"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Thursday, January 05, 2006

కాలచక్రతో టూరిజం అభివృద్ధి


సత్తెనపల్లి, జనవరి 4 (న్యూస్‌టుడే): కాలచక్ర మహోత్సవాల నిర్వహణ మూలంగా రాష్ట్రంలోని పర్యాటకశాఖ మరింత అభివృద్ధి చెందగలదని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహనరెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఏడాది కాలంలో టూరిజం శాఖ మరింత పటిష్టవంతమవుతుందన్నారు. సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వరకూ గల రోడ్డును డబుల్‌రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపామని ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సి.ఆర్‌.ఎఫ్‌. పండ్స్‌ విడుదల జరిగాక ఆయా పనులు మొదలవుతాయన్నారు. విలేకరుల సమావేశంలో వీరితోపాటు కాంగ్రెస్‌ నాయకులు కొండపల్లి వెంకటేశ్వర్లు, యార్డు ఛైర్మన్‌ కట్టా సాంబయ్య, ఛైర్‌పర్సన్‌ గంటా సరస్వతి, కౌన్సిలర్లు గురవయ్య, ఝాన్సీలక్ష్మీభాయి, ముద్దినేడి శ్రీను, గాత్రం కుముదినీదేవి పాల్గొన్నారు.

*****

కాలచక్ర మహోత్సవంలో 'జింకా' చిత్రాలు

న్యూస్‌టుడే, సత్తెనపల్లి
'కళలు' దేశమాత గళమున 'హారాలు'
'కళలు' జాతిప్రగతిని తెలుపు 'వెలలు'

దేశ ఔన్నత్యాన్ని, సౌభాగ్యసంపదలను, జాతిపురోగమనాన్ని లలితకళలు చాటి చెబుతాయి. వాటిలో మహత్తరమైన చిత్రకళకు పేరెన్నికగన్న జిల్లామనది. కుంచెతో ఎంచుకొన్న భావాలకు ఊపిరిపోసే చిత్రకారులెందరో గుంటూరు జిల్లాలో ఉన్నారు. సరిగ్గా మూడేళ్ళ తర్వాత మరోసారి వీరందరి కలయిక జరుగబోతోంది. అమరావతిలో జరగబోయే 'కాలచక్ర-2006' మహోత్సవాలలో తమలోని చిత్రకళా నైపుణ్యాన్ని బహిర్గత పరిచి, వేలాదిమంది బౌద్దబిక్షువులకు 'బౌద్దధర్మాల' ప్రాముఖ్యతను చిత్రకళ ద్వారా విశదీకరించేందుకు వీరు సన్నద్దమవుతున్నారు. సత్తెనపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారులు జింకా రామారావు ఈ దిశలో ముందుకుసాగుతున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో స్థిరపడిన ఆయన కాలచక్ర మహాసభలలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని బౌద్దారామాలు, బుద్దుని ధర్మాలు, అమరావతీ క్షేత్రం గురించి సవివరంగా తెలియజేసే 'పెయింటిగ్స్‌'ను ఆయన ప్రదర్శన కోసం సిద్దం చేస్తున్నారు. గతవారం రోజుల నుంచి ఆయన ఈ పనిలోనే మునిగిపోయారు.
అనంతలోకాల్లో కాంతిమయునిగా వెలుగొందే బుద్దదేవునికి కాలచక్ర మహోత్సవాల ఆహ్వానాన్ని అందించే కుసుమాన్ని (పువ్వు) నోట కరచుకొని బయలుదేరే శాంతికపోతాన్ని 'జింకా' తన కాలచక్ర పెయింటింగ్స్‌ ద్వారా విశదీకరించారు. అపారమైన జ్ఞానసంపత్తిని దీపం కాంతిలో తేజోమయం చేస్తున్న 'జ్ఞానబుద్దుని' చిత్రం, ప్రపంచశాంతిని కాంక్షిస్తూ యోగదీక్షలో ఉన్న ధ్యానబుద్దుడు, విశ్వంలోని శాంతి మేఘాలకు విఘాతం కలుగకుండా ప్రపంచశాంతిని కాంక్షిస్తున్న యోగబుద్దుడు, గాంధార శిల్పకళలో భాగంగా రూపుదిద్దుకొన్న గాంధార బుద్దుడు, విశ్వబుద్దుడు.. ఇలా ఎన్నో ఆయిల్‌, ఆక్రెలిక్‌ పెయింటింగ్‌లు జింకా కుంచె నుండి సిద్ధమయ్యాయి. వీటన్నింటినీ అమరావతి తరలించి, అక్కడి ప్రదర్శనలో ఉంచనున్నట్లు ఆయన వివరించారు.

