కాలచక్రపై గ్రంథరచన
తెనాలి, జనవరి 1 (న్యూస్‌టుడే): అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతోన్న 'అమరావతి కాలచక్ర-2006'పై ఒక గ్రంథం వెలువడింది. తెనాలికి చెందిన సహజ కవి అయినాల మల్లేశ్వరరావు దీన్ని రచించారు. కాలచక్ర మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ గ్రంథాన్ని ఆవిష్కరిస్తారని మల్లేశ్వరరావు చెప్పారు. అందులోని ప్రధానంశాలను ఆయన వివరించారు. గౌతమ బుద్ధుని సంక్షిప్త చరిత్ర, బౌద్ధధర్మత్రికరణ, పంచశీల, ఆర్యసత్యాలు, అష్టాంగ మార్గాలు, బుద్ధుడి నివాస ప్రదేశాలు, కాల చక్ర తంత్రం కథ, ధర్మోపదేశం,టిబెటన్ల ఆచార వ్యవహారాలు, గత కాలచక్ర జరిగిన తేదీలు, జరిగిన స్థలాలు, వాటి అంశాలను అందులో పొందుపర్చారు. రాష్ట్రంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాల వివరాలు, వాటిని తెలియజేసే మ్యాప్‌లు, 30 ఫొటోలతో దీన్ని రూపొందించారు. కలెక్టర్ జి.జయలక్ష్మి తొలిపలుకులు రాసిన ఈ గ్రంథానికి గ్రంథాలయోధ్యమ ప్రముఖులు డాక్టర్ వెంకటప్పయ్య సంపాదకత్వం వహించారు.
దలైలామా రాక
న్యూస్‌టుడే, మాచర్లపోలీసుల అప్రమత్తం
బౌద్ధమత గురువు దలైలామా కాలచక్రలో భాగంగా ఈనెల 3న నాగార్జునసాగర్ రానుండటంతో గుంటూరు, నల్గొండ జిల్లాల పోలీసులు భద్రత విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న సాగర్‌కు చేరుకునే దలైలామా నాగార్జునకొండ లాంచి ద్వారా చేరుకుంటారు. సాగర్ పరివాహక ప్రాంతంలో నల్లమల అటవీ ప్రాంతం, ఎత్త్తెన కొండలు వ్యాపించాయి. దలైలామాను టార్గెట్ చేస్తూ చైనా దేశానికి చెందిన ఉగ్రవాదులు దాడిచేసే ప్రమాదం ఉందని ఇంటిలిజెన్స్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడం, వారి ఊహచిత్రాలను ప్రదర్శించడం జరిగింది. ఎలాగు మావోయిస్టుల ప్రభావం ఉండనే ఉంది. దలైలామాకు ఆహ్వానం పలకడానికి గుంటూరు, నల్గొండ జిల్లాల ఉంచి రాష్ట్ర మంత్రులు హాజరవ్వనున్నారు. దలైలామా నాగార్జునకొండపై గడిపినంత సేపు ఆ సమీప ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. శనివారం గుంటూరు జిల్లా ఎస్పీ సజ్జనార్ సాగర్ పరిసరాలు పరిశీలించారు. లాంచిలో ప్రయాణించే ప్రాంతంలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కృష్ణానది తీరం వెంట ఎత్త్తెన కొండలు, అడవిలో పోలీసు కూంబింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనుమానస్పద వ్యక్తులపై నిఘా వేశారు. లాంచి స్టేషన్ వద్ద పోలీసుల ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. బౌద్ధులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
*****
న్యూస్‌టుడే, మాచర్లఅక్కడ పరిసరాలు సైతం బుద్ధం శరణం గచ్చామి అంటున్నాయా అనే రీతిలో ప్రకృతి శోభ బౌద్ధులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన మనసుకు అక్కడకు చేరగానే మనసు నిండా భక్తి చేరుతుంది. వందల సంవత్సరాల నాటి బౌద్ధ కళాఖండాలు కళ్ళ ముందు సాత్కరించగానే ప్రయాణ బడలిక సమసిపోతుంది. ప్రస్తుతం కాలచక్ర ఏర్పాట్లలో భాగంగా నాగార్జున సాగర్ అంతర్భాగమైన నాగార్జునకొండకు కొత్త అందాలు ఏర్పడ్డాయి. పార్కులకు కొత్తరూపు ఇచ్చారు. ఎటు చూసినా పచ్చదనమే, వెళ్లిన పర్యాటకులను కదలకుండా కట్టి పడేస్తుంది. కొండ ప్రాంతంలో బండరాళ్ళ మధ్య ప్రకృతి శోభ వీక్షించడానికి రెండు కళ్ళు చాలవనడం అతిశయోక్తి కాదేమో. జనవరి 3న కాలచక్రలో భాగంగా బౌద్ధ గురువు దలైలామా కొండకు రానున్నారు. పురాతన కాలం నాటి బౌద్ధ సామగ్రి భద్రపరిచిన మ్యూజియం, పరిసరాలు చూడముచ్చటగా ఉన్నాయి. బంతి, గులాబి మొక్కల్ని దారి పొడవునా పెంచుతున్నారు. పరిసరాలలో చెత్తాచెదారం చేరకుండా శుభ్రం చేస్తున్నారు. తాగునీరు, వైద్య శిబిరాల ఏర్పాట్లకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి. లాంచీల ద్వారా బౌద్ధుల రాక రోజురోజుకు పెరుగుతోంది.
ఇదే ధ్యానబుద్ధ విగ్రహం. అంచనా వ్యయం రూ.80 లక్షలు. డిసెంబరు 24లోపు దీన్ని పూర్తిచేయాలనుకున్నారు. 5న ప్రారంభమయ్యే కాలచక్ర ఉత్సవాలు పదకొండు రోజులే జరుగుతాయి. కానీ ఈ విగ్రహ నిర్మాణం మరో మూణ్నెల్లకు కానీ పూర్తయ్యే పరిస్థితి లేదు.
Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005 , Nagarjunasagar, Nagarjunakonda
0 Comments:
Post a Comment
<< Home