నగరంలో కాలచక్ర కళకళలు
న్యూస్‌టుడే, కలెక్టరేట్
అమరావతిలో అంతర్జాతీయ స్థాయి కాలచక్ర ఉత్సవాలకు నగరం కూడా ముస్తాబైంది. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు విడుదల కాకపోవడంతో నగర పాలక సంస్థ నామమాత్రంగానే ముస్తాబు కార్యక్రమాలను చేపట్టింది. నగరం నుంచి అమరావతికి వెళ్ళే దారిని కాస్త సింగారించింది. సెంట్రల్ డివైడర్లకు రంగులు అద్ది... డివైడర్లలోని చెట్లను అద్దంగా కత్తిరించింది. తన వంతుగా కాలచక్ర ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ నగరంలోని అక్కడక్కడ ప్రత్యేక బోర్డులు ఏర్పాటుచేసింది. అతిథిగృహం విషయంలో మాత్రం కొంచెం ఎక్కువగానే ఖర్చుచేయడంతో అతిథులకు ఏసీ గదులు సిద్ధమయ్యాయి. ఇక జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని లుంబినివనంలో ఉన్న తథాగతుని సమస్యలు తీరిపోయాయి. పిచ్చిచెట్ల మధ్య ఉండే ఆయన విగ్రహం చుట్టూ బాగుచేశారు. అమరావతి రోడ్డులో ప్రైవేటుసంస్థలు ముందుకు వచ్చి కాలచక్రఅతిథులకు స్వాగతం పలుకుతూ పెద్దకటౌట్‌లు ఏర్పాటుచేశారు. మొత్తానికి నగరానికి కూడా కాలచక్ర కళలు తెప్పించారు. మరోపక్క కాలచక్ర అతిథులైన బౌద్ధులు నగరంలోని పలు ప్రాంతాల్లో సంచారం చేస్తుండటంతో ప్రజలు వారికి సాదరపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నారు. శంకర్ విలాస్ సెంటర్, బ్రాడీపేట, అరండల్‌పేట, మార్కెట్‌సెంటర్ ప్రాంతాల్లో బౌద్ధులు పెద్దసంఖ్యలో సంచరిస్తున్నారు. నగరంలోని షాపుల్లోనూ బౌద్ధుల కొనుగోళ్లతో సందడి నెలకొంది.
*****
తీవ్ర వాదుల నుంచి ప్రమాదం ఉందన్న ప్రచారం జరగడంతో వేలాది మంది పోలీసులు సాగర్‌లో రెండు రోజులు మకాం వేసి పహారా కాశారు.* అనుపు వద్ద దలైలామా ప్రయాణించే లాంచీలోకి వి.ఐ.పి.లను మాత్రమే అనుమతించారు. పత్రికా విలేకరులను, టి.వి. ఛానళ్ళ ప్రతినిధులను కూడా ఆ లాంచీలోకి అనుమతించ లేదు.
టిబెటియన్లు ప్రయాణించే లాంచీలకు ఇరువైపులా మర పడవల్లో పోలీసులు, గజ ఈతగాళ్ళతో రక్షణగా ప్రయాణించారు.
నాగార్జునకొండ మ్యూజియంలో కూడా రోప్ లైన్ పార్టీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం బౌద్ధ మత గురువుకు అసౌకర్యం కలిగించింది.
బుద్ధ ధాతువు భద్రపరిచిన గదిలోకి కలెక్టరు జయలక్ష్మిని కూడా అనుమతించకపోవడం చూపరులను నివ్వెర పరిచింది. ఆమె కలెక్టర్ అని స్థానిక నాయకులు పేర్కొన్నా మ్యూజియం అధికారులు స్పందించకపోవడం విశేషం.
మ్యూజియంలో పురాతన బౌద్ధ చిహ్నాలను, విగ్రహాలను దలైలామా ఆప్యాయంగా స్పృశించి పరవశం చెందారు. తధాగతుడి నిలువెత్తు విగ్రహం ఎదుట భక్తి ప్రపత్తులతో సాష్టాంగ ప్రణామం చేశారు.
ప్రాచీన శిలాఫలకాలపై సంస్కృత లిపిలో చెక్కిన శాసనాలను పఠించి అర్థం విడమరిచి చెప్పారు.
* దలైలామాకు గైడ్‌గా ఆర్కియాలజికల్ సూపరింటెండెంటు జితేందర్‌దాస్ వ్యవహరించారు.
* మామూలుగా మ్యూజియం లోకి కెమెరాలను అనుమతించరు. దలైలామా సందర్శన సందర్భంగా డజన్ల సంఖ్యలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రావడంతో పురావస్తు శాఖాధికారులు చేతులెత్తేశారు.
* ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు, కె.సి.పి. జె.ఎం.డి. వెలగపూడి ఇందిరాదత్, ఆమె కుమార్తె కవితాదత్ దలైలామాకు పుష్ప గుచ్ఛం అందించడంలో ఇబ్బంది పడ్డారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వారిని ప్రత్యేకంగా పిలిచి పరిచయం చేసి వి.ఐ.పి.ల లాంచీలో కొండకు తీసుకువెళ్లారు.
* పుష్పగుచ్ఛాలను కూడా పోలీసు అధికారులు మెటల్ డిటెక్టరుతో పరీక్షించడం గమనార్హం.
* అనుపు వద్ద, లాంచీ ప్రయాణంలోనూ జిల్లా పరిషత్ ఛైర్మన్ పాతూరి నాగభూషణం హడావుడి అధికంగా కనిపించింది.
* సాగర్ పర్యటన ఆసాంతం పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి, బౌద్ధమత గురువు దలైలామా వెన్నంటి ఉన్నారు.
* మహాచైత్యం వద్ద పూజా క్రతువు అనంతరం హాజరైన వారందరికీ దలైలామా పండ్లు, బిస్కట్లు ప్రసాదంగా పంపిణీ చేశారు. తిరుగు ప్రయాణంలో స్థూపం చుట్టూ భిక్షువులతో కలిసి ప్రదక్షిణ చేశారు.
* వి.పి.సౌత్‌లో బౌద్ధ ప్రాధాన్య పర్యాటక క్షేత్రాలను నిర్లక్ష్యం చేసి హిల్ కాలనీలో కోట్లాది రూపాయల వ్యయంతో బుద్ధవనం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ డాక్టరు బసివిరెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష కమిటీ దలైలామాకు వినతిపత్రం సమర్పించారు. ఆయన ఆధ్వర్యంలోనైనా అనుపు, దక్షిణ విజయపురిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
ప్రశాంతంగా దలైలామా పర్యటన
విజయపురిసౌత్, మాచర్ల రూరల్, జనవరి 3 (న్యూస్‌టుడే): బౌద్ధమత గురువు దలైలామా నాగార్జున సాగర్ పర్యటన పూర్తి బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరగడంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.తీవ్ర వాదుల నుంచి ప్రమాదం ఉందన్న ప్రచారం జరగడంతో వేలాది మంది పోలీసులు సాగర్‌లో రెండు రోజులు మకాం వేసి పహారా కాశారు.* అనుపు వద్ద దలైలామా ప్రయాణించే లాంచీలోకి వి.ఐ.పి.లను మాత్రమే అనుమతించారు. పత్రికా విలేకరులను, టి.వి. ఛానళ్ళ ప్రతినిధులను కూడా ఆ లాంచీలోకి అనుమతించ లేదు.
టిబెటియన్లు ప్రయాణించే లాంచీలకు ఇరువైపులా మర పడవల్లో పోలీసులు, గజ ఈతగాళ్ళతో రక్షణగా ప్రయాణించారు.
నాగార్జునకొండ మ్యూజియంలో కూడా రోప్ లైన్ పార్టీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం బౌద్ధ మత గురువుకు అసౌకర్యం కలిగించింది.
బుద్ధ ధాతువు భద్రపరిచిన గదిలోకి కలెక్టరు జయలక్ష్మిని కూడా అనుమతించకపోవడం చూపరులను నివ్వెర పరిచింది. ఆమె కలెక్టర్ అని స్థానిక నాయకులు పేర్కొన్నా మ్యూజియం అధికారులు స్పందించకపోవడం విశేషం.
మ్యూజియంలో పురాతన బౌద్ధ చిహ్నాలను, విగ్రహాలను దలైలామా ఆప్యాయంగా స్పృశించి పరవశం చెందారు. తధాగతుడి నిలువెత్తు విగ్రహం ఎదుట భక్తి ప్రపత్తులతో సాష్టాంగ ప్రణామం చేశారు.
ప్రాచీన శిలాఫలకాలపై సంస్కృత లిపిలో చెక్కిన శాసనాలను పఠించి అర్థం విడమరిచి చెప్పారు.
* దలైలామాకు గైడ్‌గా ఆర్కియాలజికల్ సూపరింటెండెంటు జితేందర్‌దాస్ వ్యవహరించారు.
* మామూలుగా మ్యూజియం లోకి కెమెరాలను అనుమతించరు. దలైలామా సందర్శన సందర్భంగా డజన్ల సంఖ్యలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రావడంతో పురావస్తు శాఖాధికారులు చేతులెత్తేశారు.
* ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు, కె.సి.పి. జె.ఎం.డి. వెలగపూడి ఇందిరాదత్, ఆమె కుమార్తె కవితాదత్ దలైలామాకు పుష్ప గుచ్ఛం అందించడంలో ఇబ్బంది పడ్డారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వారిని ప్రత్యేకంగా పిలిచి పరిచయం చేసి వి.ఐ.పి.ల లాంచీలో కొండకు తీసుకువెళ్లారు.
* పుష్పగుచ్ఛాలను కూడా పోలీసు అధికారులు మెటల్ డిటెక్టరుతో పరీక్షించడం గమనార్హం.
* అనుపు వద్ద, లాంచీ ప్రయాణంలోనూ జిల్లా పరిషత్ ఛైర్మన్ పాతూరి నాగభూషణం హడావుడి అధికంగా కనిపించింది.
* సాగర్ పర్యటన ఆసాంతం పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి, బౌద్ధమత గురువు దలైలామా వెన్నంటి ఉన్నారు.
* మహాచైత్యం వద్ద పూజా క్రతువు అనంతరం హాజరైన వారందరికీ దలైలామా పండ్లు, బిస్కట్లు ప్రసాదంగా పంపిణీ చేశారు. తిరుగు ప్రయాణంలో స్థూపం చుట్టూ భిక్షువులతో కలిసి ప్రదక్షిణ చేశారు.
* వి.పి.సౌత్‌లో బౌద్ధ ప్రాధాన్య పర్యాటక క్షేత్రాలను నిర్లక్ష్యం చేసి హిల్ కాలనీలో కోట్లాది రూపాయల వ్యయంతో బుద్ధవనం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ డాక్టరు బసివిరెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష కమిటీ దలైలామాకు వినతిపత్రం సమర్పించారు. ఆయన ఆధ్వర్యంలోనైనా అనుపు, దక్షిణ విజయపురిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
*****
విద్యార్ధులకు బౌద్ధ సూత్రాలపై అవగాహన కల్పించండి
కొత్తపేట, జనవరి 3 (న్యూస్‌టుడే): ప్రేమ, శాంతి తత్వాలను ప్రబోధించే బౌద్ధ సూత్రాల పట్ల విద్యార్ధులకు అవగాహన ఉండేలా అధ్యాపకులు సహకరించాలని ఆచార్య నాగార్జున యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.బాలమోహన్ దాస్ కోరారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రచురించిన 'బుద్ధిజం' పుస్తకాన్ని మంగళవారం ఆయన స్థానిక అరండల్‌పేటలోని కన్నా కాన్సెప్ట్ స్కూల్ ఆవరణలో ఆవిష్కరించారు. స్కూల్ అధినేత కన్నామాస్టారు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలమోహన్‌దాస్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. బౌద్ధ మతం సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించిందని ఆయన తెలిపారు. ధర్మం శరణం గఛ్చామి, సంఘం శరణం గఛ్చామి అంటూ పరిపూర్ణ మానవత్వాన్ని చాటిందన్నారు. అతిచిన్న వయసులోనే సిద్ధార్ధుని కంటపడిన బాధాతప్త దృశ్యాలు ఆయనను తాత్వికునిగా మార్చాయని చెప్పారు. జీవిత సత్యాలను తెలుసుకునేందుకు బుద్ధుడు నాలుగు ఆర్య సత్యాలను, అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించాడని, వీటి ద్వారా దుఃఖాన్ని నివారించి జ్ఞానాన్ని పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో నాగార్జున కొండ, అమరావతి, భట్టిప్రోలు, గోలి తదితర బౌద్ధక్షేత్రాలు ప్రసిద్ధి చెందాయని అన్నారు. ప్రస్తుతం మన జిల్లాలో కాలచక్ర మహాసభలు జరుగుతుండటం గర్వకారణమని అన్నారు. కార్యక్రమంలో యూనివర్శిటీ మాజీ వి.సి. డాక్టర్ కె.ఆర్.ఆర్.మోహనరావు మాట్లాడుతూ స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్, చటోపాధ్యాయ, అంబేద్కర్ తదితర మేధావులందరూ బుద్ధుడిని మహోన్నత వ్యక్తిగా కొనియాడారని చెప్పారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కె.యస్.లక్ష్మణరావు మాట్లాడుతూ బుద్ధిజంపై విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకు త్వరలోనే క్విజ్ పోటీలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.వి.యస్.కోటేశ్వరరావు, యూనివర్శిటీ దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ వి.చంద్రశేఖరరావు, జి.వి.వి.సుబ్బారాయుడు, లోక్‌సత్తా నాయకులు కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005 , Nagarjunasagar, Nagarjunakonda
0 Comments:
Post a Comment
<< Home