"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Thursday, January 05, 2006

Telugu American pop singer at the Grammy's

హాలీవుడ్‌ సంగీత ప్రపంచంలో ప్రవాసాంధ్రుడు రెగ్గీ బెంజమిన్‌ వరస సంచలనాలు సృష్టిస్తున్నాడు. తాజాగా వచ్చేనెల్లో గ్రామీ అవార్డుల వేదికపై తన సంగీతాన్ని వినిపించే అవకాశం దక్కించుకున్నాడు. అమెరికాలో తన ఆల్బమ్‌లతో అన్ని వయసుల వారినీ ఉర్రూతలూగిస్తున్న బెంజమిన్‌... భారతీయ అమెరికన్‌ కావటం... అందులోనూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడు కావటం విశేషం. ఆయన మాత్రం ''నేను భారతీయుడినైనందుకు ఆనందంగా ఉంది'' అంటూనే తన వరస విజయాలు కాకతాళీయమని వినయంగా చెబుతున్నారు.

ఎవరీ బెంజమిన్‌...?
బెంజమిన్‌ తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్‌. తండ్రి చర్చి పాస్టరు. వారు అమెరికాకు వెళ్ళి స్థిరపడ్డారు. బెంజమిన్‌ అక్కడే కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదివాడు. బెంజమిన్‌ తండ్రికి నాటి పాప్‌ రారాజు ఎల్విస్‌ ప్రిస్లీ అంటే విపరీతమైన ఇష్టం. అందుకని చర్చిలో ఆయన ప్రిస్లీ ప్రార్థన గీతాల్ని ఆలపిస్తుంటాడు. దీంతో సహజంగానే బెంజమిన్‌కూ అవంటే ఇష్టం ఏర్పడింది. అది ఆయన్ను సంగీతంవైపు మళ్ళించింది. బెంజమిన్‌ చిన్నప్పుడు తన బంధుమిత్రుల కోసం కూడా ప్రదర్శనలిచ్చేవాడు. ''ఒకసారి వాషింగ్టన్‌ వెళ్ళా. మా బంధువులంతా ప్రదర్శన ఇమ్మన్నారు. మనిషికి ఒక డాలర్‌ చొప్పున వసూలు చేశా'' అని వివరించాడు.

ఫోటో లేకుంటేనే అవకాశాలు...
నిజానికి బెంజమిన్‌కు ఈ విజయమేమీ తేలిగ్గా దక్కలేదు. ''సెప్టెంబరు 11 దాడులనంతరం ఎక్కడికెళ్ళినా భారతీయ అమెరికన్లకు నిరాశే ఎదురయ్యేది. మధ్యప్రాచ్యమా! చాలా కష్టం...! అనే సమాధానం వినిపించేది. నాదీ అదే పరిస్థితి. చివరకు నేనో ఎత్తు వేశా. నా పాటలతో పాటు నా ఫోటోలు పంపడం మానేశాను. పేరు, వివరాలు మాత్రం పంపేవాడిని. పేరు ద్వారా నా భారతీయ మూలాలు తెలిసే అవకాశం లేకపోవటంతో నాకు ఛాన్స్‌ దక్కిందనుకుంటా'' అని బెంజమిన్‌ వివరించాడు.

మరో ఎత్తుగడ...
తను పాపులర్‌ కావాలంటే ఏదో తన ఆల్బమ్‌కు ఏదో ప్రత్యేకతగానీ, వివాదంగానీ ఉండాలని బెంజమిన్‌ భావించాడు. దాంతో హ్యూ హఫ్నర్‌కు చెందిన విలాసవంతమైన 'ప్లేబాయ్‌' భవంతిలో షూటింగ్‌ చేయాలని తలచాడు. ఎందుకంటే ఆ భవంతిలో అడుగడుక్కీ అమ్మాయిలుంటారని... ఇంకా చాలా వదంతులే ఉన్నాయి. కానీ అనుమతిచ్చేదెవరు? రోజూ భవంతి సిబ్బందికి ఫోన్‌ చేసేవాడు. వాళ్ళు కుదరదనేవారు. ''పోనీ గేటు దగ్గరో, బయట రోడ్డుమీదో షూట్‌ చేసుకుంటా'' అని అడిగినా వద్దనేవారు. అలా 4 నెలలపాటు చేశాక... ఒకసారి ఫోన్‌ చేశాడు. 'అదిగో మళ్ళీ ఆ కుర్రాడే' అని సహాయకుడు హఫ్నర్‌కు చెప్పాడు. వెంటనే హఫ్నర్‌ ఫోనందుకుని... వచ్చి నా భవంతిలోనే షూటింగ్‌ చేసుకో!! అన్నాడు. బెంజమిన్‌ ఎగిరి గంతేశాడు. ఏకంగా ఐదుగురు భవంతిలోకి వచ్చి షూట్‌ చేయడానికి అనుమతి దొరికింది మరి. ''కానీ భవంతిలోకి వెళ్ళాక నా అంచనా తప్పయింది. లోపల అమ్మాయిలెవరూ లేరు. పెంగ్విన్లు, కోతులు, సువిశాల స్విమ్మింగ్‌ఫూల్‌... ఇలా చాలా అద్భుతాలున్నాయి'' అని బెంజమిన్‌ వివరించాడు. అందులో తీసిన 'హర్రీ అప్‌' ఆల్బం సూపర్‌హిట్టయింది. వెంటనే 'రైడ్‌' ఆల్బం చేసే అవకాశం దొరికింది. అది బెంజమిన్‌ను సూపర్‌ గాయకుల సరసన నిలబెట్టింది. తరవాత చేసిన 'చందమామ' ఆల్బమ్‌ అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళింది.

