-dipped voice, there was no eye that did not turn moist at Ravindra Bharathi almost a decade ago.

City connection

Yet, despite the bright lights of stardom and the riches that came with it and that incessant glare of popping flashbulbs, she chose to lead life the only way she wanted -- the middle class way. Not for her the air-conditioned comfort of plush star hotels and exotic cuisines laid out in fine cutlery.

Her visits to Hyderabad would invariably bring her to West Marredpally where she would stay at a relative's house, a typical middle class first floor tenement, sipping filter coffee under a whirring fan! "I love it this way. I was born and raised a middle class woman, and I shall be one forever," was what she told this correspondent in an interview.

Veteran actor and Dadasaheb Phalke awardee Akkineni Nageswara Rao, who co-starred with her in several films, summed up the great actress and her times saying Bhanumati lived like a queen.

"There was no area of filmmaking which she did not know. And she had such great command on whatever she didWe all considered working with her a matter of great fortune in those days," he said. It was roles offered by Bhanumati's production house, Bharani, that went onto become steppingstones for his own success, beginning with `Vipranarayana'. Veteran character artiste Gummadi, describing Bhanumati as a versatile genius, said she had an inimitable screen presence. "One of the strongest and greatest chapters of Telugu cinema has come to an end," he said.

Actress Jamuna Ramana Rao said: "Bhanumathi was a `shakti swaroopini', symbolising woman power and an idol for generations of women to come.

She was so affectionate and compassionate, one only had to see and feel her real self."

This real side was also evident in her "Attha gaari kadhalu," a delightful romp through a Brahminical household tracing the antics of her old worldly mother-in-law.

She leaves behind millions of memories and a void impossible to fill.

*****

బహుముఖ ప్రజ్ఞకు మరో పేరు భానుమతి!

భానుమతి పేరు వినగానే ఆమె బహుముఖ ప్రజ్ఞ ముందుగా మన స్మ­ృతిపథంలో మెదలుతుంది. నటిగా, రచయిత్రిగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, కథకురాలిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా... ఇలా పలు విధాలా తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన మరోనటిని మన భరతభూమిలో చూడబోము. అహంభావాన్ని కూడా అందంగా ప్రదర్శించే నేర్పు భానుమతి సొంతం! అందుకు ఆమె బహుముఖప్రజ్ఞ కంచుకవచంలా నిలచి ఆ అందానికి మరిన్ని మెరుగులు దిద్దుతూ ఉంటుంది. అదే ఆమెను అందరిలోకి మిన్నగా నిలిపింది.

భానుమతికి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు రావాలని ఆమె అభిమానులు అభిలషించవచ్చు. దాదా సాహెబ్‌ ఫాల్కే వంటి అవార్డును ఆమెకు ప్రదానం చేయలేదని చింతిల్లనూ వచ్చు. ఆమెలోని బహుముఖప్రజ్ఞాపాటవాలలో ఒక్కోదానికి ఒక్కో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించితీరాలి. మరి ఒక్క ఫాల్కేనే ఇస్తే ఎలా!? ఆ స్థాయి ఉన్న అవార్డులు ఎన్నో ఆమెను చేరాలి. ఆమెకు లభించిన అవార్డులన్నీ ఆమె ప్రతిభాపాటవాలను చూసి మురిసిపోయి పరుగులు తీస్తూ వచ్చి వడిలో వాలినవే తప్ప ఏనాడూ ఆమె అర్రులు చాచి అవార్డులకై పాకులాడింది లేదు. అలా అయితే ఆమె భానుమతి ఎందుకవుతుంది!? ఏ కళాకారులకైనా ప్రజల మన్ననలను మించిన అవార్డులేముంటాయి. భానుమతిలోని ప్రతి కళకు జనం నీరాజనాలు పట్టారు. అంతకంటే ఏం కావాలి? అందుకే ఆమెకు ఏదైనా అవార్డు నిస్తే 'ఈ అవార్డు ఆమెకు ఎప్పుడో రావలసింది' అని ఇచ్చేవారే నొచ్చుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. బహుశా ఫాల్కే అవార్డు విషయంలో కూడా నిర్ణేతలు ఇలాగే భావించారేమో! ఆమె అభిమానులు ఆశించినన్ని అవార్డులు రివార్డులు రాకున్నా భానుమతి ప్రజ్ఞాపాటవాలే ఆమెకు ఎనలేని గౌరవాన్ని ప్రేక్షక హృదయాలలో సంపాదించి పెడుతున్నాయి. అంతకంటే ఓ కళాకారిణికి ఏం కావాలి!?

