ఇక్కడంతా బావుందా?
బౌద్ధులతో డీజీపీ మాటామంతీ..
న్యూస్‌టుడే-అమరావతి
'కాలచక్ర ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.. ఇప్పటివరకూ మీకు సంతృప్తికరంగా ఉన్నాయా?' అని డీజీపీ స్వరణ్‌జిత్‌సేన్ బౌద్ధభిక్షువులను అడిగారు. కాలచక్ర వేడుకల సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించేందుకు అమరావతికి వచ్చిన ఆయన టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధులతో మాట్లాడారు. వాతావరణం, ఏర్పాట్లు బావున్నాయా? అంటూ ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా సన్నాహాలు చేస్తున్నామనీ, ఏ చిన్న సమస్యనైనా అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని చెప్పారు. అంతకు ముందు డీజీపీ కాలచక్ర బోధనల వేదికను పరిశీలించారు. ప్రతిరోజూ ఉన్నతాధికారి పర్యవేక్షణలో పరిశీలన జరగాలని ఆదేశించారు. ఏ విధమైన రక్షణ ఏర్పాట్లు చేశారని దలైలామా చీఫ్ సెక్యూరిటీ విభాగం అధికారి రించెన్ కర్మను ఆయన వాకబు చేశారు. కాలచక్ర సందర్భంగా అమరావతిలో భద్రత చర్యలను గుంటూరు రేంజ్ ఐజీ డాక్టర్ రజ్వంత్‌సింగ్, ఎస్పీ సజ్జనార్‌లు ఆయనకు వివరించారు.
*****
మాచర్ల, డిసెంబరు 29 (న్యూస్‌టుడే): వచ్చే నెల అమరావతిలో జరగనున్న కాలచక్ర ఉత్సవాలలో భాగంగా పాల్గొనడానికి వచ్చే బౌద్ధులు నాగార్జునసాగర్ సందర్శిస్తున్నారు. గతవారం రోజులుగా బౌద్ధుల సంఖ్య పెరుగుతూనే ఉంది
సాగర్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా చేరుతున్నారు.
సాగర్ నుంచి బౌద్ధనిక్షేపాలున్న నాగార్జునకొండకు లాంచీల ద్వారా చేరుతున్నారు.
లాంచి ప్రయాణంలో సాగర్ అందాలు వీక్షిస్తూ ఆనందపడుతున్నారు.
నాగార్జునకొండపై బుద్దుడి విగ్రహాలకు నమస్కరించి, మ్యూజియం తిలకించి గైడ్‌లు చెప్పే మాటలను శ్రద్ధగా వింటున్నారు.
తినుబండరాలు విక్రయించే సమయంలో భాష సమస్య టిబెటియన్లను మినలర్ వాటర్, య్యాంగ్ బాటిల్స్ బౌద్ధ బిక్షివుల చేతిలో కనిపిస్తున్నాయి.
గురువారం నేపాల్, టిబెటన్, శ్రీలంక బౌద్దులతో పాటుగా ఇంగ్లాండ్, అమెరికాకు చెందిన పర్యాటకులు సాగర్ సందర్శించారు.
సాగర్‌కు బౌద్ధుల రాకతో కొత్త అందాలు ఇనుమడించాయి.
Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005 , Nagarjunasagar, Nagarjunakonda

0 Comments:
Post a Comment
<< Home