"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Monday, January 16, 2006

పుస్తకాల కోవెల

'అక్షరాల వత్తి ఆరిపోతే విశ్వమంతా గాఢాంధకారమవుతుంది. అదే అసలైన ప్రళయం' అంటారు సి.పి.బ్రౌన్‌. అనడమే కాదు, అలాంటి ప్రళయం నుంచి తనకు చేతనైనంతగా తెలుగుభాషను రక్షించి మనకు మహోపకారం చేశారు. ఆయన పరిశోధనలు సాగించిన బంగళా శిథిలాల మీదే కడపలో ఓ గ్రంథాలయం వెలసింది. మొండిగోడల నుంచి మొదలై తెలుగు ప్రాంతీయ భాషా పరిశోధన సాహిత్యకేంద్రంగా ఎదిగిన ఈ గ్రంథాలయం... పరిశోధకులకు పెద్దదిక్కుగా మారింది.

నార్జనే ధ్యేయంగా భారతదేశాన్ని ఆక్రమించిన ఈస్టిండియా కంపెనీ తరఫున ఓ ఉద్యోగిగా ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ కడపలో అడుగు పెట్టారు. ఆయన ఆంగ్లేయుడే అయినా పుట్టింది ఇండియాలోనే. 1820 ప్రాంతంలో కడప జిల్లా కలెక్టరుకు సహాయకుడిగా చేరేప్పటికి అవివాహితుడు. అప్పటికే తెలుగు భాషలోని మాధుర్యం ఆయన మనసును అల్లుకుపోయింది. తెలుగుభాషపై పరిశోధన సాగించాలన్న ఆసక్తితో మూడు వేల వరహాలు వెచ్చించి కడపలోనే 15 ఎకరాల తోటలోని బంగళాను కొన్నారు బ్రౌన్‌. సాహితీయజ్ఞం నిర్వహించిన స్థలంలోనే ఆయన స్మృతిచిహ్నంగా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. దానికో భవనం నిర్మించాలనీ పుస్తకాల సంఖ్య పెంచాలనీ వాటికి రక్షణ కల్పించాలనీ స్థానిక సాహితీవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేసి, చివరికి 1975 నాటికి విరాళం రూపంలో స్థలాన్ని సేకరించగలిగారు. పదేళ్ల తరవాత సి.కె.సంపత్‌కుమార్‌ అధ్యక్షుడిగా, జిల్లా కలెక్టరు ప్రధానపోషకుడిగా, సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్త్రి కార్యదర్శిగా 'సి.పి.బ్రౌన్‌ మెవోరియల్‌ ట్రస్టు' ఏర్పాటయింది.

కలెక్టరుగా వచ్చిన జంధ్యాల హరినారాయణ తెలుగు గ్రామీణ క్రాంతి పథకం నిధుల నుంచి రూ.3.50 లక్షలు విడుదల చేశారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు జి.కృష్ణమూర్తి రూ.43 వేలు కేటాయించారు. దీంతో భవననిర్మాణ పనులు వెుదలయ్యాయి. ఆ తరవాత వచ్చిన కలెక్టరు ఎ.కె.పరీడా కూడా ఆర్థికంగా ఊతమందించారు. పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థీ ఒక్కో రూపాయి చొప్పున రూ.25 వేల విరాళం అందించారు.
అప్పటినుంచి జిల్లాకు వచ్చిన ప్రతి కలెక్టరూ ఇతోధికంగా సాయపడుతూనే ఉన్నారు. భవనం 1992 నాటికే సిద్ధమై పాఠకులకు అందుబాటులోకి వచ్చినా, 1995 నవంబరు 29న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య గ్రంథాలయాన్ని ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో సినారె పది లక్షల రూపాయలు కేటాయించారు. ఆ నిధులతో రెండేళ్ల క్రితం విశాలమైన గది నిర్మించి, 'డాక్టర్‌ సి.నారాయణరెడ్డి పరిశోధన కేంద్రాన్ని' ప్రారంభించారు.
ఈ గ్రంథాలయానికి వెుదటినుంచి వెన్నెముకగా నిలిచిన వ్యక్తి డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి. ఆంగ్ల బోధకుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఈయన గ్రంథాలయాభివృద్ధి కోసం ముప్ఫై ఏళ్ల క్రితమే కంకణం కట్టుకున్నారు. దాన్నో తపస్సుగా భావించారు. ఎంతోమంది సహకారంతో గ్రంథాలయానికో భవనమూ పాలకవర్గమూ సిబ్బందీ ఏర్పాటయ్యేలా చూశారు. దాదాపు 30 ఏళ్ల జీవితాన్ని గ్రంథాలయాభివృద్ధికే అంకితం చేసిన జానమద్దిని కడప ప్రజలు 'బ్రౌన్‌ శాస్త్రి' అని పిలుస్తారు.