1924 సెప్టెంబర్‌ 7న (భానుమతి స్వయంగా 'పెళ్ళికానుక' షూటింగ్‌ సమయంలో చెప్పిన తేదీ) భానుమతి ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా దొడ్డవరం గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య. సంప్రదాయ కుటుంబం కావడం వల్ల బొమ్మరాజువారు తన కూతురుకు చిన్నతనంలోనే భాషాపాండిత్యాన్ని, లలితకళలను అభ్యసింప చేశారు. చిరుతప్రాయంలోనే భానుమతి రామాయణ, భారతాల్లోని పద్యాలను శ్రావ్యంగా ఆలపించేవారు. అలాగే చిన్నతనంలోనే రచనలు చేసి, తన తండ్రి స్నేహితులైన మేటి పండితులను అబ్బుర పరిచారు. నాట్యంలోనూ అతి తక్కువ సమయంలో ప్రావీణ్యం సంపాదించారు. సుబ్బయ్య కూతురి ప్రతిభాపాటవాలను చూసి ఇరుగు పొరుగువారు సైతం మురిసిపోయేవారు.

పదమూడేళ్ళ ప్రాయానికే భానుమతి తన అందచందాలతో యువకుల మతులు పోగొట్టేది, ఆ సమయంలోనే తన ప్రతిభాపాటవాలతో పండితుల ప్రశంసలూ అందుకునేది. ఆమె గురించి ఆ నోటా, ఈ నోటా విని సి.పుల్లయ్య తన దర్శకత్వం లో రూపొం దిన 'వరవిక్రయం' (1939) చిత్రం ద్వారా భానుమతిని సినిమా రం గానికి పరిచ యం చే శారు. సు బ్బయ్య మ రీ ఛాందసులు కావడంతో తన కూ తురుపై చిత్రీకరించే ప్రేమ సన్నివేశాల్లో కౌగిలింతలు ఉండరాదని షరతు పెట్టేవారు. అందుకు అంగీకరించిన వారి చిత్రాల్లోనే భానుమతిని నటింప చేసేవారు. అదే భానుమతికి అలవాటయింది. అందుకే ఆ తరువాతి కాలంలో కూడా భానుమతిని కౌగిలించుకోవడానికి హీరోలు సంశయించేవారు. అయితే పాత్రకు అనుగుణంగా నటించడానికి తన సహ నటీనటులను హుషారు పరచడంలోనూ ఆమె ముందుండేవారు.

తనకు మర్యాద లభించకుంటే ఎంతటివారినైనా ఆమె లెక్క చేసేది కాదు. ఆ రోజుల్లో కొందరు దర్శకులు తామే అందరికంటే మిన్న అన్న భావనతో హీరోయిన్లను చులకనగా 'ఒసేయ్‌, ఏమే...' అంటూ పిలిచేవారు. ఓ తమిళచిత్రం షూటింగ్‌లో దర్శకుడు భానుమతిని అలాగే "ఏమిటే... డైలాగ్‌ చూసుకున్నావా!?'' అన్నాడు. అంతే ఆత్మాభిమానం మెండుగా ఉన్న భానుమతి, "ఏమిట్రా... డైలాగు చూసుకునేది?'' అని అనేసరికి, సదరు దర్శకునికి, చుట్టు పక్కల ఉన్నవారికి మతిపోయింది. అప్పటి నుంచీ ఆమె అంటే చాలామందికి హడల్‌. అయితే తనను గౌరవించేవారిని, ఆమె కూడా ఎంతో గౌరవించేవారు. దటీజ్‌ భానుమతి అని నాటి సినీప్రముఖులే ఆమెను ఎంతో గౌరవించేవారు. ఆమె వ్యక్తిత్వం భిన్నమైనది. తన ప్రతిభాపాటవాలతోనే తన జీవితాన్ని నిర్మించుకున్న భానుమతి పెళ్ళి విషయంలోనూ ఆ రోజుల్లోనే తన మనసుకు నచ్చినవాణ్ణే మరీ వరించింది. నాటి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పి. రామకృష్ణను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. తరువాత దర్శకునిగా రామకృష్ణ, నిర్మాతగా ఆమె తమ 'భరణీ స్టూడియోస్‌' ద్వారా పలు చిత్రాలను రూపొందించారు.

