శాంతా కుమారి అస్తమయం
చెన్నయ్, జనవరి 17 (ఆన్‌లైన్): తెలుగు చిత్ర పరిశ్రమ ఆప్యాయంగా 'అమ్మ' అని పిలుచుకునే అలనాటి నటి శాంతకుమారి మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు చెన్నయ్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచా రు. కొంత కాలంగా ఆమె అస్వస్థతతో ఉన్నారు. 1920లో మే 17న పొద్దుటూరులో జన్మించిన శాంతకుమారికి మరణించే నాటికి 86 సంవత్సరాలు. ప్రఖ్యాత దర్శకుడు పి.పుల్లయ్య సతీమణి అయిన శాంతకుమారి 1936లో 'శశిరేఖా పరిణయం' సినిమాతో నట జీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటిం చారు. 'కృష్ణప్రేమ, మాయాలోకం, ధర్మదేవత, తల్లా?పెళ్లామా?, 'అర్ధాంగి, జయభేరి, రాముడు భీముడు, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, ప్రేమనగర్' తదితర చిత్రాల్లోని పాత్రల పోషణ ద్వారా మహానటిగా ఆమె పేరు తెచ్చుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు. 1999వ సంవత్సరానికి గాను ఆమె 'రఘుపతి వెంకయ్య అవార్డు'ను అందుకున్నారు. ఎన్‌టిఆర్ జయంతి సందర్భంగా సినీ కళాకారులకు ఇచ్చే 'కళా నీరాజన' పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు. పద్మశ్రీ పిక్చర్స్, రాగిణి పిక్చర్స్ పేరుతో సొంతంగా ఇరవైకి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్‌గా ప్రధా న పాత్రల్లో నటించిన సినిమాలనే మళ్లీ తీసినపుడు తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారి సొంతం. శాంతకుమారికి రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మనుమడు లండన్ నుంచి రాగానే బుధవారం సాయంత్రం ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగనున్నాయి.
Courtesy: ఆంధ్ర జ్యోతిKeywords: Shanta Santa Kumari Santakumari , Telugu , Andhra Pradesh , movie film tollywood , music playback singer , Andhra Jyothi January 2006
0 Comments:
Post a Comment
<< Home