తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించండి: వైఎస్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 (ఆన్‌లైన్): రెండు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన తెలుగు భాషకు ప్రాచీనభాష హోదాను కల్పించాలని కేం ద్ర మానవ వనరులశాఖ మంత్రి అర్జున్‌సింగ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ కోరారు. ఈ విషయం ప్రధానితో చర్చిస్తానని అర్జున్ సింగ్ హామీ ఇచ్చినట్లు బుధవారం విలేకరులతో చెప్పారు. తెలుగుభాష చరిత్రను తెలిపే పలు కావ్యాలు, తాళపత్ర గ్రంథాలున్నాయని చెప్పామన్నారు. తీయని శబ్దంకల తెలుగును ఇటాలియన్ ఆఫ్‌ది ఈస్ట్ అం టారని చెప్పారు. తమిళ భాషకు ప్రాచీన హోదా కల్పించిన తర్వాత ఈ హోదా కల్పించేందుకు గత నవంబర్‌లో నిబంధనలను మార్చారని, అప్పుడే తాను ప్రధానికి ఈ విషయంపై లేఖ రాశానని చెప్పారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు కూడా దేశభాషలందు తెలుగులెస్స అన్నారన్న విషయాన్ని వై ఎస్ తెలిపారు.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Keywords : Telugu Andhra Pradesh classical ancient language status demand ysr arjun singh tcld2006
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home