"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Friday, February 10, 2006

Andhra Pradesh bags $3-bn FAB CITY project

The answer to an earlier post last month titled 'Silicon Fab City : Will AP bag it?' was revealed yesterday, as Hyderabad outclassed Bangalore and Chennai to bag the prestigious Fab City project, India's first silicon chip manufacturing facility being setup by the AMD-SemIndia consortium.


click on image


లాంటిలాంటి సిటీ కాదు. హైదరాబాద్‌... తద్వారా ఆంధ్రప్రదేశ్‌ దశను మార్చేసే సిటీ. వేలకోట్ల డాలర్లతో... లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ... భాగ్యనగరాన్ని భారతదేశ హార్డ్‌వేర్‌ రాజధానిగా మార్చే సిటీ. అదే... ప్రభుత్వం ఎంతోకాలంగా చెబుతున్న ఫ్యాబ్‌ సిటీ. సిలికాన్‌ చిప్‌ తయార యూనిట్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యే ఫ్యాబ్‌ సిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతోంది. ''అబ్బే! ఇంకా ఖరారు కాలేదు. సెమ్‌ ఇండియా సంస్థ ప్రకటించందే ఏమీ చెప్పలేం'' అని ఢిల్లీలో బుధవారం పేర్కొన్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఒక్కరోజు తిరక్కుండానే గురువారం దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేశారు. అదికూడా... సెమ్‌ ఇండియా సీఈఓ అనిల్‌ అగర్వాల్‌ సమక్షంలో. అయితే వైఎస్‌ ప్రకటించటానికి కొన్ని గంటల ముందు... బెంగుళూరులో ఇదే విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ మంత్రి దయానిధి మారన్‌ కూడా వెల్లడించారు. ఈ బృహత్తర ప్రాజెక్టుకు వచ్చేనెల్లో శంకుస్థాపన జరగనుంది. స్వయంగా ఈ విషయాన్ని చెప్పిన అనిల్‌ అగర్వాల్‌... రాష్ట్ర ప్రభుత్వంతో ఈ మేరకు అవగాహన పత్రంపై సంతకాలు చేయనున్నట్లు తెలియజేశారు.

నిజానికి హైదరాబాద్‌లో సెమ్‌ ఇండియా ఫ్యాబ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందే అంగీకారం కుదిరింది. దీంతో ఫ్యాబ్‌ సిటీ ఏర్పాటు ఖరారైందని మంగళవారం 'ఈనాడు'లో వార్త కూడా వెలువడింది. కానీ కేంద్రం ప్రకటించే విధివిధానాలను చూశాకే దీన్ని వెల్లడించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ''ఇంకా సమయం ఉంది'' అంటూ దాటవేసింది. అయితే ఫ్యాబ్‌ సిటీలకు ముడి పదార్థాలను, విడిభాగాలను అందించే సప్లయర్స్‌ సమావేశం గురువారం బెంగుళూరులో జరిగింది. సెమ్‌ ఇండియా హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటుకు ఒప్పుకుందని అందులో కేంద్ర మంత్రి మారన్‌ చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమూ సెమ్‌ఇండియా ప్రతినిధులను హడావుడిగా రప్పించింది. ప్రతిపాదిత ఫ్యాబ్‌సిటీలో సెమ్‌ ఇండియా కూడా యూనిట్‌ స్థాపిస్తుందని ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి గురువారం విలేకరుల సమక్షంలో ప్రకటించారు. సాఫ్ట్‌వేర్‌లో ఎంత పురోగమించినా ఇంకా హార్డ్‌వేర్‌లో భారతదేశం వెనకబడిపోయిందని, చైనా, కొరియా, తైవాన్‌ వంటివి బాగా ప్రగతి సాధించాయని చెప్పారు. ఫ్యాబ్‌ సిటీ ఏర్పాటుతో దేశం హార్డ్‌వేర్‌లోనూ పురోగమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సెమ్‌ ఇండియా అధ్యక్షుడు- సీఈవో వినోద్‌ అగర్వాల్‌ కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే నెలలో దీనికి శంకుస్థాపన జరిగే అవకాశముందని, రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదర్చుకోనున్నామని వెల్లడించారు. ఇందులో 25 కోట్ల డాలర్ల వాటాను పెట్టాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నట్లు అగర్వాల్‌ చెప్పారు. తమిళనాడు దీనిపై పెద్ద ఆసక్తి చూపలేదని, బెంగుళూరు మాత్రం ఆసక్తిని కనబరచినా, చివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న ప్రోత్సాహకాలు, సమకూరుస్తామన్న మౌలిక సౌకర్యాలు చూసి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నామని వినోద్‌ వివరించారు. అంతేకాకుండా ''నా భార్యకు కూడా ఈ నగరం బాగా నచ్చింది మరి'' అంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా ఛలోక్తి విసిరారు. దేశంలో ఎలక్ట్రానిక్‌ వస్తువుల వాడకం విపరీతంగా పెరుగుతోందని, కావలసిన సెమీ కండక్టర్లను దిగుమతి చేసుకోవడంకన్నా... ఇక్కడే తయారు చేయాలనే ఆలోచనే తమను ఫ్యాబ్‌ యూనిట్‌ ఏర్పాటుకు పురికొల్పిందని చెప్పారు. తాజా పరిణామాలతో... ఇప్పటిదాకా బెంగుళూరులో యూనిట్‌ పెట్టాలని అనుకున్న సైప్రస్‌, సోలార్‌సెల్‌ కూడా హైదరాబాద్‌కే వచ్చే వీలుందని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.



