"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Monday, February 06, 2006

కాలపరీక్షలో ఓడిన తెలుగు భాష!

తేరాల సత్యనారాయణ శర్మ

2500 సంవత్సరముల ప్రాచీన చరిత్రగల తెలుగును దానిని నిరూపింపలేక నియమములు మార్చమని కేంద్రమును కోరుట అది ఆర్వాచీనమని మనమే భావించినట్లుయగును. ఆత్మరక్షణలో పడినట్లుయగును. తెలుగు భాషా ప్రాచీన చరిత్ర శాతవాహన ప్రాకృత వాఙ్మయ కాలమునాటిది. అప్పటికి పురాణములు, సంస్క­ృతభాష రంగప్రవేశము చేయలేదు. మిక్కిలి ప్రాచీనమైన తెలుగు ఇంకా నిర్లక్ష్యమునకు గురియగుట మిక్కిలి ఆవేదన కలిగించును.

దేశభాషల ప్రాచీన భావము గుర్తించుటకు వెయ్యి సంవత్సరముల లిఖిత చరిత్ర యుండవలెనన్న కేంద్రప్రభుత్వపు నిర్ణయము తమిళభాషకు ప్రాచీన హోదా లభించినవెంటనే ముగిసిపోయి, అది తిరిగి 1500-2000 సంవత్సరములై మార్పుచెందుట తక్కిన ప్రాచీనభాషలన్నిటిని తీవ్రమైన వివక్షతకు గురిచేసినది. కేంద్రప్రభుత్వ నిర్ణయము తెలుగుభాషకు శరాఘాతమై నిలుచుట సందేహములేని విషయము. కానీ, క్రీస్తుపూర్వము నుండి అటుపిమ్మట 2500 సంవత్సరముల చరిత్రలో పెక్కు ఆధారములు గలిగియున్న తెలుగుభాషకు ఇటువంటి పరిస్థితి కలుగుట కేవలము కేంద్రముదే తప్పిదము గాదు. ఇందులో మన వైఫల్యములే, మతభేదములే కారణములై యున్నవి. తెలుగు సంస్క­ృతమునకు ముద్దుబిడ్డ అనుట ప్రబలమై, అది దాని తరువాత పుట్టిన భాషయని, ఆర్వాచీనమని మనవారే వ్రాసిపెట్టి దానిని సంకీర్ణచరిత్ర గావించిరి.

ఋగ్వేద నిర్మాణము ఒక అంచనాకు చెందిన కాలము. అయినప్పటికీ తెలుగు దానికి సమాంతర కాలములోనిదని చరిత్ర తెలుపుచున్నది. పదేపదే తెలుగుజాతికి అదే కారణమని చెప్పి తెలుగు చరిత్రను మరొకదానికి అనుబంధము చేసినట్లు మారుచున్నది. ఒక జాతికి ఒక భాషయుండునన్న ప్రకారము తెలుగుభాషకు తెలుగుజాతి కలదు గాని భాష ఒక్కటి జాతి మరొకటి కాజాలదు. పురాణములు, పురాణభాష, కావ్యనిర్మాణములు శాతవాహనుల తరువాత పుట్టి, వారి చరిత్రలన్ని ఎట్టిమార్పులు చేయకనే అవి వర్ణించినవి. తెలుగు ప్రాచీనత శాతవాహన కాలము నిలిపినప్పటికి దానికి పురాణవాదము జోడించినందువలన అవి 14వ శతాబ్దము వరకు కనిపించలేదన్న ఆర్వాచీన వాదన కొందరు గావించిరి. పురాణశబ్దములు తెలుగు దేశములో కలిగించుట దీనికి ఉదాహరణ కాజాలదు. ఇదే విషయములో పురాణములు చెప్పిన తక్కిన విషయములను మనకు పరిగణనలోకి తీసుకొనలేదు.

