తెలుగుకు లేనిదేమిటి?
తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాలని అధికార భాషా సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని నెలల క్రితమే కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాం టి స్పందన లేదు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తెలుగు భాష కు ప్రాచీన హోదా కల్పించాలని కోరుతూ మానవ వనరుల అభివృద్ధి శాఖకు ఒక లేఖ రాయడం ఎంతైనా ముదావహం. తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా కల్పించాలంటూ చెల రేగుతున్న ఆందోళణ నేపథ్యంలో అసలు విషయంలో తమిళ భాషకు ఉన్నదేమిటి? తెలుగు భాషకు లేనిదేమిటీ? అన్న ప్రశ్న లపై చర్చ మొదలయింది.
ప్రపంచ భాషల వరుస క్రమంలో, దాదాపు 15 కోట్లమంది వ్యవహర్తలతో తెలుగు భాష, 15వ స్థానంలో ఉంది. ఫ్రాన్స్, బ్రిటన్‌లతో సహా 110 దేశాల కంటే తెలుగునేల సువిశాలమైన ది. తెలుగు భాషను జాతీయ భాషగా గుర్తించాలని జె బి ఎస్ హాల్డేన్ వంటి వైజ్ఞానికుడు సూచించడం జరిగింది. తెలుగు మాట్లాడేవారి వివరాలు ఇలా ఉన్నాయి: 2001 జనాభా గణన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 7.5 కోట్లమంది, తమిళనాడులో 2.5 కోట్లు, కర్ణాటకలో 1.7 కోట్లు, మహరా ష్ట్రలో లో 1.5 కోట్లు, ఒరిస్సాలో 80 లక్షల మంది, కేరళ, పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్‌లలో 60 లక్షల మంది, ఇంకా దేశంలోని ఇతర ప్రాంతాల్లో పది లక్ష ల మంది తెలుగువారు నివశిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, కెన డా, దక్షిణాఫ్రికా, మారిషస్, ఫిజీ, కువైట్. సౌదీ అరేబియా తది తర దేశాల్లో 3 కోట్లమంది తెలుగువారు ఉన్నట్టు అంచనా. తమిళనాడు జనాభాలో తమిళులు 36 శాతం కాగా తెలుగు వారు 42 శాతం మేరకు ఉన్నట్టు సాక్షాత్తు ఒక తమిళ టీవీ ఛానెల్ తన క్విజ్ కార్యకమంలో ధ్రువీకరించింది. 1920 నుంచి నేటివరకూ తమిళనాడులో 15 మంది ముఖ్యమంత్రులుగా పనిచేయగా వారిలో 12 మంది తెలుగువారు. తమిళనాడుతో సహా ఆంధ్రపదేశ్‌కు వెలుపల ఉన్న తెలుగువారందరూ ఇప్ప టికీ తల్లిభాషనే పలుకుతున్నారు. ఒక భాషకు ఎంతో ప్రాచీనత ఉంటేనే, భౌగోళికంగా ఇంత విస్తృతం కావడానికి అవకాశం ఉంటుందనీ భాషా శాస్త్రవేత్తల సునిశ్చాతాభిప్రాయం. మరి ఇంత విస్తృతి గల తెలుగు భాషను పక్కన బెట్టి కేవలం తమిళ భాషకు మాత్రమే ప్రాచీనత కట్టబెట్టడం శోచనీయం.