నటిగా...
తొలి చిత్రం 'వరవిక్రయం'లోనే నటిగా తన ప్రతిభను చాటుకున్నారామె. 'కృష్ణమ్మ' చిత్రం షూటింగ్‌ సమయంలోనే రామకృష్ణను ఆమె ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. తరువాత కొంత కాలం నటనకు దూరంగా ఉన్నా, బి.యన్‌. రెడ్డి ప్రోద్బలంతో, భర్త ప్రోత్సాహంతో ఆమె 'స్వర్గసీమ'లో నటించారు. ఇందులో ఆమె పోషించింది వాంప్‌ పాత్రే అయినా, ఎక్కువ మార్కులు సంపాదించుకోగలిగింది. ఆ తరువాత "మల్లీశ్వరి, లైలామజ్నూ, చండీరాణి, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం, అంతస్తులు, అగ్గిరాముడు, వివాహబంధం, తోడు-నీడ, గృహలక్ష్మి, మట్టిలో మాణిక్యం, అంతా మనమంచికే'' తదితర చిత్రాలలో అనితర సాధ్యమైన అభినయాన్ని ప్రదర్శించారు. చాలా ఏళ్ళ తరువాత 1984లో కోడి రామకృష్ణ, 'భార్గవ్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌' గోపాల రెడ్డి అభిలాష మేరకు 'మంగమ్మగారి మనవడు' చిత్రంలో మంగమ్మ పాత్రను పోషించారు. ఆ తరువాత "అత్తగారూ స్వాగతం, ముద్దుల మనవరాలు, సమ్రాట్‌ అశోక, మొరటోడు నా మొగుడు, బామ్మమాట బంగారుబాట, పెద్దరికం, పెళ్ళికానుక'' వంటి చిత్రాల్లో నటించారు. ఏ పాత్ర పోషించినా, అందులో తనదైన పంథాను ప్రవేశపెట్టి అభినయించి, తనకు తానే సాటి అనిపించుకోవడం ఆమెకే చెల్లింది.

నిర్మాతగా...
భానుమతి తరంలో మేటి హీరోలయిన యన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ వీరి 'భరణీ సంస్థ'లో నటించారు. ఏయన్నార్‌ ఈ సంస్థ పర్మినెంట్‌ హీరో. ఆయన హీరోగా "రత్నమాల, లైలా మజ్నూ, చక్రపాణి, విప్రనారాయణ, బాటసారి'' వంటి చిత్రాలను నిర్మించారామె. యన్‌.టి.రామారావు హీరోగా "చండీరాణి, వివాహబంధం, అమ్మాయి పెళ్ళి'' వంటి చిత్రాలను రూపొందించారు. ఈ ఇద్దరు హీరోలతో ఆమె సొంత చిత్రాలలోనే కాకుండా ఇతర చిత్రాల్లోనూ నటించారు. ఆ తరువాత 'అంతా మనమంచికే' వంటి చిత్రాలనూ ఆమె నిర్మించారు. 1955లో ఆమె నిర్మించిన 'విప్రనారాయణ' చిత్రానికి జాతీయ అవార్డు లభించింది.

దర్శకురాలిగా...