''హైదరాబాద్‌లో ఫ్యాబ్‌ సిటీ ఏర్పాటుకు సెమ్‌ ఇండియా అంగీకరించిందని చెప్పటానికి సంతోషిస్తున్నా. త్వరలో దానితో ఎంఓయూ కుదుర్చుకుంటాం. విధివిధానాలను కేంద్రం ప్రకటిస్తుంది. మనకున్న ఆస్తల్లా మానవవనరులే. ఫ్యాబ్‌ సిటీ రావటం వల్ల హార్డ్‌వేర్‌కు హైదరాబాద్‌ రాజధాని అవుతుంది. ఈ సిటీ మన దేశంలోకి రావటానికి కేంద్ర మంత్రి మారన్‌ కృషి చాలా ఉంది.''
- వైఎస్‌
''మా యూనిట్‌కు తొలి దశలో బిలియన్‌ డాలర్లు కావాలి. తరువాతి దశల్లో మరో రెండు బిలియన్‌ డాలర్లు ఖర్చు పెడతాం. దీనిలో మా సాంకేతిక భాగస్వామి ఏఎండీ కూడా పెట్టుబడి పెడుతుంది. ప్రత్యక్షంగా కొన్ని వేలమందికి మాత్రమే ఉపాధి దొరికినా పరోక్షంగా అంతకు పది రెట్ల మందికి ఉపాధి కలుగుతుంది.''
- అనిల్‌ అగర్వాల్‌
''మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు సెమ్‌ ఇండియా ప్రతినిధులు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుల్లో పర్యటించి చర్చలు జరిపారు. చెన్నైకి వచ్చినపుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వారితో అమర్యాదగా మాట్లాడారు. ప్రాజెక్టుక్కావలసిన నీటి గురించి వారడిగితే తమిళనాడంతా నీరేనని వ్యంగ్యంగా చెప్పారు. రాజశేఖరరెడ్డి మాత్రం జయలా ఏసీ గదిలో కూర్చుని సమాధానాలు చెప్పలేదు. వారిని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్ళి తాము కల్పించబోయే వసతుల్ని వివరించారు. వైఎస్‌ అభినందనీయుడు!''
- దయానిధి మారన్‌
Courtesy: ఈనాడు

*****

HYDERABAD: In a stunning coup, Hyderabad beat IT heavyweight Bangalore to bag the Fab City project, which will host India’s first major silicon chip manufacturing facility.
The project will see a veritable watershed of foreign investment in Shamshabad, with $3 billion to be brought in by the anchor company SemIndia in collaboration with the international chip major AMD, and more by other chip manufacturers. Just SemIndia is likely to create 5,000 jobs directly and thousands more indirectly through the influx of about 200 suppliers and ancillaries.
“We have decided to position Fab City in Hyderabad.” That announcement by SemIndia president and CEO Vinod K Agarwal rippled through a press conference like a streak of lightning at chief minister Y S Rajasekhara Reddy’s camp office on Thursday. Hours earlier, Union IT and communications minister Dayanidhi Maran had declared that Hyderabad—a brash pretender to Bangalore’s primacy as a destination for IT investmenthad won the race for the prestigious project. In a delicious irony, Maran’s announcement was made in Bangalore.