బస్సులు లేక బౌద్ధుల ఇక్కట్లు
మాచర్ల రూరల్‌, జనవరి 4 (న్యూస్‌టుడే): మాచర్ల నుంచి వి.పి.సౌత్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక బౌద్ధ భిక్షువులు ఇబ్బందులు పడుతున్నారు. నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణానదిపై కొత్త వంతెన ప్రారంభించిన దరిమిలా దక్షిణ విజయపురికి బస్సులు నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ఇతర ప్రయాణికులకు కమాండర్‌ జీపులే శరణ్య అయ్యాయి. అమరావతిలో కాలచక్ర వేడుకలు, దలైలామా పర్యటన సందర్భంగా వేలాది మంది బౌద్ధులు కుటుంబ సభ్యులతో సాగర్‌ సందర్శించడం తెలిసిందే. అనుపు, వి.పి.సౌత్‌లకు మాచర్ల నుంచి ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో వారి ఇబ్బందులు వర్ణణాతీతం. గుంటూరు నుంచి ప్రత్యేక బస్సులలో, సుమోలలో వచ్చిన వారికి ఈ సమస్య లేదు. అయితే లైన్‌ బస్సుల్లో మాచర్ల చేరుకున్న టిబెటియన్లు మాత్రం ఇక్కడ నుంచి సాగర్‌కు బస్సులు లేక ఇబ్బందుల పాలయ్యారు. చాలామంది కాలి నడకన బస్టాండ్‌ నుండి రింగు రోడ్డు సెంటర్‌ వరకు 2 కి.మీ. ప్రయాణించి జీపుల కోసం, హైదరాబాద్‌ బస్సుల కోసం నిరీక్షించడం సాధారణ దృశ్యం అయ్యింది. కాలచక్ర వేడుకలు ముగిసే వరకైనా మాచర్ల నుంచి సాగర్‌కు షటిల్‌ బస్సులు నడపాలని వి.పి.సౌత్‌ అఖిలపక్ష కమిటీ నేతలు డిమాండ్‌ చేశారు.

*****

బౌద్ధ క్షేత్రాలపై ప్రత్యేక దృష్టి: గీతారెడ్డి

న్యూస్‌టుడే, అమరావతి
రాష్ట్రంలోని బౌద్ధ క్షేత్రాలపై ప్రత్యేక దృష్టి సారించి పర్యాటక స్థలాలుగా రూపొందిస్తామని పర్యాటక శాఖమంత్రి జె.గీతారెడ్డి అన్నారు. కాలచక్ర ఉత్సవాల సందర్భంగా బుధవారం అమరావతికి వచ్చిన ఆమె 'ఈనాడు-ఈటీవీ'తో ప్రత్యేకంగా మాట్లాడారు. 'లోయర్‌ కృష్ణా వ్యాలీ సర్క్యూట్‌' పేరుతో నాగార్జున కొండ, అమరావతి, ఉండవల్లి గుహలు పర్యాటక రంజకంగా తీర్చిదిద్దుతామన్నారు. నాగార్జునకొండ సమీపంలో 270 ఎకరాల విస్తీర్ణంలో 'బౌద్ధవనం' అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రూ. ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. అక్కడఅమరావతి బౌద్ధ స్థూపాన్ని పోలిఉండే స్థూపాన్ని పునర్నిర్మిస్తున్నామని వివరించారు. లైబ్రరీ, మ్యూజియంలను ఆధునికీకరిస్తామన్నారు. పర్యాటకులఅభిరుచుల మేరకు నయనానందకరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005 , Nagarjunasagar, Nagarjunakonda


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

Links to this post:

Create a Link

<< Home