తెలుగుపై హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 6, ప్రభాతవార్త
తెలుగు ప్రాచీన భాషగా గుర్తించకుండా కేవలం సంస్కృతం,తమిళం భాషలనే గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించ పోవడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె.రామచంద్రమూర్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి జిఎస్ సింఫ్వీు, న్యాయమూర్తి జి.భవానీప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు వాదించారు. కేంద్రప్రభుత్వం 2004 అక్టోబర్ 12, అదే ఏడాది నవంబర్ 25న జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రతులను అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. వాటిని మంగళవారం సమర్పిస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వ విద్యా,సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి,అధికారభాషా సంఘం కార్యదర్శి,పొట్టి శ్రీ రాములు తెలుగు రిజిస్ట్రార్‌లను ప్రతివాదులుగా చేశారు. వెయ్యి సంవత్సరాలనుంచి పదిహేాను వందల సంవత్సరాలను కొలబద్దగా తీసుకుని ప్రాచీనభాషగా గుర్తించవచ్చునన్న నారంగ్ కమిటీ స్పష్టం చేస్తోందని, కేంద్రం రెండు వేల సంవత్సరాలుగా నిర్ణయించి కావాలని తెలుగు భాషకు అన్యాయం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల కన్నడ,మళయాళ భాషాభిమానులకూ తీరని మనస్థాపం కలిగిస్తోందన్నారు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడేవారిలో తెలుగుకు ఆరోస్థానం ఉందని, భారతదేశంలో రెండోస్థానంలో ఉందన్నారు. క్రీస్తు పూర్వం 800 నుంచి 600 వందల సంవత్సరాల వరకూ వచ్చిన శాసనాలలో బMగ్వేద,ఐతరేయబ్మ్రాణం, సునసుపోఖ్యానమ్ వంటి గ్రంధాల్లో తెలుగు శబ్ధం ఉదహరించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. క్రీస్తుపూర్వం నాటికే ఉత్తమ సాహిత్య గ్రంధాలుగా వినుతికెక్కిన బృహత్కధామంజరి, శాలివాహనగాధాసప్తశతి వంటి పుస్తకాలు కూడా తెలుగు ప్రాచీనతకు సాక్ష్యంగా నిలిచిఉన్నాయన్నారు. క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం నాటిదిగా గుర్తించిన అమరావతి స్థూపంలోని అక్షరాల చరిత్రను కూడా రిట్‌లో ఉదహరించారు. ఈ వరుసలోనే పింగళి లక్ష్మీకాంతం సమీకృతం చేసిన నన్నయ్య కాలానికి ముందు నుంచీ తెలుగుభాషా వికాసాలను సోధాహరణంగా వివరించారు. ద్రవిడ భాషా కుటుంబంలోని 24 భాషల్లో రెండవ అతి పెద్ద భాషగా తెలుగువిరాజిల్లిందని చెప్పడానికి శాసనాలు ఉన్నాయన్నారు. క్రీస్తుపూర్వం రెండు మూడు శతాబ్దాల్లో శాతవాహనులు ముద్రించిన వెండి నాణాలలో, ప్రతిష్టించిన ప్రాకృత భాషా శాసనాలలో తెలుగు పదాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. క్రీస్తుశకం 553లోని జవనాపూర్, క్రీస్తుశకం 555 హరహర, క్రీస్తుశకం 653 నందంపూడి శాసనాలలో ఉదహరించిన తెలుగుభాష ప్రాచీన వైభవాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మహాభారతంలో,భాగవతంలో,శ్రీనాధుడి కావ్యాల్లో అన్నమాచార్య,త్యాగరాజస్వామి,భక్తరామదాసు వంటి మహామహుల గ్రంధాలలో,కీర్తనలలో తెలుగుభాష తియ్యదనం నేటికీ ఆస్వాదిస్తున్నామని చెప్పారు. తమిళభాషతో సమానంగా చరిత్ర, శాసన పరిభాష,ప్రాచీనత ఉన్న తెలుగును ప్రాచీన భాషగా గుర్తించకపోవడం చారిత్రకతప్పిదం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రాచీన భాషగా తెలుగును గుర్తించకపోవడం గర్హనీయమని అన్నారు.
Courtesy: వార్త
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home