Birla Institute of Technology (BITS) in Hyderabad
మార్చిలో నిర్మాణం ప్రారంభం
2007-08 నుంచి కోర్సులు
హైదరాబాద్ - న్యూస్‌టుడే బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) హైదరాబాద్‌లో విద్యాసంస్థను ఏర్పాటు చేయనుంది. బిర్లా కుటుంబసభ్యుడు, విద్యాసంస్థల బాధ్యతల్ని చూస్తున్న కె.కె.బిర్లాతో బిట్స్ పిలానీ వైస్ ఛాన్సలర్ వెంకటేశ్వరన్, ఇతర అధికారులు సోమవారం సమావేశమై చర్చించి హైదరాబాద్‌లో తమ క్యాంపస్ ఏర్పాటు చేయాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలకు వర్తమానం అందింది. బుధ, గురువారాల్లో అధికారికంగా లేఖ అందే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలంలోని జవహర్‌నగర్‌లో బిట్స్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. తొలుత హైదరాబాద్‌లో తమ విద్యాసంస్థను ఏర్పాటు చేసేందుకు అవకాశమే లేదన్న బిర్లా ప్రతినిధులు, సీఎం రాజశేఖరరెడ్డి స్వయంగా లేఖలు రాయడంతో తమ వైఖరిని మార్చుకున్నారు. ఈ నెల 4న బిట్స్ పిలానీ వీసీతోపాటు డిప్యూటీ డైరెక్టర్ సాంబశివరావు, ఇంజినీరింగ్ సర్వీసు డీన్ రామన్ తదితరులు హైదరాబాద్‌కు వచ్చి స్థలాల్ని పరిశీలించారు. జవహర్‌నగర్‌లో సంస్థను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ఈ ఏడాది మార్చిలో నిర్మాణ పనులు మొదలుపెట్టి 2007-08 విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభించాలని భావిస్తున్నారు. సుమారు రూ.200 కోట్లతో భవన సముదాయం, లాబొరేటరీలు, గ్రంథాలయం, సిబ్బంది నివాసగృహాలు ఏర్పాటు చేయనున్నారు. బిట్స్‌లో గతంలో చదువుకుని వివిధ హోదాల్లో దేశవ్యాప్తంగా ఉంటున్న పలువురు ఆంధ్రులు తాము వివిధ పనుల కోసం ఆర్థికంగా చేయూతనిస్తామని ముందుకు వచ్చారు. ఇలా అందే మొత్తాల్ని పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇచ్చేందుకు కేటాయిస్తే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.2007-08 నుంచి కోర్సులు
Courtesy: ఈనాడు
0 Comments:
Post a Comment
<< Home