తెలుగుకోసం సిఎం ను నిలదీస్తా: ఎమ్మెస్
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆన్ లైన్): తెలుగుకు ప్రాచీన భాషగా హోదా కల్పించాలనే విషయమై ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిని నిలదీస్తానని రాష్ట్రక్రీడల శాఖ మంత్రి ఎం.సత్యనారాయణరావు అన్నారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయా లని ముఖ్యమంత్రిని కోరతానని ఆ యన స్పష్టం చేశారు. ప్రాచీన భాష గా తెలుగును గుర్తించాలని కోరుతూ తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వ ర్యంలో మంగళవారం ప్రారంభమైన ఉద్యమంలో పాల్గొన్న మంత్రి పైవిధంగా స్పందించారు. తొలుత తెలుగుతల్లి విగ్రహానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి ఉదయం ఎనిమిది గంటల సమ యంలో పూలదండలు వేసి ఈ కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఇందులో మంత్రి సత్యనారాయణరావుతో పా టు వివిధ పార్టీలకు చెందిన ఎమ్మె ల్యేలు, తెలుగు భాషోద్యమ సమాఖ్య సభ్యుడు మండలి బుద్ధప్రసాద్, నగ ర మేయర్ తీగల కృష్ణారెడ్డి, పలు వురు రచయితలు, మేధావులు, అధి కార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. తెలుగుతల్లి విగ్రహం నుం చి ఇందిరాపార్కు వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం నిరాహారదీక్ష లు ప్రారంభించారు.
ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య, ప్రముఖ సామాజిక వేత్త లవణం వంటి వారి తో పాటు తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్న 250 మంది నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. బిజెపి జాతీయ కార్య దర్శి బండారు దత్తాత్రేయ మాట్లాడు తూ తెలుగుకు ప్రాచీన హోదా కల్పించే విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ప్రాచీన భాషగా గుర్తించేందుకు చేసే ఉద్యమానికి టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మందాడి సత్యనారాయణరెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి డాక్టర్ నారాయణ, సిపిఎం నాయకుడు వై.వి.రావు తమ మద్దతును ప్రకటించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి మా ట్లాడుతూ ప్రతి పాఠశాలల్లో పిల్లలకు తెలుగులోనే బోధన చేయాలనే దా నిపై ఉద్యమించాలని పిలుపునిచ్చా రు. తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు ధర్మారావు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పని సరిగా తెలుగును అమలు చేయాలని కోరారు. విశాఖపట్నంలో 72 ముని సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్య మాన్ని ప్రవేశపెట్టి ఒకటో తరగతి నుంచి ఐదో తేదీ వరకు బోధన ప్రారంభించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ రచయితలు జ్వాలా ముఖి, నగ్నముని, కె.బి.తిలక్, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, మైసూర్ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫె సర్‌గా పనిచేస్తున్న ఆర్.వి.సుందరం, మల్లిఖార్జున శర్మ, తదితరులు పాల్గొన్నారు.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu Andhra Pradesh classical ancient language status demand tcld2006Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home