తెలుగుకు ప్రాచీన భాష హోదాపై 20న సదస్సు
హైదరాబాద్(అబిడ్స్),ఫిబ్రవరి4,ప్రభాతవార్త
ప్రాచీన భారతీయ భాషగా తెలుగును ప్రకటించేందుకు నిర్ధేశించిన యోగ్యత, అర్హతలు,ఆనవాళ్లను సేకరించేదిశగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలోనే ప్రాచీన చరిత్రను తెలిపే మరిన్ని ఆధారాలను సేకరించేందుకు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయంగా పలుసదస్సులు నిర్వహిస్తోంది. ఈ మేరకు తెలుగు వర్సిటీలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో తెలుగు వర్సిటీ ఉప కులపతి డా.ఆవుల మంజులత మాట్లాడుతూ దాదాపు మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాషను ప్రాచీనభాషగా,జాతీయస్థాయిలో రెండవ అధికార భాషగా గుర్తించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. వివిధ గ్రంధాలు,వ్యాసాల ఆధారంగా తెలుగు భాష ప్రాచీనతను తెలిపే ఒక లఘు పుస్తకాన్ని వర్సిటీ ముద్రించిందన్నారు.ఈనెల20వ తేదీన మేధావులు, చరిత్రకారులు, భాషావేత్తలతో వర్సిటీలో ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయంగా ఉన్న తెలుగువారితో సమావేశాలు నిర్వహిస్తూ తెలుగు భాష ప్రాచీనత ఆనవాళ్లను సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అందించే నిమిత్తం వర్సిటీ అన్ని చర్యలు చేపడుతోందని ఆమె వివరించారు. భాషావేత్తలు,చరిత్ర పరిశోదకులు, సాహితీవేత్తలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు తెలుగుకు ప్రాచీన భాష హోదా కల్పించేందుకు సహకరించాలని మంజులత కోరారు.
Courtesy: వార్తి
Keywords: Telugu , Andhra Pradesh , ancient classical language status demand , Vaartha , TCLD2006 , India Indian
Labels: tcld2006
1 Comments:
Very curiously :)
Post a Comment
<< Home