27 వేల గ్రంథాల భాండాగారం


పరిశోధక విద్యార్థులకు అరుదైన పుస్తకాలు అవసరమైనప్పుడు వేటపాలెం తరవాత గుర్తొచ్చేది బ్రౌన్‌ గ్రంథాలయమే. ప్రస్తుతం ఈ విజ్ఞాన భాండాగారంలో 27 వేలకు పైగా గ్రంథాలున్నాయి. వీటిలో తెలుగు పుస్తకాలు సుమారు 17 వేలు. సుమారు పది వేల ఇంగ్లిషు-హిందీ పుస్తకాలున్నాయి. సంస్కృతం, కన్నడం, తమిళం, ఉర్దూ భాషలకు సంబంధించిన గ్రంథాలు కూడా లభ్యమవుతాయి.
దాదాపు 1200 అభినందన సంచికలు, ప్రత్యేక సంచికలు అందుబాటులో ఉన్నాయి. నిఘంటువులు, విజ్ఞానసర్వస్వ సంపుటాలు, ఆంధ్రసాహిత్య పరిషత్తు పత్రికా సంపుటాలు, 100 సంపుటాల గాంధీ రచనలు, 1928 నాటి నాలుగు సమదర్శిని సంపుటాలు, కొందరు సాహితీప్రముఖుల చేతిరాత ప్రతులు, బ్రౌన్‌ సాహిత్య సంబంధమైన 50 పుస్తకాలు, స్వామి వివేకానంద సాహిత్యం 300 సంపుటాలు, నవలలు, జీవిత చరిత్రలతోపాటు డిగ్రీ, ఇంటర్‌ విద్యార్థుల పాఠ్యపుస్తకాలు కూడా ఇక్కడ కొలువుతీరాయి. ఇదే సముదాయంలో 'సుమబాల' గ్రంథాలయం ప్రత్యేకంగా బాలబాలికలకు విజ్ఞానాన్ని అందిస్తోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతం నుంచి సాహిత్య పరిశోధకులు వచ్చి ఈ గ్రంథాలయ సేవలను వినియోగించుకుంటారని ట్రస్టు సభ్యులు చెబుతున్నారు.
సీఎం చొరవ
తెలుగు భాషాసాహిత్యాలకు విస్తృతంగా సేవలందిస్తోన్న సి.పి.బ్రౌన్‌ గ్రంథాలయాన్ని 2005 జనవరి 27న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సందర్శించారు. గ్రంథాలయం పనితీరును పరిశీలించిన సీఎం సంతోషం వ్యక్తం చేయడంతోనే సరిపెట్టకుండా రూ.15 లక్షల వార్షిక గ్రాంటును మంజూరు చేశారు. దీనికి 'సి.పి.బ్రౌన్‌ ప్రాంతీయ భాషాసాహిత్య పరిశోధన కేంద్రం'గా స్థాయిని కల్పించి, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయా(ఎస్వీయూ)నికి అనుబంధ సంస్థగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్వీయూ ఉపకులపతి జయరామిరెడ్డి ఈ గ్రంథాలయాన్ని తమ పరిధిలోకి తీసుకొంటున్నట్లు ప్రకటించారు. గ్రంథాలయ నిర్వహణ కోసం ఓ సలహాసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.
తాజాగా సమకూరిన నిధులు, సదుపాయాలతో గ్రంథాలయాన్ని మరింతగా పరిపుష్టం చేసినప్పుడే... బ్రౌన్‌కు నిజమైన నివాళి!

Courtesy: ఈనాడు
Keywords: Telugu literature , Andhra Pradesh , East India Company , Indian language , British , Englishman Englishmen , Madras province , Arthur C.P.Brown , library , books collection , bungalow , Eenadu January 2006 article


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home