"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Wednesday, January 18, 2006

Buddhists spend time at Suryalanka beach, Bapatla


సూర్యలంకలో బౌద్ధుల సందడి

బాపట్ల, బాపట్ల రూరల్‌, జనవరి 17 (న్యూస్‌టుడే): అమరావతిలో కాలచక్రం ముగిసింది. కానీ బాపట్లలో ఉన్న సూర్యలంక సముద్ర తీరం బౌద్ద బిక్షువులతో కళకళలాడింది. పన్నెండు రోజులపాటు సాగిన ప్రత్యేక పూజలు, ప్రసంగాలలో పాలుపంచుకున్న బౌద్ద బిక్షువులు, టిబెటియన్‌లు మంగళవారం బాపట్లకు చేరుకున్నారు. వీరి రాకతో తీరం కొత్తశోభను సంతరించుకుంది. ఎగిసిపడే అలలు, చల్లని పిల్లగాలుల్లో, బిక్షువుల సంప్రదాయ దుస్తులను విడనాడి సాగరతీరంలో సేదతీరారు. ప్రత్యేక వాహనాలలో గ్రూపులుగా రావడంతో తీరంలో కొత్త ఉత్సాహం పొంగిపొర్లింది. వీరి రాకను స్వాగతిస్తూ స్థానికులు తమ సాంప్రదాయాల వంటకాలను వారికి అందించడం... వాటిని ఆనందిస్తూ తినటం కొసమెరుపు. ఇవి నా జీవితంలో మరచిపోలేని సంఘటనలు. ఓ వైపు దలైలామాను ప్రప్రథమంగా చూసి ఉపన్యాసం వినటం, సూర్యలంక తీరాన్ని చూడటం అని టిబెట్‌కు చెందిన బౌద్దబిక్షువు టిలిలీ అన్నారు. తీరం అందంగా ఉంది. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉందన్నారు. భారతదేశంలో అనేక ప్రాంతాలు తిరిగాను. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. వారి ముఖలు ఎప్పుడు చిరునవ్వుతో స్వాగతమిస్తాయని కంప్యూటర్‌ కోర్సు చదువుతున్న టిబెట్‌ యువకుడు థోన్‌డప్‌ అన్నారు. సముద్రాన్ని చూడటం ఇదే మొదటిసారి. గతంలో సునామీ గురించి టివిలలో చూశాను. ఇప్పుడు సముద్రాన్ని కళ్ళారా చూస్తున్నాను. దీనిని చూస్తుంటే నాకు ఓపక్క భయం మరో పక్క ఆనందం వేస్తోందని సోలో అన్నారు.

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu January 2006 , Nagarjunasagar, Nagarjunakonda , Bodh Gaya


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home