దక్షిణాదికీ, దాని దేశభాషలకూ, ఆర్యభాషలకన్నా తెలుగుకూ ఒక ప్రత్యేక చరిత్రయున్నది. దానినిబట్టి పురాణములను, సంస్క­ృతభాషను ఆదరించుటలో దానిలోనే మనం మునిగిపోయినట్లు కాజాలదు. అది తెలుగు ప్రాచీన భావమునకు అడ్డంకి కలిగించుచున్నది. ఆర్వాచీన వాదములో, సంస్క­ృతముతో తెలుగునకు పొత్తుచూపి మనవారు ఇంతకుముందే దానిని ఆర్వాచీనమని గ్రంథములు వ్రాసిపెట్టిరి. 'జనని సంస్క­ృతంబు సకలభాషల'కని సిద్ధాంతము గావించిరి. కేవలము అప్పటికి కొన్ని తెలుగుపదములే కనిపించినందున దానిని భాషకాదనిరి. మౌఖికమనిరి. వాక్యములు లేవనిరి. వ్యవహారభాషకు సాక్ష్యములేదనిరి. లిఖితము కాదనిరి. తెలుగుదేశ భాషయని బృహత్కధచెప్పిననూ, తెలుగు జనజీవన శైలిని గాధాసప్తశతి సైతము వర్ణించినప్పటికీ దానిని మనము చూడజాలక పోయితిమి, పైగా శాతవాహన వంశపు పేరును మార్చుటకు సహితము ప్రయత్నము గావించితిమి.

తెలుగు శాసనములు, శాసన వాఙ్మయ పద్యరచనలు గ్రంథరచనలు అప్పటికే వచ్చినప్పటికీ నన్నయ భారత రచన కాలమునే తెలుగు నిర్మాణమయ్యెనని చాలామంది అటువంటి ఆర్వాచీన వాదము చేపట్టిరి. అనగా నన్నయకు ముందుగల 1500 సంవత్సరముల చరిత్రను కాదని, దానిని మనమే ఆర్వాచీనము గావించితిమి. ఇదంతయు తెలుగునకు సంస్క­ృతముద్ర కలిగించుటవల్ల సమకూడినభావమే కాని అన్యము కాజాలదు.

ఆయా భాషలలో యితర భాషాపదములుకొన్నిచేరుట సహజ పరిణామము. తమిళులు తమది సంస్క­ృతవాసనలేనిభాష అని చాటుకొందురు. కాని తెలుగులో దాదాపు 70శాతం పాలు సంస్క­ృత పదముల కలయికచేరి,జాతిపేరు సహితముమార్పు చెందుటతో తెలుగుభావమే పూర్తిగా మార్పుచెందినది. పురాణములనుండి తక్కిన కావ్యముల నుండి పుట్టిన పదములు ఆర్య, సంస్క­ృ త భావ వాదమునకే చెందగలవు. అవి తెలుగునకు సమాంతరమని, ప్రత్యామ్నాయమనుట చారిత్రకమైన వాదనకాదు. అటువంటి దానికి నిదర్శనములు కనిపింపవు. ముఖ్యముగా ద్రావిడ భాష ధర్మముకలిగి,ప్రాచీన రూపము కలిగి, దక్షిణాది జాతులలో అతి ప్రాచీన భాషయైన తెలుగునకు ఒక సంకీర్ణ చరిత్ర కలుగుట వల్లనే దాని ప్రాచీన చరిత్రకు అవరోధము కలిగినదనుట తప్పుట లేదు. ద్వందభావనలో ద్వందచరిత్రలలో ఇట్టి అవస్థ తప్పదు. పేరు ఒకటి, దాని చరిత్ర మరొకరీతి కొనసాగించుటవల్ల ఇట్టి అయోమయ అవస్థ కలుగుచున్నది. దానికి బదులు ఉభయ విషయములలో తెలుగునే ప్రధానభాగము గావించి దానికి తోడుగా తక్కిన దానిని చెప్పుకొనుట సమైక్యభావమునకు దారి తీ యును. అట్లుగాని యెడల తెలుగు జాతిలో భాషమాత్రమే నిలిచి, దాని చరిత్ర మా త్రము ఆనవాలు లేకపోవలసి వచ్చును.

