Interview with Telugu American pop singer Reggie Benjamin
అమితాబ్‌తోనూ పలికిస్తా
నా సంగీతంలో ఉన్నది భారతీయతే
'ఆంధ్రా పాప్ గాయకుడు' రెగ్గీ ఇంటర్వ్యూ
హైదరాబాద్ - న్యూస్‌టుడే

ప్రశ్న:హలో... మీకు తెలుగు వస్తుందా? కనీసం అర్థమైనా చేసుకోగలరా?
జవాబు: తెలుగా! వస్తుంది. మాట్లాడతాను. అయితే... ధారాళంగా కాదు. ముక్కలు ముక్కలుగా. నా తెలుగు కొంచెం అమెరికా యాసలో ఉంటుంది. మీరు మాట్లాడితే మాత్రం ప్రతి పదం అర్థమవుతుంది.
ప్రశ్న:మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
జవాబు:అమ్మా, నాన్న, నేను, మా అక్క, మా అన్న.. ఇదీ మా కుటుంబం. మా ఇంట్లో పూర్తిగా భారతీయత కనిపిస్తుంది. రోజూ ఇండియన్ ఫుడ్ తీసుకుంటాం. అన్ని రకాల భారతీయ చిత్రాలు చూస్తాం. నేను డాక్టర్ కావాలని అమ్మా నాన్నల ఆకాంక్ష. ఇప్పుడు గాయకుడినైనా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.
ప్రశ్న:మీకు స్ఫూర్తి ఎవరు?
జవాబు: అందరికంటే ముందు దేవుడు. సంగీతంలో నాకు స్ఫూర్తి ఎల్విస్ ప్రెస్లీ, అమితాబ్ బచ్చన్. వాళ్లిద్దరిలా ఉండాలని ఎప్పుడూ అనుకుంటుంటా.
ప్రశ్న: మీ సంగీతంపై భారతీయ ప్రభావం ఉందా?
జవాబు: నా సంగీతంలో ఉన్నదే భారతీయత. అందులో అమెరికా కనిపించదు. నా పాటల్లో తబలా, సితార్ కనిపిస్తాయి. సరిగమలు వినిపిస్తాయి. తెలుగు, హిందీ పదాలూ వినొచ్చు. నేను పాడేది పాప్ మ్యూజిక్కైనా... అందులో అంతర్లీనంగా ఉండేది 'సౌండ్స్ ఆఫ్ ఇండియా'
ప్రశ్న: మీ అభిమాన గాయకులు, నటులు ఎవరు?
జవాబు: గాయకులు హరిహరన్, ఎస్.పి.బాల సుబ్రమణ్యం, కిశోర్ కుమార్, జార్జి మైఖేల్, ప్రిన్స్, ఎల్విస్ ప్రెస్లీ. నటులు... అమితాబ్, జిమ్ క్యారీ.
ప్రశ్న: అమితాబ్‌తో ఆల్బమ్ తీస్తారట కదా! ఆ విశేషాలేమిటి?
జవాబు:చర్చలు జరుగుతున్నాయి. ఆ ఆల్బమ్‌లో నేను ఇంగ్లిష్‌లో పాడతా. అమితాబ్‌తో హిందీలో పాడిస్తా. మరో విషయం... ఆయన చేత కొన్ని తెలుగు మాటలూ కూడా పలికిస్తా.
ప్రశ్న:ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చారా?
జవాబు: చాలా ఏళ్లక్రితం వచ్చాను. రెండేళ్ల క్రితం ముంబాయి, ఢిల్లీ వచ్చినా... హైదరాబాద్ రాలేకపోయాను. అవకాశం లభిస్తే... హైదరాబాద్‌లో నా ప్రదర్శన ఇస్తా. సొంత ఇంటిని ఎలా మరిచిపోగలను!
ప్రశ్న:గ్రామీ వేదిక మీద పాడుతున్నారుగా! ఎలా ఫీల్ అవుతున్నారు?
జవాబు: చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఆ ఘనత దక్కిన తొలి భారతీయుడిని నేనే. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్విస్తున్నా. నా దేశం గర్వపడేలా విజయాలు సాధిస్తా.
1 Comments:
nike outlet
louis vuitton sacs
polo ralph lauren
skechers shoes
michael kors handbags
mont blanc outlet
nike huarache
polo ralph lauren
chicago bulls jersey
coach outlet store
Post a Comment
<< Home