బిగ్‌-బీతో సంప్రతింపులు
బాలీవుడ్‌ గాయకుల్లో తనకు కిశోర్‌కుమార్‌ ఇష్టమని చెప్పే బెంజమిన్‌... ఈ తరానికి వస్తే మటుకు హరిహరన్‌ తన ఫేవరెట్‌ అని చెప్పాడు. తన పాటకు అమితాబ్‌ బచ్చన్‌ నర్తిస్తే బాగుంటుందని భావిస్తున్నానని, ఇందుకోసం సంప్రతింపులు జరుపుతున్నానని తెలియజేశాడు. ఇన్ని చేసిన బెంజమిన్‌ను నీ కెరీర్‌కు ఇంట్లో వాళ్ళ మద్దతు ఎంతవరకూ ఉంది? అని అడిగితే... ''మొదట్లో వాళ్ళు వద్దన్నారు. అందరు భారతీయ అమెరికన్లలానే నన్నూ ఇంజినీర్‌ని చేయాలనుకున్నారు. కానీ టీవీలో స్టీవ్‌ వండర్‌ వంటివారితో నేను కనిపించేసరికి ఏమీ అనలేకపోయారు. ఇపుడు డబ్బులొస్తుండటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది'' అని వివరించాడు.

Courtesy: ఈనాడు
*****

Pop singer Reggie Benjamin, the first Indian American to win a Hollywood deal, is all set to perform at the Grammy awards next month.

Benjamin, who has also filmed a music video in Hugh Heffner's fabulous Playboy Mansion, said his success was a lucky coincidence, coming as it did with an increasing American interest in Bollywood.

"Suddenly, it is cool to be Indian," Benjamin, who hails from Andhra Pradesh, told the agency.

To become a Hollywood pop singer was an unusual career choice for Benjamin who was studying to be a chemical engineer. His persistence paid off when he was signed on by music industry mogul Kerry Gordy.

But the path to success has been long and arduous. In the initial years, no one wanted to even listen to him, said Benjamin.

"After September 11, Hollywood stereotyped Indian Americans in the category 'Middle Eastern'. It was very hard," said the singer who has knocked on Hollywood doors since 1998.

"Earlier they did not even give a chance. Finally, I tried to trick them - I stopped sending my pictures along with my portfolios. It worked because my name does not give a clue to my Indian ancestry," he said.

Benjamin, the son of immigrants from Andhra Pradesh, studied music, business and chemical engineering. But his talent for show business set him on a trajectory to become a pop star.

Benjamin's choice of vocation could not have been more unconventional. His father was a Christian pastor who was especially fond of Elvis Presley's gospel songs, to which Benjamin attributes his interest in music.

"My parents always listened to Elvis' gospel music and watched his movies," recalled Benjamin. He began doing Elvis impersonations when he was eight. "I was performing live for relatives and friends for money."

On a visit to Washington, he got all his cousins together and charged them a dollar admission fee. It was his first paid performance.

Benjamin quickly graduated to performing at music concerts and at major Hollywood events. Now, he is all set to perform at the Grammy awards red carpet event Feb 8.

Over the years, Benjamin has won several distinctions in pop music. He was the first Indian to make it to the Billboard charts and has had 10 hits in a row in more than 25 countries.

But perhaps Benjamin's most spectacular coup was the shooting of his video "Hurry Up" at Hugh Heffner's Playboy Mansion. Benjamin was looking for something controversial for his new video and thought shooting at the Mansion would be sensational enough.

"I rang up Heffner's office every day for four months to seek permission to shoot. When they denied me permission to shoot inside the Mansion, I asked if I could shoot outside the gates or on the driveway. The answer was a firm no.

"Finally, one day when I called, I heard Heffner's assistant telling him, 'It is that kid again' and Heffner's reply in the background, 'Let the kid shoot his video inside the mansion.' Unexpectedly, he also allowed me to use five Playmates in the video."

On the shoot, Benjamin said: "It was quite an experience. Playboy Mansion is beautiful. One has this preconception of a house filled with girls. But when I went there for the first time there were no girls but monkeys, flamingos and parrots in the backyard, and a huge swimming pool."

Benjamin subsequently took his parents to meet Heffner.

"He was very nice," said Benjamin. "Although on the trip home, my mother kept asking me 'What exactly is Playboy'?"

The success of "Hurry up" paved the way for his second single, "Ride", which was quickly ranked number four in the Billboard Breakout Dance Charts.

Another of his albums, "Chandamama", turned out to be hugely popular with the younger generation. "It is an album anyone from eight to eighty can relate to," he said.

In Bollywood, Benjamin likes the late playback singer Kishore Kumar.

"But Hariharan is my favourite," he said.

He said he was negotiating with Bollywood superstar Amitabh Bachchan to feature the actor in one of his music videos.

How did his parents react to his choice of career?

"Initially, they were sceptical and very worried. Like all Indian American parents, they wanted me to become a doctor, engineer or a lawyer. But they saw me on television with the likes of Steve Wonder - that is a sure sign that you have made it. And then money started coming in. That makes all the difference."

Courtesy: Hindustan Times


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home