కాలచక్ర ఉత్సవాల్లో లేపాక్షి ప్రదర్శన
పాతగుంటూరు, డిసెంబరు 8(న్యూస్‌టుడే): అమరావతిలో జనవరి 5 నుంచి జరగనున్న కాలచక్ర ఉత్సవాల్లో లేపాక్షి హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర చేనేత, హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జయరాజ్ తెలిపారు. గురువారం గుంటూరు వచ్చిన ఆయన కలెక్టర్ జయలక్ష్మిని కలిసి సంస్థ చేపట్టే కార్యక్రమాలను వివరించారు. ఇరవై రకాల కళారూపాలను ప్రదర్శనలో ఉంచనున్నట్లు, అందుకు 15 స్టాళ్లను కేటాయించినట్లు తెలిపారు. ఎక్కువగా బౌద్ధమతానికి చెందిన కళారూపాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. కళాకారులు తయారుచేసిన వస్తువులను ప్రదర్శనతో పాటు విక్రయించుకునే సదుపాయం ఉందన్నారు. అలాగే అమరావతి మ్యూజియంలో లేపాక్షి కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రేమండ్ పీటర్‌తో సంప్రదిస్తున్నట్లు జయరాజ్ తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ కాలచక్ర కార్యక్రమానికి భిక్షువులతోపాటు వివిధ ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో యాత్రికులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల లేపాక్షి హస్తకళలు విశేష ప్రాచుర్యాన్ని పొందే అవకాశముందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ డి.ఎస్.ఆర్.ప్రసాద్, గుంటూరు లేపాక్షి కేంద్రం మేనేజర్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.
Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , Kalachakra 2006 , Amaravati , Buddha Buddhism , Lepakshi handicrafts , Dalai Lama , Eenadu , December 2005 , India
0 Comments:
Post a Comment
<< Home