భాషలెన్ని ఉన్నా భారతీయుడిగా నిలవడమే మిన్న
- బెంగుళూరు, ఫిబ్రవరి 5, ప్రభాతవార్త
- భాష అనేది భావ వ్యక్తీరణకు మాత్రమేనని, భాషలు మారినా పరవాలేదు గాని భారతీయుడిగా విలువలు కోల్పోకుండా జాగ్రత్త పడితే చాలని సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. మేలుకలయిక ఫౌండేషన్ 23వ సాంస్కృతికోత్సవాలు ఆదివారం ఇక్కడి చౌడయ్య మెమోరియల్ హాలులో ఘనంగా జరిగాయి. ఈ సందర్బ ంగా ఆయన మాట్లాడుతూ తెలుగు-కన్నడ భాషలకు కలిపి ఒకే లిపిని తీసుకు రావాలన్న ప్రయత్నం జరుగుతోందని, వాస్తవానికి ఈ రెండు లిపిలు ఒకటేనని అందువల్ల మరో కొత్త లిపిని తీసుకురావలసిన అవసరం లేదని ఆయన అన్నారు. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు చాలా విశిష్ట మైనవని తల్లి, తండ్రి, అతిధి, గురు వును దేవుడితో పోల్చే సత్‌సాం ప్రదాయం ఒక భారత దేశంలోనే ఉందన్నారు. జస్టిస్ మంజుళాచెల్లూర్ మాట్లాడుతూ ధైర్య,సాహ సాలకు మారు పేరైన తెలుగు వారు ఎక్కడికి వెళ్లినా ఉన్నత శిఖరాలు అందుకుంటారని, ఇందుకు కారణంగా అక్కడి భాషను నేర్చుకుని పరిస్థితులకు అతుక్కు పోవడం కూడా ఇందుకు కారణంగా చెప్పారు. మేలుకలయిక ఫౌండేషన్ సాంస్కృతికోత్సవాలు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని బాధలు మరిచి తెలుగు బుల్లి తెర, వెండితెర నటీనటులు అందించిన తెలుగు సాంస్కృతిక తియ్యదనాన్ని ప్రవాసాం ధ్రులు సంతృప్తిగా ఆర గించారు. విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తంవలస వచ్చిస్థిరపడిన ప్రవాసాంధ్రు లను యేడాదికి ఒక సారి ఒక గొడుగు కిందకు చేర్చి వారికి తెలుగు సాంస్కృతిక వినోదాన్ని పంచడంతో పాటు వివిధరంగాల్లోప్రతిభాపాటవాలు ప్రదర్శిం చినతెలుగువారిని సన్మానించి ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో 23 సంవత్సరాల క్రితం ఈ సంస్థ ఆవిర్బ వించింది. సంస్థ ఆవిర్బ వించి రెండు దశా బ్దాలుగడిచినాసొంతభవనాన్నిసాధించుకోలేక పోయా మన్న బాధ,నిరాశ ఫౌండేషన్‌పదాధికారులు, సభ్యుల్లో ఉన్నా ఎప్పటి లాగే ఈ యేడాది కూడా సాంస్కృతిక వినోదాన్ని అందించి వచ్చిన ప్రేక్ష కులను కడుపుబ్బ నవ్వించారు.అదే విధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన తెలుగు వారిని సన్మానించి గౌరవించే సాంప్రదాయంలో భాగంగా ఈ యేడాది కర్ణాటకహైకోర్టున్యాయమూర్తి మంజుళా చెల్లూర్‌తో పాటు తెలుగు సినీ గేయరచయిత సిరి వెన్నెల సీతారామ శాస్త్రి, నటుడు వేణు, పారి శ్రామిక వేత్త వలసరెడ్డి వెంకటరెడ్డి,ఎస్‌బిడి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసి ప్రిన్సిపాల్‌టివి.నారా యణ, జెఆర్. హౌసింగ్ డెవలపర్స్‌మేనేజింగ్‌డైరెక్టర్‌ఎస్. జగదీశ్ రెడ్డిల నుసంస్థ అధ్యక్షుడు ఎస్‌సి. తిమ్మప్ప, ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజనాయుడు,కోశాధికారినరసిం హారెడ్డిలుసన్మానించారు. ఈసందర్బగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
0 Comments:
Post a Comment
<< Home