తెలుగు భాషకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి
హైదరాబాద్, న్యూస్టుడే: తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని తెలుగు భాషోద్యమ సమాఖ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ గురించి వినవస్తున్న ఊహాగానాలనేపథ్యంలో ఈ శాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని సమాఖ్య అధ్యక్షుడు సి.ధర్మారావు ఒక ప్రకటనలో కోరారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భాష, సంస్కృతులకు ప్రత్యేక శాఖ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు భాష ప్రాముఖ్యాన్ని తగ్గించే ఉద్దేశం లేదని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ ప్రకటించినందువల్ల ఈ ప్రతిపాదనను ఆయన దృష్టికి తీసుకువస్తున్నామని తెలిపారు.
Courtesy: ఈనాడు
0 Comments:
Post a Comment
<< Home