2500 సంవత్సరముల ప్రాచీన చరిత్రగల తెలుగును దానిని నిరూపింపలేక నియమములు మార్చమని కేంద్రమును కోరుట అది ఆర్వాచీనమని మనమేభావించినట్లుయగును. ఆత్మరక్షణలో పడినట్లుయగును. తెలుగు భాషా ప్రాచీన చరిత్ర శాతవాహన ప్రాకృత వాఙ్మయ కాలమునాటిది. అప్పటికి పురాణములు, సంస్క­ృతభాష రంగప్రవేశము చేయలేదు. తమిళము తర్వాత సంస్క­ృతము ప్రాచీన భాషగా చిట్టచివర గుర్తింపబడుటలో దానికి సహితము యెట్టి గౌరవము కలిగినదో తెలియవచ్చుచున్నది. యీ రెండిటికన్న మిక్కిలి ప్రాచీనమైన తెలుగు ఇంకా నిర్లక్ష్యమునకు గురియగుట మిక్కిలి ఆవేదన కలిగించును.

తెలుగు భాషకు ప్రాచీన భావము దక్కక, అది ఆర్వాచీనమని భావించుటలో జరుగుచున్న పరిణామములపై స్పందింపవలసినది ప్రస్తుతము సాధారణ పౌరులు కాదు. తెలుగుపేరుతో విశ్వవిద్యాలయములు, అకాడమీలు, మేధావులు, శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు, భాషానిపుణులు, పత్రికలు కలవు. ఇందులో కొందరు గొప్ప పదవుల లో కలరు. వారు అందరూ దానిని ప్రస్తుతించుటగాక తెలుగుకు కల్గిన భిన్న పరిణామములు ఎట్లు కలిగినవో దాని సమతాభావనకు కలిగిన నష్టమేమిటో వివరించవలసియున్నది.
వెయ్యి సంవత్సరముల క్రిందనే నన్నెచోడకవి తెలుగు నిలుపు ఉద్యమము చేపట్టెను. మార్గవాదము యెదిరించెను. కారణము అతడు తొలినాటి మహాకవుల కోవలోని వాడైనప్పటికి, తెలుగు సమాజ భావనకు జరిగిననష్టము యెదిరించుటకే జాతి భాషా ఉద్యమము చేపట్టెను గాని కేవలము పాండిత్యము ప్రదర్శించుటకే భాషా ఉద్యమము చేపట్టలేదు. అదే నిజమైన యెడల మార్గవాదులను దుయ్యబట్టవలసిన అవసరము లేదు. అట్టిపనిచేయకనే మరికొందరు మహాకవులు దురవస్థలోనున్న తెలుగును ఉద్ధరించి మహాకావ్యములు రచించిరి. కాని నన్నెచోడకవి మాత్రమునేరుగా మార్గతత్వముపైననే యుద్ధము ప్రకటించెను. దానిని కొందరు తామసమనిరి. రాజకవియనిరి. బ్రహ్మమూర్తికాదనిరి. అందువల్ల జాతి భాష సామాజిక వాదము చేపట్టి తెలుగును బాగుపరచకల్గినప్పటికి మార్గవాద అవశేషవాదన ఇంకా కొనసాగుటవల్ల తెలుగు చరిత్రపై ఆర్వాచీన భావము ముద్రపడియున్నది.
రాజకీయ ప్రభుత్వము తెలుగు ప్రాచీనత్వము గుర్తింపలేకపోయినప్పటికీ చరిత్రలోదాని స్థానము మాత్రము శాశ్వతముగా నిలిచియుండక తప్పదు.

(వ్యాసకర్త చారిత్రక గ్రంథకర్త)

Courtesy: ఆంధ్ర జ్యోతి
Keywords: Telugu , Andhra Pradesh , ancient classical language status demand , Vaartha , TCLD2006 , India Indian

Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


1 Comments:

At 7:31 AM, Blogger Madhu గారు చెప్పినారు...

Add telugu search to your blog.

Visit for details:

http://gultus.blogspot.com/

 

Post a Comment

<< Home