చెరుకుపల్లి : కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం
ఇది నేను పుట్టిన ఊరు ( చెరుకుపల్లి గ్రామం, గుంటూరు జిల్ల )
చెరుకుపల్లి, రూరల్, జనవరి 1 (న్యూస్టుడే): నూతన సంవత్సర వేడుకలను చెరుకుపల్లిలో ఘనంగా జరిగాయి. సరిగ్గా 12 గంటల సమయంలో యువకులు వీధులలో 'హ్యాపీన్యూయర్' అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచారు. చెరుకుపల్లిలో శ్రీరాం యూత్ ఆధ్వర్యంలోను, గుళ్ళపల్లిలో అంబికాయూత్ ఆధ్వర్యంలోను యువకులు ఉత్సాహంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. హిందూ దేవాలయాలలోను, చర్చిలలోను, మసీదులలోను ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గుళ్ళపల్లి అంబికాయూత్ ఆధ్వర్యంలో ఉప్పు, రంగులతో వేసిన చిత్రం చిన ఇండియా మ్యాప్ పలువురిని ఆకర్షించింది.
Courtesy: ఈనాడు
0 Comments:
Post a Comment
<< Home