భానుమతి తన స్వీయదర్శకత్వంలో రూపొందించిన తొలిచిత్రం 'చండీరాణి' (1953). ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తూనే దర్శకత్వం, నిర్మాణం, సంగీత పర్యవేక్షణ వంటి బాధ్యతలనూ నిర్వహించారు. అదీగాక ఈసినిమాను హిందీ, తమిళ భాషల్లో కూడా నిర్మించి, మూడు చిత్రాలను ఒకేసారి విడుదల చేశారు. బహుశా ఈ రికార్డు మరే నటికి ఇప్పటి వరకు సాధ్యం కాలేదనే చెప్పాలి. తరువాత ఆమె దర్శకత్వంలో 'అమ్మాయి పెళ్ళి, అంతామనమంచికే, భక్త ధ్రువ మార్కండేయ' వంటి చిత్రాలూ రూపొందాయి. తన దర్శకత్వంలో యన్టీఆర్‌ హీరోగా చిత్రాలను నిర్మించిన భానుమతి తరువాత ఆయన దర్శకత్వంలో 'తాతమ్మకల', 'సమ్రాట్‌ అశోక'లో నటించారు.

గాయనిగా...

తన పాటలను తానే పాడుకొనే భానుమతి పదమూడేళ్ళ ప్రాయంలో ఏలాంటి మాధుర్యాన్ని పలికించారో, ఏడు పదులు దాటిన వయసులోనూ అదే మాధుర్యాన్ని తన గళంలో పలికించగలిగారు. 'స్వర్గసీమ'లో ఆమె పాడిన "ఓహో హో హో పావురమా...'' పాట ఆ చిత్రవిజయానికి ఎంతగానో తోడ్పడిందంటే అతిశయోక్తి కాదు. ఇక పాటల పందిరిగా రూపొందిన 'మల్లీశ్వరి'లో ఆమె గాత్రంలో జాలువారిన ప్రతి పాటా అమృతమయమేనని నేడు కొత్తగ చెప్పవలసిన పనిలేదు. "సావిరహే తవ...'' (విప్రనారాయణ), "విరితావులలో...'' (లైలా మజ్నూ), "నీ వాలు కనులలో...'' (తెనాలి రామకృష్ణ), "శ్రీకర కరుణాలవాల...'' (బొబ్బిలి యుద్ధం), "రానీ రాజు రానీ...'', "ఎవరు రా నీవెవరురా...'' (అగ్గిరాముడు), "చరణం నీ దివ్య శరణం...'' (మట్టిలో మాణిక్యం), "నేనే రాధనోయి...'' (అంతా మనమంచికే), " ఎవరు కన్నారు ఎవరు కలగన్నారు...'' (తాతమ్మకల), "శ్రీరఘురామా... సీతారామా...'', "శ్రీ సూర్యనారాయణా మేలుకో...'' (మంగమ్మగారి మనవడు) వంటి పాటల్లో ఆమె గాత్రం నేటికీ వీనులవిందు చేస్తుంది.

రచయిత్రిగా...
"చండీరాణి, అంతా మనమంచికే, అమ్మాయి పెళ్ళి'' వంటి చిత్రాలకు ఆమె కథ సమకూర్చారు. కొన్ని చిత్రాలకు రచన చేయడంలో పాలుపంచుకున్నారు. ఆమె రాసిన "నాలో నేను'', "అత్తగారి కథలు'' తెలుగు పాఠకులను ఎంతగానో అలరించాయి.

జ్యోతిషంలోనూ...
సంగీత సాహిత్యాల్లోనే కాకుండా, చిత్రలేఖనం, జ్యోతిషంలో కూడా ఆమెకు ప్రవేశముండేది. మోడరన్‌ థియేటర్స్‌ పతాకంపై టి.ఆర్‌. సుందరం నిర్మించిన 'ఆలీబాబా 40 దొంగలు' చిత్రం షూటింగ్‌ సమయంలో ఆ చిత్ర కథానాయకుడు యమ్‌.జి.రామచంద్రన్‌, ఈమెను చూసి బెరుగ్గా ఉన్న సమయంలో ఆయన బెరుకు పోగొట్టేందుకు భానుమతి చనువుగా ఆయన చేయి తీసుకొని, తనకు తెలిసిన జోస్యం చెప్పారు. ఆ సమయంలో "ఏనాటికైనా నీవు రాజ్యాలేలే రోజుంది...'' అని భానుమతి, రామచంద్రన్‌తో అన్నారు. ఆ తరువాత అది అక్షరసత్యమైందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఆమె బహుముఖ ప్రజ్ఞ అన్ని విధాలా విజయం సాధించింది. కాబట్టి, ఆమెకున్న ప్రతి కళలోనూ ఓ ప్రతిష్ఠాత్మక అవార్డు ఆమెను వరించి తీరాల్సిందే. అయితే ఆ ప్రజ్ఞాశాలి వడిని చేరే అదృష్టం అన్ని అవార్డులకూ ఉండొద్దూ!

