పాలతొ వెన్నతొ నిండిన కలశం
కంకులు, చెరకులు, ఏటు చూసినా ఆహ్లాదమే.
పంటలకు, పంచడానికి చిహ్నం సంక్రాంతి.
శాంతి, సుభీక్షం తొ నింపుతోంది ప్రజల్లొ కాంతి.
*****
ఆకాశాన రవి అరుదెంచక ముందె,
ఆగమించునట హరిదాసులు, బసవన్నలు.
ఆడదానికెమొ తను వేసిన ముగ్గు,
అడ్డాల నాటి బిడ్డ లాగా, అపురూపమట.
గొబ్బి పూలతొ, కలల రంగులతొ అలంకరించునట.
( తరువాతె దోసీత బియ్యంతొ, వాకిట నిలిచిన వారిని
ఆదరించునట.)
తెలుగునాట ప్రతి ఇంతా,
సంక్రాంతి హాంగులు చూద కనుల పంట.
*****
స్వచ్చమైన వాతావరనంలో స్వేచ్చగా యెగిరే
పక్షులు,
సారవంతమైన భూమిలో, తీవిగా నదిచే యెద్దుల
జంట,
యేపుగా పెరిగిన పైరులో, యెంకిలా నడిచే
ఆలిని చూసి, మగని మనసు మరులు గోనెనంట.
సంక్రాంతి సంతోశం నింపును, ప్రతి ఒక్కరి ఇంత.
*****
సంక్రాంతి లక్శ్మీ ముంగిట్లోకొచ్చింది.
ఆలంకరించిన ద్వార బంధాలు, వెలాడదీసిన
తొరనాలతో, స్వాగతం చెప్పండి.
కలశ పూజలు చేసి, కల్పవల్లి దీవెనాలే కోరండి.
(కలలు సాకారం చేసుకొండి కనక వర్షాన్నె
పొందండి.)
*****
మరునాడే ముక్కనుమ.
గోమాతలకు,పొలాలు దున్నె హలాలకు, పూజలె చెయాలి.
సంక్రాంతి రోజున రైతన్న, పశువులకు విశ్రాంతి
ఇవ్వన్నా.
*****
ఆసలు గాలి పటాలై యెగరగా, కోరికలు రోజా
మొగ్గలై విరియగా,
కొబ్బరాకులు అందమైన నీడలు పరచగా,
ప్రజలందరూ నూతన సంవత్స్రపు ఉత్సాహంలొ
ఉండగా,
విస్వం ముంగిట్లొ, సంక్రాంతి కన్య ముంగిట వచింది.
*****
ముగ్ధ మనోహర ముద్దుగుమ్మ,
ముంగిలిలొ ముగ్గులే వెస్తుండగా,
ముందడుగు వెయ్యాలనుకున్నాడు దుదు బసవన్న.
ముచ్చట గొలిపె ఆ ద్రుశ్యాన్ని చూసి,
ముసి ముసి నవ్వుల సన్నాయి రాగాన్ని ఆలపించె ఆ
బాల గోపన్న.
*****
ముక్కారు పంటల ఫలం, ముంగిట్లొకొచ్చె వేళ,
మూడు పండుగల కలాబోటతో, కలకలలాడుతోంది
జనవరి నెల.
పొంగలి పిండి వంటలతు చవులూరిస్తొంది.
సంబరాలె జరుపుకోండి, సంతశాన మునిగి తేలండి.
*****
సంక్రాంతి లక్ష్మి కొలువు తీరింది.
సంతొషపు దీపారాధన కావించి, (కోరికలు
నివేదించి),
సాఫల్యపు దీవెనాలే అందుకోండి.
*****
వజ్రపు వద్దానాలు, వైదూర్యపు కిరీటాలు,
సాటి వచ్చునా, విరిసిన కుసుమాలకు?
సంపాదాలెన్ని ఉన్నా, సరితూగునా అవి,
సొంతవారి మమతానురాగాలకు?
అందుకె కన్నవారితొ కలిసి,
బంధు మిత్రులతొ ఆటలతొ అలిసి,
సంతోషంగా జరుపుకోండి సంక్రాంతి.
*****
పసుపు వ్రాసిన గడపలతో, పచ్చా తోరణాలతో,
పాడి పంటలతో, ముంగిట ముగ్గులతో,
జ్వాజ్వల్యమానమైన జ్యోతితో,
సంక్రాంతి ! సంవత్సరమంతా నింపాలి,
ప్రపంచంలొ కాంతి, ప్రజల మదిలొ శాంతి.
