దూరవిద్యగా ప్రారంభించనున్న తెలుగువర్సిటీ
హైదరాబాద్, న్యూస్‌టుడే: ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు తెలుగు వర్సిటీలో దూరవిద్య విధానంలో ఎంసీజే కోర్సును ఈ ఏడాది నుంచి ప్రవేశబెట్టబోతున్నారు. దీనికి సంబంధించి త్వరల నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ఏడేళ్ల క్రితం అప్పటి విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఎన్.గోపి ఈ కోర్సును త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన మొత్తం పదవీకాలంలో ఇది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత వచ్చిన జి.వి.సుబ్రహ్మణ్యం కూడా ప్రకటనలకే పరిమితం అయ్యారు. ఆవుల మంజులత వైస్‌ఛాన్సలర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం యువతరం ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కోర్సుల రూపకల్పనకు తొలిప్రాథాన్యం ఇస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ కోర్సు విషయంలో నిపుణులతో చర్చించి ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన ఈ నెలాఖరులో విడుదల చేయనున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ 'న్యూస్‌టుడే'తో చెప్పారు. ఈ కోర్సు తెలుగు మాధ్యమంలో ఉంటుందని ఆయన చెప్పారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులని తెలిపారు.
Courtesy: ఈనాడు
distance learning Telugu University Hyderabad
1 Comments:
tods shoes
giants jersey
christian louboutin uk
green bay packers jerseys
oakley sunglasses
true religion jeans
mbt shoes
san diego chargers jerseys
michael kors outlet
nike air huarache
Post a Comment
<< Home