అయితే కొన్ని అవార్డుల మాత్రం ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. అలాంటి వాటిలో 'పద్మశ్రీ', 'కలైమామణి', 'యన్టీఆర్‌ జాతీయ అవార్డు' వంటివి ఉన్నాయి. ఏదేమైనా విలక్షణ వ్యక్తిత్వంతో వి'చిత్ర'రంగంలో సలక్షణంగా తనకు తానే సాటి అనిపించుకున్న భానుమతి తెలుగుప్రజల హృదయ సామ్రాజ్యంలో మకుటంలేని మహారాజ్ఞిగా నిత్యాభిషేకాలు జరుపుకుంటూనే ఉంటారన్నది జగమెరిగిన సత్యం! తెలుగు సినిమా చరిత్రలో భానుమతి అధ్యాయానికి సాటిరాగలది మరొకటి ఉదయిస్తుందన్న నమ్మకం ఏ తెలుగువాడికీ ఉండదని బల్ల గుద్ది చెప్పవచ్చు.

Courtesy: The Hindu , ఆంధ్ర జ్యోతి


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Technology vs. Tradition

DAY OUT FOR `KOYAS': A group of `koyas' basks in the first rays of the sun in the backdrop of Cyber Towers in Hyderabad on a foggy morning. — PHOTO: P.V. Sivakumar

Courtesy: The Hindu


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Sunday, December 25, 2005

క్రిస్‌మస్ శుభాకాంక్షలు

క్రిస్తుప్రభువు పుట్టిన రోజు
అందరికి పండుగ రోజు

కరుణ దయతో నిండాలు ప్రపంచం
ఇదే ఏసు ఇచ్చిన సందేశం




Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Friday, December 23, 2005

A touch of Telugu at the Oscar awards ?

UPDATE: The LATEST NEWS article from Rediff says it has NOT been nominated in the mentioned category.

Nevertheless, Morning Raga has won acclaim at other film festivals. The movie comes like a whiff of fresh air in the world of today's commercial cinema.

****

మార్నింగ్ రాగ (`Morning Raga')
has been nominated in the
Best Foreign Film category



    More of an English film, it has a distinct Telugu flavour and ambience
  • `Morning Raga' has been produced by Kovelamudi Raghavendra Rao
  • Set in coastal Andhra countryside it captures the essence of Carnatic music

HYDERABAD: This is one venture where no Telugu film has ever gone before - the hallowed world of Oscars.

This isn't a full-fledged Telugu film and more of an English one, but with distinct Telugu flavour and ambience laced in it with Telugu cinema's biggest commercial filmmaker Kovelamudi Raghavendra Rao helming the venture. `Morning Raga', nominated for the Oscars in the best foreign film category is among 56 films from all over the globe vying for that big black statuette, including the Amol Palekar directed Hindi film, `Paheli'.

The film stars Rao's son, Prakash along with Shabana Azmi and Perizaad Zorabian with the Bangalore-based playwright Mahesh Dattani writing and wielding the megaphone.

Set in idyllic coastal Andhra countryside and capturing the essence of Carnatic music, the film showcases the quintessential Telugu culture, its distinct character and earthy ambience. The film is also about the meeting of two worlds — the young and the old, Western and Carnatic music, rural and urban and the modern and the traditional.