*****
సంవత్సరంలొ యెన్ని రోజులున్నా, కార్యక్రమాలు అవే.
కాని, పండుగల రొజులు ప్రత్యేకాలు వాటికవే.
కేలెండర్లొ, కాలంతో పరుగులు తీసె వివరాలు
పొందు పరిచినా,
ఆ కలలొ ఆరితేరినా,
ఈ తారీఖున, సంబరాల్లొ సేద తీరుమా.
సుమాభినందనాలను ఆస్వాదించుమా.
*****
దూ దూ బసవన్నను, పీ పీ సన్నాయితొ,
ఆటలాడించె ........................,
వాకిట పచ్చ తోరణాలు, ముంగిట ముగ్గులు,
ఊరంతా పసిడి పంటలు, ఊరించె పిండి వంటలు,
తీయ్యని చెరుకు గాడలు,స్నేహితులతో ఆటలకై పిల్లల
యెట్టుగడలు,
వెరసి సంబరాల సంకు రాత్రి,
సంతోష సుమాలు విరియగా, పులకించే ఈ ధాత్రి.
*****
నిసిరాత్రి చీకట్లు పారద్రోలుతూ భోగి మంటల
చిటపటాలు,
ఇంటిల్లిపాడి ముచ్చత్లు, మధ్య మధ్య పిల్లల
సిగపాట్లు,
నిప్పట్లు తింటూ ఆట పాటలు, చప్పట్లు చారుస్తూ
ప్రొత్సాహాలు,
బొసి నవ్వుల బుజ్జి పాపాయిలకు, భోగి పండ్లతో
దీవెనాలు.
*****
పంటల పచ్చదనం తో,
శాంతి సుమాల పరిమలం తో,
అయికమత్యం పరిదవిల్లగా,
దెసాలన్నీ సోదర భావం తో,
విశ్వం ముంగిట వాసుధైక కుటంబపు రంగవల్లి
దిద్దాలి.
(ఒర్)
ప్రజాలందరూ ఒకే కుటుంబమై
విశ్వం ముంగిట సామరస్యాన్ని
రంగవల్లిగా దిద్దాలి.
*****
ముంగిట ముగ్గులు, చిరుదివ్వెలు,
గుమ్మడి పూలతో గొబ్బెమ్మలు,
కలకలలాడును, మన పల్లె సీమల లోగిల్లు,
తరతరాల మన సంస్క్రుతీ ఆనవాల్లు.
పిల్లలు, పెద్దాలు, బంధువులు, స్నేహితులు,
ఇల్లంతా సందడె సందడి, సంక్రాంతి ఒరవడి.
*****
తెలతెలవారక ముందే,
తూర్పు తెరపై వేకువ వికసించక ముందే,
ముంగిట గొబ్బెమ్మల ముగ్గులు,
హైందవ పండుగ విషిష్ట్లు.
పల్లె సీమలు దాటి, పచ్చని బాటన పట్నాలకు
చేరాలి.
సంక్రాంతి సంస్క్రుతీ, సాంప్రదాయం కలకాలం
నిలవాలి.
*****
సంక్రంతి పండుగ, సంబరాల వెల్లువ.
ముంగిట గొబ్బెమ్మలు, వాకిట హరిదాసులు,
బంతి పూల వాకిళ్ళు, పంట సిరుల నట్టిళ్ళు,
కన్నెపిల్లల ఆటలు, పసందైన గొబ్బి పాటలు,
కొత్త కుండలొ పొంగలు, కోడి పందాల సమరాలు,
కొత్త అల్లుల్లకు స్వాగతాలు, మరదళ్ళ పరాచికాలు,
పిండి వంటల సువాసనాలు, షాద్రసోపేతమైన
విందులు.
పసుపు కుంకుమాల పందారాలు, గ్రుహినులకెంతో
సింగారాలు.
పుట్టింటి వారిచ్చు వాయనం, పద్ధతికెంతో
సౌభాగ్యం.
సంక్రాంతి పండుగ, సంబరాల వెల్లువ.
*****
కనుమ పండుగ నేడు, పల్లె సీమలు చూడు,
పసువులనలంకరించు, గొమాతను పలకరించు,
యెద్ల బండ్ల పోటీలు, పరుగు పందెల ఆటలు,
ప్రక్రుతీలోని ఇతర ప్రాణులను కూడా గౌరవించు,
మన సంస్క్రుతి గొప్పతనాన్ని ప్రస్తుతించు.