Classical status demand: AP High Court's directive to Center
కేంద్రానికి హైకోర్టు ఆదేశం... 6 వారాల గడువు
హైదరాబాద్ - న్యూస్‌టుడే
కోర్టు ధిక్కారం గురించి తెలుసా: ఆంధ్రజ్యోతి సంపాదకుడు రామచంద్రమూర్తిపై కోర్టు ధిక్కార చర్య కోసం సేవా సమితి దాఖలు చేసిన మరో పిటిషన్‌పై హైకోర్టు మండిపడింది. అసలు ధిక్కార పిటిషన్ ఎలా దాఖలు చేయాలో తెలుసా అంటూ సమితి తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఎవరు కోర్టు ధిక్కారానికి పాల్పడినదీ.. ఎలా పాల్పడినదీ వివరాల్లేకుండా కోర్టు వ్యవహారాలను దుర్వినియోగం చేస్తున్నారని తప్పుబట్టింది. తెలుగుకు ప్రాచీన హోదా కోసం రామచంద్రమూర్తి వ్యక్తిగతంగా పిటిషన్ వేసి.. దానిని ఆంధ్రజ్యోతి వేసినదిగా వార్తలు రాయడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సమితి ఆ పిటిషన్ వేసింది. అయితే రామచంద్రమూర్తి కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సమితి తగిన ఆధారాలు చూపలేకపోయిందని హైకోర్టు స్పష్టంచేసింది.
*****
'తెలుగు భాషకు ప్రాచీన హోదాపై చర్యలేమిటో చెప్పండి'
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆన్‌లైన్): తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడంపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ వర్తమాన స్థితిపై నివేదిక (స్టేటస్ రిపోర్ట్) దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా వార్తాకథనాన్ని ప్రచురించినందుకు 'ఆంధ్రజ్యోతి'పై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలంటూ తె లంగాణ సేవాసమితి తరఫున బి.రామ్మోహనరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. 'ఆంధ్రజ్యోతి' ప్రచురించిన కథనం కోర్టు ధి క్కారం కిందకు వస్తుందని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని ధ ర్మాసనం పేర్కొంది.
కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేశారంటూ రామ్మోహనరెడ్డిని మందలించింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని కోరు తూ 'ఆంధ్రజ్యోతి' సంపాదకులు కె.రామచంద్రమూర్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గణపత్‌సింగ్ సింఘ్వీ, న్యాయమూర్తి జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరామగిరి రామచంద్రరావు వాదించగా, కేంద్ర ప్రభుత్వం తరఫున ఎ.రాజశేఖరరెడ్డి హాజరయ్యారు. తెలుగు భాష ప్రాచీనతపై వ్యాజ్యం దాఖలు చేసి రెండునెలల పది రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని రామచంద్రరావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 2005 అక్టోబర్‌లో ప్రాచీన భాష హోదా పొందేందుకు వెయ్యి సంవత్సరాల అర్హత అవసరమని చెప్పిన కేంద్రం తర్వాత దాన్ని రెండువేల సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని వాకబు చే యగా, కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పారు. దీనిపై ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన రామ్మోహనరెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ 'ఆంధ్రజ్యోతి' ఎడిటర్‌గా పనిచేస్తున్నారని, అయితే ఈ వ్యాజ్యాన్ని ఎడిటర్ హోదాలో దాఖలు చేయలేదని చెప్పారు. దీనికి స్పందిస్తూ ధర్మాసనం.. తెలుగు భాష తియ్యనైనదా? కాదా? అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించగా, అన్ని భాషలూ తియ్యనైనవే అని ఆయన బదులిచ్చారు. ఇంతలో రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ, రామ్మోహనరెడ్డి ఇంతకూ తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడానికి అనుకూలమో, వ్యతిరేకమో తెలియజేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడంపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, కేసును జూన్ 26వ తేదీకి వాయిదా వేసింది.
Courtesy: ఆంధ్ర జ్యోతిTelugu Andhra Pradesh Hyderabad classical ancient language status demand ap high court centre tcld2006
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home