`Totally unexpected'

"This was totally unexpected. We thought the film would bag a national award, but going all the way to the Oscars and vying with the cream of global films is something wonderful," an ecstatic K. Raghavendra Rao affirmed. It isn't a first for a Telugu's venture alone, no Indian English film has been nominated to the Oscars earlier. Prakash is a trained actor from the famous Lee Strasberg's Acting School, New York and has directed his first film, a children's film, `Bellyful of Dreams' which is to be released shortly in Telugu. An engineering graduate, he was introduced in mainstream Telugu cinema with `Neetho', which bombed. `Morning Raga' was his second film. "My debut film was very mainstream. I couldn't fit in at all. But, this is something close to my sensibilities," said Prakash. The film also has another Telugu connection. Its music score was by noted Telugu music director Mani Sarma along with Amit Heri, who leads a jazz band in Bangalore.

Courtesy: The Hindu


'Morning Raga' - 'Mellifluous'

Producer/s: K Raghavendra Rao
Director: Mahesh Dattani
Cast: Shabana Azmi,Prakash Rao,
Perizaad Zorabian, Lillete Dubey
Music: Mani Sharma, Amit Heri
Runtime: USA:110 min
Music: Mani Sharma, Amit Heri
Country: India
Language: English / Telugu
Certification: UK:PG
Awards: 2 wins and 2 nominations




Awards for Morning Raga

Cairo International Film Festival
YearResultAwardCategory/Recipient(s)
2004 Won Best Artistic Contribution
Mahesh Dattani
For the brilliant use of music as a major dramatic element by the director.
Nominated Golden Pyramid
Mahesh Dattani


Screen Weekly Awards
YearResultAwardCategory/Recipient(s)
2005 Won Screen
Best Performance in an Indian Film in English
Shabana Azmi


Oscar Awards
YearResultAwardCategory/Recipient(s)
2006 Nominated
Best Foreign Film

Mahesh Dattani




Courtesy: IMDB


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


మాతృభాష గొప్పదనాన్ని చాటిన సిటిఎస్‌ఎస్‌

కాలిఫోర్నియా, డిసెంబర్‌ 21: మాతృభాష చేదవుతున్న నేటి రోజుల్లో ఎక్కడో దేశంగాని దేశంలో మన తెలుగు భాష గొప్పదనం గురించి, దాని తియ్యదనం గురించి మన తెలుగువారందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఒక తెలుగు సాహితీ సదస్సు నిర్వహించారు. కుమార్‌ కలగర ఆధ్వర్యంలో 'మొట్ట మెదటి కాలిఫోర్నియా తెలుగు సాహితీ సదస్సు' రాజధాని శాక్రమెంటోలో డిసెంబర్‌ 17న జరిగింది. ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో కాలి ఫోర్నియాలోని పలు ప్రాంతాలతో పాటు హ్యూస్టన్‌, టెక్సాస్‌ నుండి కూడా ప్రముఖ సాహితీ వేత్తలు హాజరయ్యారు. సదస్సుకు ప్రముఖ సాహితీ వేత్త, సుజన రంజని పత్రిక సంపాదకులు కిరణ్‌ ప్రభ అధ్యక్షుత వహించగా, ప్రముఖ రచయిత, సంపాదకులు, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత కేతు విశ్వనాథ రె డ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

శృతి మోడెకూడి పాడిన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ'' పాటతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రారంభోపన్యాసంలో సదస్సు ఆశయాలను, భవిష్యత్తు ప్రణాళికను కుమార్‌ కలగర వివ రించారు. ఇలాంటి సదస్సులు కాలిఫోర్నియాలోని పలు నగరాలలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలన్న తన కోరికను వెలిబుచ్చారు. సభాధ్యక్షులు కిరణ్‌ ప్రభ మాట్లాడుతూ సమాజంలో సాహిత్యం ప్రముఖ పాత్ర వహిస్తుందనీ, సంస్క­ృతి వైభవాలు సాహిత్యంలో నిక్షిప్తమై ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. చరిత్ర పునరావృతమవుతుందని, సాహిత్యానికి మళ్లీ మంచిరోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

"ప్రవాసాంధ్రులు-తెలుగు భాషపై వారికర్తవ్యం'' అనే అంశంపై ప్రముఖ పాత్రికేయురాలు హిమబిందు మాట్లాడుతూ, భాష మన జీవన విధానంతో ముడిపడి ఉందని, పిల్లలు తెలుగు నేర్చుకునేలా చేయడం తల్లిదండ్రుల కర్తవ్యమనీ, అందులో తల్లి ప్రముఖ పాత్ర వహిస్తుందని అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్మకమైన, అనుసరణీయమైన పద్దతులను ఆమె విశదీకరించారు.