Agarwal said three states had been shortlisted to host Fab City—Andhra Pradesh, Karnataka and Tamil Nadu.
“However, Tamil Nadu did not evince much interest. After careful consideration of all the relevant factors , we decided on Hyderabad,” he said. These factors included the weather, roads, availability of a semi-skilled work force, electricity , water and proximity to an international airport.
Fab City is to be located on 1,200 acres of land to be given by the AP government in Maheshwaram mandal near Shamshabad. The groundbreaking ceremony will take place in a month’s time. The project is to be executed in two phases, the first involving investment of $ 1 billion and the second $ 2 billion. There will be two projects in the first phase. The first project, which will begin right after the groundbreaking ceremony, will involve the setting up of assembly and testing facilities in which about 5,000 people will be employed.

Production will start a year later. The second involves the construction of the actual chip manufacturing facility, known in the trade as a fab. This will be a two-year endeavour. The buildings will come up in the first year followed by the installation of the equipment in the second. The job creation will gather force in the third year, with about 5,000 people streaming into the facility.
Regarding spinoff employment potential, Agarwal said Fab City would create employment for lakhs of people, mainly through the aegis of some 200 suppliers likely to set up shop around the SemIndia fab. “Unlike the IT industry, where 80 per cent of the requirement is of skilled workers, chip manufacturing needs only 20 per cent skilled workers, the remainder being non-skilled and semi-skilled workers. Such a work force is available in plenty in Hyderabad. The first batch of skilled workers will be brought in from abroad along with their families, but most of them will be of Indian origin,” he said.
As for the financing part, Agarwal said the $ 1 billion required for phase one will be raised through strategic partners, debt financing and subsidies from the government of India and AP. “The central government needs to invest $ 250 million. We are waiting for a response from it,” he said and added that the deal with the AP government on land allocation , supply of power and water and the Special Economic Zone status for Fab City will be announced later.

Throughout the press conference, Rajasekhara Reddy preferred to give centrestage to Agarwal, his adviser and venture capitalist Pratap ‘Bob’ Kondamuri, B V Naidu of the Software Technology Parks of India and his own IT adviser C S Rao.
BILLION DOLLARS
Seen anything like it
Some facts to put the Fab City’s 3 billion dollars into perspective
Total FDI inflow into India in 2004-05 :
$3.75 billion
Total FDI expected this year:
$7 billion
What Intel planned to invest in Bangalore:
$ 1 billion
What Bill Gates planned to invest in India:
$1.7 billion
Total investment by Japan in India:
$2 billion
WHAT FAB’S 3 BILLION CAN DO
5,000 jobs by 2009 10-14 lakh spinoff jobs in 10 years 200 ancillary industries

Courtesy: Economic Times

*****
ఫ్యాబ్‌సిటీ అంటే...!
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఇటీవల తరచూ ఫ్యాబ్‌సిటీ అనే పదం వినిపిస్తోంది. అసలేమిటీ ఫ్యాబ్‌సిటీ? ఫ్యాబ్‌ అంటే... కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో వాడే చిప్స్‌(ఐసీ)ను తయారుచేసే యూనిట్‌. ఇలాంటి యూనిట్లు కొన్ని కలిసి ఒకేచోట ఏర్పడితే అదే ఫ్యాబ్‌ సిటీ. బాగా చలిగానీ, వేడిగానీ లేని సమశీతోష్ణ ప్రాంతాలు... వాతావరణంలో ఎక్కువ తేమ ఉండని ప్రాంతాలు... దీనికి అత్యంత అనుకూలంగా పరిగణిస్తారు. పుష్కలంగా నీరు, నిరంతరాయంగా విద్యుత్తు, అంతర్జాతీయ విమానాశ్రయం దాకా మంచి రోడ్లు కావాలని డెవలపర్లు కోరుకుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల ఒక సర్వే చేసినప్పుడు... పుణె, బెంగుళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతాల కన్నా హైదరాబాదే దీని ఏర్పాటుకు అనుకూలమని తేలింది. హైదరాబాద్‌ పరిసరాల్లో నానోటెక్‌ సిలికాన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఇప్పటికే ఓ ఫ్యాబ్‌ యూనిట్‌ స్థాపనకు కొరియాకు చెందిన జున్‌మిన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒక ప్లాంటు వస్తే మిగతావీ వస్తాయనేది సర్కారు ఆశ. ఫ్యాబ్‌సిటీ ప్రధానంగా కేంద్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టు. సిటీ ఎక్కడ ఏర్పాటయితే అక్కడ యూనిట్‌ నెలకొల్పడానికి ఎన్నారైలకు చెందిన సెమ్‌ ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసింది. అమెరికాకు చెందిన ఏఎండీ సాంకేతిక సహకారంతో మనదేశంలో సెమీ కండక్టర్‌ యూనిట్‌ స్థాపనకు సెమ్‌ ఇండియా ప్రయత్నాలు చేస్తోంది. ఫ్యాబ్‌ సిటీ రాష్ట్రంలో ఏర్పడితే కేంద్రం కొన్ని వందల కోట్ల రూపాయలను మౌలిక వసతుల కల్పనకు గ్రాంటుగా ఇచ్చే వీలుంది. అందుకే బెంగుళూరు, చెన్నై నగరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫ్యాబ్‌సిటీకి 1500 ఎకరాల భూమిని కేటాయించడానికి ఆంధ్రప్రదేశ్‌ సిద్ధమవుతోంది. కారు చౌక రేటుకు కృష్ణా జలాల్ని కూడా ఇస్తానంటోంది. కాస్ట్‌-టు-సర్వ్‌ అంటే... ఒకరకంగా హోల్‌సేల్‌ ధరకు విద్యుత్తూ సరఫరా చేస్తామని హామీ ఇస్తోంది.
Courtesy: ఈనాడు

