"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Saturday, January 07, 2006

కాలచక్రకు విద్యుత్తు యంత్రాంగం విస్తృత ఏర్పాటు


* మూడు కోట్లతో చేపట్టిన పనులు పూర్తి
* 103 మంది అదనపు సిబ్బంది
న్యూస్‌టుడే, గుంటూరు

గుంటూరు జిల్లా అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కాలచక్ర మహోత్సవాలకు నిరంతర విద్యుత్తు సరఫరా అందించేందుకు ఎస్‌పీడీసీఎల్‌జిల్లా శాఖ మూడు కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. ఉత్సవాలు నిర్వహించనున్నన్ని రోజులూ విద్యుత్తు సరఫరాకు ఏమాత్రం ఆటంకం కలిగే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. అమరావతిలో పనిచేసే సిబ్బందికి తోడుగా మరో 103 మంది సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేశారు.
* తాడికొండ నుంచి అమరావతికి 25 కిలోమీటర్ల మేరకు 33కెవి విద్యుత్తు లైనును ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా నిర్మించారు.
* అమరావతి సబ్‌స్టేషన్‌ నుంచి కాలచక్ర వేడుకలు జరిగే వివిధ ప్రాంతాలకు దాదాపు 32 కిలోమీటర్ల మేరకు 11 కెవి లైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
* 100 కెవి సామర్ధ్యం కల 40 సరఫరా కేంద్రాలను మరో సింగిల్‌ ఫేజ్‌ సరఫరా కేంద్రాన్ని నాణ్యమైన విద్యుత్తు సరఫరా నిమిత్తం కాలచక్ర వేడుకల ప్రాంతాల్లో నిర్మించారు
* నిర్వహణ కోసం 80 మందిని వివిధ ప్రాంతాల్లో షిఫ్ట్‌ల వారీగా నియమించారు. వీరితోపాటు మరో 20 మంది అధికారులు వాహనాలతో సిద్ధంగా ఉంటున్నారు.
* ఎ.డి.ఇ, ఎ.ఇ. స్థాయి అధికారులను అమరావతిలోని ఎమ్మార్వో కార్యాలయంలో వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నియమించారు.
* విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉండే సాయంత్రం సమయాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండేలా చూసేందుకు డి.ఇ. స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
* సిబ్బంది మధ్య సమన్వయం, వేగవంతమైన సమాచారం కోసం 16 వాకీటాకీలను సమకూర్చారు. ప్రధాన నియంత్రణ కేంద్రం వద్ద వైర్‌లెస్‌ సెట్‌ను కూడా ఏర్పాటు చేశారు.
* కాలచక్ర ఉత్సవాలకు విద్యుత్తు సరఫరాలో ఎటువంటి లోటుపాట్లూ తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకొంటున్నట్టు విద్యుత్తు శాఖ గుంటూరు ప్రాంతీయ ఎస్‌.ఇ రాజశేఖర్‌ తెలిపారు.

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005 , Nagarjunasagar, Nagarjunakonda


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home