దేశంలోని అన్ని భాషలకూ ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్ర సాహిత్య అకాడమీ, ప్రత్యేకించి ఒక భాషను ప్రాచీన భాషగా ప్రకటించే ఉద్దేశంతో వ్యవహరించినట్లుగా ఈ సందర్భంగా స్పష్టం అ యింది. ఒక నోటిఫికేషన్ ద్వారా ఔత్సాహిక భాషా ప్రతినిధుల నుంచి సూచనలు స్వీకరించి ఈ కార్యాన్ని నెరవేర్చివుంటే బాగుండేది. సాహిత్య అకాడమీ నిపుణులు అనబడేవారు రూ పొందించిన మార్గదర్శకాలు కేవలం తమిళభాషకు ప్రాచీన హోదా కట్టబెట్టడానికే రూపొందించినట్లుగా ఉన్నాయి. ప్రము ఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య విశ్వనాథం ఈ అంశాన్ని ధ్రువీకరి చండమే కాక ఆ మార్గదర్శకాలకు సరితూగే అర్హతలు తెలుగు భాషకు నిండుగా ఉన్నాయని తన వాదనలో నిరూపించారు. సాహిత్య అకాడెమీ నిపుణుల మొదటి నిబంధన ప్రకారం 'ప్రాచీన భాషగా గుర్తింపును కోరే భాష, ప్రాచీన సాహిత్య గ్రం థాలను కానీ, వెయ్యి సంవత్సరాల లిఖిత చరిత్రనుకానీ కలిగి ఉండాలి' క్రీస్తు పూర్వపు ఐతరేయ బ్రాహ్మణం, అశోకుని శాస నాలలో ఆంధ్రుల ప్రస్థావన ఉంది. క్రీస్తు శకం తొలినాళ్ళలోనే రోమన్ చరిత్రకారులు ఆంధ్రుల గురించి రాశారు. ఖ్రీ. శ. 1 వ శతాబ్దికి చెందిన అమరావతి స్థూప శిథిలాలలో తొలి తెలుగు పదం 'నాగబు' కనబడింది. ఇదే శతాబ్దానికి చెందిన గుణాఢ్యు ని 'బృహత్కథ', హాలుని 'గాథా సప్తశతి'లో అనేక తెలుగు శబ్దాలు ఉన్నాయి. కడప జిల్లా ఎర్రగుడిపాడులో క్రీ. శ. 575 లో రేనాటి చోళరాజు ఎరికల్ ముత్తరాజు వేయించిన తొలి తెలు గు గద్య శాసనం లభించింది. తొలి తెలుగు భాషా పోషకుడైన గుణగ విజాయాదిత్యుని సేనాధిపతి పండరంగడు క్రీ. శ. 848 లో అద్దంకిలో వేయించిన శాసనం తొలి తెలుగు పద్యశాసనం గా గుర్తింపబడింది. నన్నయకు ముందుయుగంలోనే దేశీ, సం స్కృత చందస్సులతో కూడిన పద్యశాసనాలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు భాషలో వెయ్యి సంవత్సరాలకు ముందే సాహిత్య గ్రంథాలుండేవని, తెలుగు భాషకు రెండు వేల సంవ త్సరాల చరిత్ర ఉందనీ పలు ఆ«ధారాలతో ఆచార్య విశ్వనాథం నిరూపించారు.
నిపుణుల రెండవ నిబంధన 'ఒక తరానికి చెందిన వ్యవహ ర్తలు విలువైన సాహిత్య పరంపరగా భావించే ప్రాచీన సాహిత్య సంపదను ఆ భాష కలిగి ఉండడం'. రామాయణ, భారత, భా గవతాలూ, ప్రబంధాలు,శతకాలూ, యక్షగానాలూ తెలుగులో అమూల్య సాహిత్యసంపదగా ఉండటం వల్ల తెలుగు భాష ఈ నిబంధనను కూడా సంతృప్తి పరుస్తోంది. మూడవ నిబంధన 'సాహిత్య సంపద ఇతర భాషా సమాజం నుంచి గ్రహించి నది కాకూడదు'. కవిత్రయం భారతాన్ని స్వతంత్ర కావ్యంగా తీర్చి దిద్దినారేగాని కేవలం అనువాదం చేయలేదుకదా! అలా అను కున్నా నన్నెచోడుని స్వతంత్రకావ్యం 'కుమార సంభవం' లేదా? శతకసాహిత్యం, అవధాన సంపద తెలుగు భాషకు స్వతంత్ర వారసత్వ సంపద. ఇక నాలుగో నిబంధన 'ప్రాచీన, అ ర్వాచీన భాషల మధ్య విచ్ఛిన్నత ఉన్నా అది అనర్హతకాదు'. రాసే భాష కు, మాట్లాడేభాషకు తేడా ఉండవచ్చనేది ఈ నిబంధన సారాం శం. నిపుణులు రూపొందించిన ఈ నాలుగు మార్గ దర్శకాలను సంతృప్తిపరచగలిగే సత్తా తెలుగు భాషకు ఉందని ఈ వివరణ లతో ఆచార్య విశ్వనాథం స్పష్టం చేశారు.
- తవ్వా ఓబుల్‌రెడ్డి
Courtesy: ఆంధ్ర జ్యోతి
Keywords: Telugu Andhra Pradesh India Indian classical ancient language status demand tcld2006
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home