అన్ని విధాల తెలుగుకు అర్హత
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)హైదరాబాద్, ఫిబ్రవరి10: వెయ్యి సంవత్సరాల నిబం ధన అయినా రెండువేల ఏండ్ల నిబంధన అయినా శ్రేష్ఠ (క్లాసికల్) భాషగా గుర్తింపు పొందడానికి తెలుగుకు పూర్తి అర్హత ఉన్నదని ప్రపంచ ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త, హైద రాబాద్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్, క్లాసికల్ భాషల ఎంపికకు కేంద్రప్రభుత్వం నియమించిన నిపు ణుల బృందంలో సభ్యులు ప్రొఫెసర్ భద్రిరాజు కృష్ణమూ ర్తి స్పష్టంచేశారు. తమిళంతో పాటు, తెలుగు, కన్నడం, మలయాళం భాషలకు కూడా క్లాసికల్ ప్రతిపత్తి ఇవ్వాలని తాను కేంద్రప్రభుత్వానికి సూచించినట్టు ఆయన తెలి పారు. తెలుగుకు ప్రత్యేక ప్రతిపత్తి కోసం నిపుణుడిగా, భాషాభిమానిగా తాను చేయవలసినదంతా చేశానని, తెలుగు అర్హతలను సాధికారంగా సమర్పించానని ఆయన వివరించారు. క్లాసికల్ భాషగా గుర్తింపు పొందడానికి 1500-2000 సంవత్సరాల వయస్సున్న చారిత్రక ఆధా రాలు, లేఖనసంచయం ఉండాలని తాను మొదట సూచిం చానని, తరువాత దాన్ని వెయ్యి సంవత్సరాలకు మార్చ డంలో కానీ, తిరిగి మరో సవరణతో పాత కొలమానానికే రావడంలో కానీ తన ప్రమేయం లేదని ఆయన చెప్పారు. భాష శ్రేష్ఠతను నిర్ణయించడానికి లిఖిత సాహిత్యాన్ని కాక, శాసనాలు, ఇతర భాషా సాహిత్యాలలో కనిపించే పదాలు వంటి ఆధారాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తాను గట్టిగా వాదించానని, ఆ ప్రమాణం ప్రకారం తెలు గుకు 2000సంవత్సరాల విశిష్ట చరిత్ర ఉన్నదని చెప్పారు.
తెలుగుభాషకు క్లాసికల్ ప్రతిపత్తి ఇవ్వడం గురించి జరుగుతున్న చర్చ నేపథ్యంలో ప్రొఫెసర్ కృష్ణమూర్తిని 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ వివా దం అంతటిలోనూ అనేక అపోహలు, అపార్థాలు కనిపిస్తు న్నాయని, భాషాప్రతిపత్తి గురించిన ఆకాంక్ష లక్ష్యశుద్ధితో, సమాచారబలంతో జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. క్లాసికల్ భాషను పత్రికలు 'ప్రాచీనభాష' అని అనువదిం చాయని, దానితో భాషల కాలానికి సంబంధించిన చర్చ అధికంగా జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. క్లాసి కల్- అన్న మాట కాలవాచకం కాదనీ, గుణవాచకమని ఆయన వివరించారు. ప్రాచీనతే కొలమానం అయితే, కొండ, కోయ భాష వంటి అనేకం క్లాసికల్ కోవలోకి వస్తాయని ఆయన అన్నారు. ఉదాత్తమైన, సంప్రదాయా లకు మార్గం వేసిన, విశిష్టమైన మేధో సాహిత్యకళారీతు లున్న భాషాసమాజాన్ని పేర్కొనడానికి వాడవలసిన సాం కేతిక పదం' క్లాసికల్ భాష' అని ఆయన చెప్పారు. కేంద్రం ఒక భాష విషయంలో ప్రత్యేక పక్షపాతం చూపినప్పుడు ప్రశ్నించడంలో తప్పులేదని, అయితే తెలుగుకు ప్రాచీన భాషగా కంటె ఆధునికభాషగా చేయవలసిన సేవ చాలా ఉన్నదని భాషాభిమానులు గుర్తించాలని ఆయన అన్నా రు.
కనీసం ప్రాథమిక స్థాయిదాకా మాతృభాషలో విద్యా బోధన కోసం చర్యలు తీసుకోకపోతే, భాషకు పెద్ద ప్రమా దం జరుగుతుందని ఆయన ఆవేదన చెందారు.