*****

The story behind the 'fab'ulous deal

HYDERABAD: When SemIndia announced in September 2005 its plans to set up the first Fab facility in the country, many states including Andhra Pradesh, Tamil Nadu, Karnataka, Maharashtra and even Haryana — jumped into the fray and started lobbying to secure the prestigious project.

The mandarins at the newly formed APInvest and the Information Technology (IT) department in the state too began their efforts in convincing the president and CEO of Sem India Dr Vinod Agarwal to set up the Fab facility in Hyderabad and had their first meeting with his team in October last year.

Sem India advisor Pratap Kondamuri later continued the discussions with chief secretary T K Dewan, where top bureaucrats of all departments concerned were present in the meeting promising cooperation to SemIndia at every level.

APInvest CEO and IT advisor to the government C S Rao, who was tasked to bring the Fab city to Hyderabad by the chief minister, followed up the matter by having several rounds of discussions with the SemIndia and presented to Agarwal and his team the various advantages Hyderabad had over the rival cities.

During the negotiations it emerged that SemIndia was looking at four factors — land, water, power and connectivity — for choosing the destination for the Fab city.

Agarwal was said to have insisted that his company required a minimum of 5,000 acres of land, but after several rounds of hard bargaining, he was convinced to take 1,200 acres to set up the facility near Shamshabad where the international airport is coming up.

While Tamil Nadu and Karnataka too offered the same extent of land, their locations far away from the international airports came as an advantage logistically to Andhra Pradesh.

SemIndia reportedly insisted that its material should reach the aircraft in less than two hours from the time of despatch from its campus.

While AP exhibited that it may not even take 15 minutes drive from the Fab unit to reach the international airport coming up at Shamshabad, the land proposed by Karnataka was located 70 km away from its upcoming international airport at Devanahalli.

Even Tamil Nadu could not provide land within 50 km from its airport, while Pune - because it does not have an international airport - lost out in the race completely on that count.

While all the states proposed to give power at the production cost itself (AP promised Rs 1.85 per unit), the 80 MGD capacity Krishna water came as a great advantage for the state to win over the competitors.

Tamil Nadu was facing an acute shortage of water, while Karnataka's failure to end the row over sharing of Cauvery waters with Tamil Nadu worked against the latter on that front.

Meanwhile, India Semiconductors Association began lobbying with the Centre to announce a policy for semiconductor manufacturing in the country on the lines of IT and ITES.

Though Union IT minister Dayanidhi Maran was said to have exerted pressure on SemIndia to set up base in Chennai, the unfavourable physical conditions, besides political animosity between Maran's DMK party and the ruling AIADMK made the company to look the otherway.

The final act of lobbying came with YSR pitching in for the project with both the prime minister and Sonia Gandhi. He paraded MPs from AP in Delhi, and made them denounce publicly the moves of Maran to shift the Fab facility to his native state.

Courtesy: Times of India


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


1 Comments:

At 8:20 AM, Blogger Ritesh గారు చెప్పినారు...

Great post....its good to find a common place with all the info related to the fab city.

 

Post a Comment

<< Home