' అలుసవుతున్న అమ్మ భాష'' అనే అంశంపై కథా, గేయ రచయిత డా. సురేంద్ర దారా మాట్లాడారు. సాంకేతిక అభివృద్ధి, ప్రపంచీకరణ తెలుగు భాషపై అభిమానం, ఆదరణ తగ్గడానికి ఎలా దోహదం చేస్తున్నాయో వివరించారు. భాషాభివృద్ధికి అవసరమైన పరిష్కార మార్గాలను కూడా సూచించారు.

ముఖ్య అతిథి డా. కేతు విశ్వనాధ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలో తెలుగు వారికి గుర్తింపు వచ్చే విధంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే భారతీయుల సాహిత్యం పదికాలాలపాటు వర్థిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెరికాలో తెలుగు నేర్పడంలో గల సాధక బాధకాలను, అనుభవాలను తాటిపాముల మృత్యుంజయం సభికులకు వివరించారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యాశాలను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పిల్లలను తెలుగు పాఠాలు నేర్చుకొమ్మంటూ తరగతులకు పంపడమే కాకుండా, ఇండ్లలో కూడా తెలుగు మాట్లాడుతూ భాషా ఙ్ఞానాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భాష మార్పు చెందుతుంది కాని అంతరించి పోద న్నారు.

విశేష అథితి చెరువు రామ్మోహన్‌ పిల్లల్లో భాషాభిమానాన్ని పెంపొందిచడం తల్లి దండ్రుల కర్తవ్యమని అన్నారు. తెలుగు భాషతో పాటు మారుతున్న కుటుంబ వ్యవస్థ గురించి శ్రీమతి దుర్భ సరస్వతి ప్రసంగించారు.

"సిరివె న్నెల సినీ గీతాలపై ఆశావాదం'' అన్న అంశంపై కిరణ్‌ ప్రభ ప్రసంగిస్తూ, సినీ సాహిత్యంలోని సాధక భాధ కాలను గురించి కూడా వివరించారు. సిరివెన్నెల గీతాల్లోని భావోద్రేకం, ఆశావాదం సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయని, ఆయన రాసే పాటలు నిరాశావాదుల్లో ఉత్సాహాన్ని నింపి ఆశావాదం వైపు పయనించేలా చేస్తాయని ఆయన వివరించారు.

స్వీయ రచ నా పఠనంలో భాగంగా ధారా సురేంద్ర, పిల్లారిశెట్టి సులోచన, దుర్భ సరస్వతి, వంగూరి చిట్టెన్‌ రాజు, చెరువు రామ్మోహన్‌, ఆరణి శివకుమార్‌, కలగర కుమార్‌, నేమాల గోపాల్‌ రావు కథలు, కవితలు, పాటలు చదివి వినిపించారు.

చిట్టెన్‌ రాజు 'ఈమెయిలోపాఖ్యానం' హాస్యకథ సభను నవ్వులతో ముంచెత్తింది. సదస్సులో పాల్గొన్నవారిలో ప్రముఖ రచయితలు వేమూరి వెంకటేశ్వరరావు, గొర్తి బ్రహ్మానందం తదితరులు ఉన్నారు. సదస్సుకు విచ్చేసి విజయవంతం చేసిన సాహిత్యాభిమానులందరికీ కుమార్‌ కలగర కృతఙ్ఞతలు తెలుపారు. తరువాత సదస్సు సిలికాన్‌ వ్యాలిలో నిర్వహించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు.


Courtesy: ఆంధ్ర జ్యోతి
Keywords: Andhra Pradesh , California Telugu Samithi , Sacramento Telugu Sahiti Sahithi Sadassu , December 2005 , CTS


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'