తమిళానికి శ్రేష్ఠభాష ప్రతిపత్తి అన్నిటికంటె ముందు రావడానికి రాజకీయ కారణాలున్నాయని,గత ఎన్నికలలో డిఎంకె దీని గురించి చేసిన వాగ్దానం యుపిఎ ప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యక్రమంలో ఒక అంశంగా చోటుచేసు కుందని ఆయన గుర్తుచేశారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది మాసాలకే 2004 సెప్టెంబర్ 2 వ తేదీన న్యూఢిల్లీలోని కేంద్రసాహిత్య అకాడమీ భవనంలో గోపీ చంద్ నారంగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రాథమి కమైన చర్చ జరిగిందని, అదే సంవత్సరం అక్టోబర్ 12 వ తేదీన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ క్లాసికల్‌ప్రతిపత్తి అర్హత లను వివరిస్తూ తమిళాన్ని క్లాసికల్ భాషగా ప్రకటించిం దని (నెం.ఐగ14014/7/2004ూఐఐఔ) ఆయన చెప్పారు. ఆ ఉత్తర్వులో పేర్కొన్న అర్హతలలో "వెయ్యి సంవత్సరాలకు పైగా తొలినాటి లేఖనాల/ చారిత్రక ఆకరాలు సమృద్ధిగా లభ్యం కావాలని'' (2-జీ) స్పష్టంగా ఉంది. నవంబర్ 25, 2005 నాడు హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ (నెం.ఐగ14014/7/2004ూఐఐఐ)లో కొలమా నాన్ని 1500-2000 సంవత్సరాలకు మార్చారు. తమిళా నికి తప్ప మరే భాషకూ క్లాసికల్ గుర్తింపు రాకుండా నిరోధించడానికే ఆ సవరణ ఉద్దేశించిందని విమర్శలు రా సాగాయి. తాజా నోటిఫికేషన్ తాను చూడలేదని, అయితే, వెయ్యి అయినా రెండువేలు అయినా తెలుగుభాషకు పూర్తి 'క్లాసికల్' అర్హతలు ఉన్నాయని భద్రిరాజు కృష్ణమూర్తి భరోసా ఇస్తున్నారు. రెండు రకాల కాలాలు కూడా మంత్రి వర్గస్థాయిలోనే నిర్ణయమయ్యాయని ఆయన అన్నారు.
'నిజానికి ప్రపంచవ్యాప్తంగా గ్రీకు, లాటిన్, పర్షియన్ వంటి సాంప్రదాయ భాషలను దృష్టిలో పెట్టుకుని సుమా రు 2వేల సంవత్సరాల ప్రాచీన విశిష్టతను ఒక కొలమా నంగా పరిగణిస్తూ వచ్చారు. అయితే, ఎక్కడా అది ఒక నిబంధన కాదు. ఒక అవగాహన మాత్రమే' అని కృష్ణ మూర్తి అన్నారు. శ్రేష్ఠభాషా ప్రతిపత్తి కోసం కన్నడం, తెలు గు భాషల నుంచి కూడా డిమాండ్లు వచ్చేసరికి పరిస్థితి మారిందని, అర్హతలలో సవరణలు కావాలని తమిళప్రతి నిధులు కోరారని ఆయన చెప్పారు. వెయ్యి ఏండ్ల కొలమా నాన్నే పరిగణనలోకి తీసుకుంటూ, తెలుగు, మలయాళం, కన్నడాలను కూడా శ్రేష్ఠభాషలుగా గుర్తించాలని తాను 2005, జనవరి13 నాటి సమావేశానికి నోట్ పంపించా నని ఆయన తెలిపారు. గత ఏడాది జూన్‌లో మరొక సమావేశం జర గవలసి ఉండగా, అది నిరవధికంగా వాయిదా పడిందని, ప్రస్తుతం క్లాసికల్ భాషల కమిటీ ఏ పనీ చేయడం లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం వ్యవహర్తలు లేని సంస్కృ తం, పాళి, ప్రాకృతం వంటి భాషలకు కేంద్రప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని, ఒక రాష్ట్రంలో మాట్లాడే భాషకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధు లు ఇస్తే ఇతరులు ప్రశ్నిస్తారని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భాషాభివృద్ధి కోసం ఎన్ని నిధులు వ్యయం చేసినా తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Keywords: Andhra Pradesh Telugu India Indian classical ancient language status demand tcld2006 Jyothi
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home