ఆధునికత సంతరించుకోండి
'...ఆధునికతను సంతరించుకోండి. ప్రపంచమంతా ఆధునికత, అభివృద్ధివైపు పయనిస్తుంటే టిబెట్ ప్రజలు మాత్రం ఇంకా కష్టాల కొలిమిలోనే ఉన్నారు. దీన్ని అధిగమించాలి.' ఇదీ... కృష్ణాతరంగాల సాక్షిగా గురువారం అమరావతిలో సంప్రదాయ బద్ధంగా ప్రారంభమైన కాలచక్ర వేడుకల్లో టిబెటన్లకు దలైలామా ఇచ్చిన సందేశం. ఈ వేడుకలకు ఆశించిన స్థాయిలో సందర్శకులు రాకపోవడం చిన్న లోపం.
కాలంతో మారండి
కష్టపడి పనిచేయండి
టిబెటన్లకు దలైలామా సూచన
సంప్రదాయబద్ధంగా కాలచక్ర ప్రారంభం
తొలిరోజు భూమిపూజ
ఏకాదశ ఉపదేశ క్రతువుకు నాంది
ఆశించినంతగా రాని జనం
అమరావతి నుంచి న్యూస్‌టుడే ప్రత్యేక ప్రతినిధి
కారుణ్యశోధన.. కరుణామృత బోధన.. కఠినసాధన మంత్రాలుగా భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలపై వెలుగులు ప్రసరింపచేసే విశ్వశక్తిని ఆవాహనచేస్తూ కాలచక్ర ఉత్సవం బౌద్ధుల కోలాహలం మధ్య గురువారం సంప్రదాయబద్ధంగా కృష్ణా తీరంలోని అమరావతిలో ప్రారంభమైంది. మంచుమబ్బులు వీడకముందే పుణ్యస్నానాలు ఆచరించిన వేలమంది బౌద్ధభిక్షువులు విశాలమైన పందిళ్లల్లోకి చేరుకొన్నారు. ఒకవైపు ధ్యానబుద్ధ మహానిర్మాణం, మరొకవైపు అమరేశ్వరాలయం, ముచ్చటగా మూడోవైపు కృష్ణా తరంగాలు సాక్షీభూతంగా నిలుస్తుండగా బౌద్ధమత పరమాచార్యుడు దలైలామా స్వయంగా భూమిపూజ చేసి నీరాజనాలర్పించారు. ప్రత్యేక క్రతువులు నిర్వహించారు. ఆయన శిష్యులు వేదిక దిగువన కాలచక్రకు సంబంధించి ఉత్పన్న ప్రక్రియలు నిర్వర్తించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పన్నెండ్రోజుల పాటు వేడుకగా సాగే కాలచక్ర శాంతి కార్యం పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ ముందుగా ప్రార్థనలు చేశారు. కాలచక్ర సాధనకు బుద్ధుడు ఉపదేశించిన 12 వేల సూక్తుల సారాన్ని క్లుప్తీకరించి 'ఏకాదశ ఉపదేశ క్రతువు'కు దలైలామా నాందీప్రస్తావన చేశారు. మంచి ఆలోచన, సంతోషదాయకమైన జీవితం సాధించేందుకు అవసరమైన శక్తిని కాలచక్ర కల్పిస్తుందని తెలిపారు.
ఇదీ కాలచక్ర క్రమం... గురువారం భూమిపూజతో ప్రారంభమైన కాలచక్ర ఉపాసనలో రెండో రోజు నాంగ్యల్ ఆశ్రమవాసుల ఉత్సవ నృత్యం నిర్వహిస్తారు. మూడోరోజు భౌతిక ఆకర్షణల్లో భాగంగా ఇసుకతో కాలచక్ర మండల నిర్మాణాన్ని మొదలుపెడతారు. నాల్గవరోజు నుంచి ఆరో రోజూ వరకూ ప్రతినిత్యం ప్రవచనాలు ఉంటాయి. ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించిన మాధ్యమిక సిద్ధాంతంపై ప్రాథమిక బోధనలు ఉంటాయి. ఏడో రోజున అర్పణ నృత్యం, ఎనిమిదో రోజున నూతనంగా తరలివచ్చిన వారికి ప్రాథమిక ఉపదేశాలు, తొమ్మిది నుంచి 11వ రోజు వరకూ కాలచక్ర మహోపదేశాలతో శిష్యులను దీక్షాబద్ధం చేస్తారు. ఎనిమిది రోజులుగా పూజలందుకొన్న మండలాన్ని అందరూ సందర్శించుకొనే అవకాశాన్ని కల్పిస్తారు. ఆ తర్వాత మండల నిర్మూలం, ఇందుకు వినియోగించిన పదార్థాలను జల నిమజ్జనం చేయడంతో క్రతువుకు స్వస్తి పలుకుతారు.
ఆధునికత సంతరించుకోండి... 'కష్టాలను ఎదుర్కోండి.. శక్తియుక్తులకు పనిపెట్టండి.. ఆధునికతను సంతరించుకోండ'ని టిబెట్ పౌరులకు దలైలామా పిలుపునిచ్చారు. బౌద్ధభిక్షువులు, టిబెటన్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
అంచనాలు తారుమారు... కాలచక్రకు లక్ష మంది బౌద్ధభిక్షువులు, యాభైవేల మంది సందర్శకులు వస్తారని ప్రభుత్వం, కాలచక్ర నిర్వాహక కమిటీలు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. గురువారం అమరావతిలో అలాంటి వాతావరణమే కనిపించలేదు. మొత్తమ్మీద 25 నుంచి 30 వేల మంది మాత్రమే హాజరయ్యారు. కాలచక్ర వేడుక కమిటీ మాత్రం తొలిరోజు 32వేల మంది వచ్చారని తెలిపింది. వచ్చే మూడ్రోజుల్లో మరో 30-50వేల మంది హాజరయ్యే అవకాశముందని తెలిపింది. కాలచక్ర ఉత్సవాలకు హాజరయ్యే వారికోసం తాత్కాలికంగా నిర్మించిన టెంట్లలో సగం కూడా నిండలేదు. ఈ వేడుకలకు వచ్చే బౌద్ధులు, సందర్శకుల సంఖ్యను అతిగా ఊహించుకున్నామని ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి ఒకరు అంగీకరించారు.

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005 , Nagarjunasagar, Nagarjunakonda
0 Comments:
Post a Comment
<< Home