"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Tuesday, December 06, 2005

చరిత్రను సమాధి చేస్తారా?


తెనాలి, డిసెంబరు 6 (న్యూస్‌టుడే): బుద్ద ధాతువులను నిక్షిప్తం చేసిన చారిత్రక భట్టిప్రోలు గ్రామం అధికారుల కంటబడలేదు. కాలచక్ర కోసం యుద్ధప్రాతిపదికన కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్న పాలకులు క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నుంచి చరిత్రపుటల్లో స్థానం సంపాదించిన ఈ ప్రాంతాన్ని విస్మరించడం గర్హనీయం. భట్టిప్రోలు గ్రామంలోని పురాతనం బౌద్దస్థూపం శిథిలావస్థకు చేరుకుంటోంది. అయితే పురావస్తు శాఖ గాని, పర్యాటక శాఖ గాని కనీస అభివృద్ధి పనులు చేపట్టలేదు. శిథిలావస్థకు చేరిన స్థూపం పరిసరాల్లో తవ్వకాలను నిషేధించినట్లు తెలిపే ఓ హెచ్చరిక బోర్డును, ఓ వాచ్‌ఉమెన్‌ను పురావస్తు శాఖ నియమించి చేతులు దులుపుకొంది.


విదేశీయుల ఆసక్తి
క్రీస్తుపూర్వం 3వ శతాబ్దికి చెందిన భట్టిప్రోలు స్థూపం చరిత్ర తెలుసుకునేందుకు తొలినుంచి విదేశీయులే ఆసక్తి కనబరిచారు. క్రీ.శ 1870లో బోస్‌వెల్‌, 1871లో ఇర్లియట్‌, 1882లో రాబర్ట్‌సివెల్‌లు దీన్ని సందర్శించారు. 1892లో అలెగ్జాండర్‌రే ఇక్కడ జరిపిన తవ్వకాల్లో రాతి ధాతుకారండాన్ని కనుగొన్నారు. 1969-70 సంవత్సరాల్లో పురావస్తు శాఖ తరఫున ఆర్‌.సుబ్రహ్మణ్యం తవ్వకాలు జరిపారు. ఒక విహారపు పునాదులు బయటపడ్డాయి. బుద్దుని తల ప్రతిమ వెలుగుచూసింది. పలు ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. పురావస్తు శాఖ అంచనా ప్రకారం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఇది నిర్మాణం జరిగిందని తెలుస్తోంది.

పట్టించుకోని పర్యాటక శాఖ..
పర్యాటక శాఖ కనీసం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న యోచన కూడా చేసినట్లు లేదు. కాలచక్ర ద్వారా అయినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, భావించిన వారికి నిరాశే మిగిలింది.స్థూపం చుట్టూ నిర్మించిన ఫెన్సింగ్‌ మినహా ఇతరా అభివృద్ధి లేకపోవడం పరిస్థితికి నిదర్శనం.

మహోజ్వల నిర్మాణం..
ఇక్కడి స్థూపం 132 అడుగులు, వేదిక 148 అడుగుల వ్యాసాలతో ఉంది. 8 అడుగుల ఎత్తు, 8.4 అడుగుల వెడల్పు ప్రదక్షిణా పథం నలుదిక్కులా అయకపు అరుగులు కలిగిన ఈ స్థూపం వాస్తురీత్యా నూతన విషయాలను అందించింది.స్థూప నిర్మాణానికి 45X30X8 సెంటీమీటర్ల కొలతలున్న ఇటుకలు వాడారు.

భట్టిప్రోలు ధాతువులు కలకత్తాలో:
భట్టిప్రోలు స్థూప తవ్వకాల్లో బయటపడిన ధాతువుల్ని అప్పటి బిట్రీష్‌ ప్రభుత్వం భద్రపర్చింది. 1892వ సంవత్సరంలో కలకత్తాలో స్థాపించిన మహాబోధి సొసైటీ ఆఫ్‌ ఇండియాకు నూతన స్థూపంలో నిక్షిప్తం చేసేందుకు వాటిని ఇవ్వటానికి అంగీకరించింది. 1893లో అమెరికాలో జరిగిన విశ్వమత మహాసభలకు హాజరైన శ్రీలంక బౌద్ద బిక్షువు అనగారిక ధర్మపాల ఈ సంస్థను స్థాపించారు. 1920వ సంవత్సరంలో కలకత్తాలోని శ్రీధర్మరాజిక విహార్‌లోని నూతన స్థూపంలో భట్టిప్రోలులోని బుద్ద ధాతువులున్న స్పటిక పేటికను నిక్షిప్తం చేశారు. అంతటి చారిత్రక ప్రాంతాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా దీని అభివృద్ధిపై దృష్టి నిలపాల్సిన అవసరం ఉంది.

Courtesy: ఈనాడు

Bhattiprolu
(District - Guntur - Lat16º 6'N, Long 80º 47 E)

Located near the Krishna River of Guntur district, Bhattiprolu has what is considered to be the most ancient stupa. The ancient name of this settlement was Prathipalapura and the pre-Mauryan Stupa contained a Buddhist relic. The crystal casket in which the relic was secured is at present worshipped at the Mahabodhi Society temple at Kolkata. The Maha Chaitya built to enshrine the relic at Prathipalapura is over 40 metres in diameter.

Bhattiprolu is a railway station on the Guntur - Repalli railway line and is about 6 kms. from the right bank of Krishna river. The stupa of Bhattiprolu is an irregular mass of brickwork with concentric courses of bricks visible at places and it yielded the corporal relics of Lord Buddha . With respect to sanctity and dimensions, this stupa found at Bhattiprolu stood next to only the Mahachaitya of Amarvati at one time. The solid brick work of the stupa revealed the drum of Stupa with wide terrace around the base of the dome which had four cardinal direction projections. The drum was embellished with oblong limestone slabs alternating with pilasters. Two pieces of a stone umbrella, ribbed inside with mesh, have been found at the site. This umbrella must have crowned the stupa. The most outstanding discovery at the site of the Bhattiprolu was three inscribed stone receptacles near the hole of the stupa. At the inside of the topmost receptacle were found, a globular black stone casket, copper bits including a ring, pearls, beads, a cup-shaped casket, an inscribed hexagonal crystal bead, gold flowers and two thin gold pieces relieved with tri-ratana symbol. The globular casket, the receptacle and the lowest receptacle also yield similar Buddhist antiquities with record of a large number of individuals belonging to different families and guilds. The inscriptions found can be dated between 1st Century and 2nd century AD.

Keywords: Telugu , Andhra Pradesh , Kalachakra 2006 , Guntur , Amaravati , Mahachaitya, India , Dalai Lama , Nagarjuna , Nagarjunakonda , Vijayawada , Eenadu , December 2005 , map , tourist tourism , Mahayana Buddhism , dibba , Mahayana , Theravada , Tibet Tibetan , Vajrayana


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


1 Comments:

At 10:11 AM, Blogger Bhale Budugu గారు చెప్పినారు...

really good post... keep posting such good things, atleast poeple know what great places we have in our state

 

Post a Comment

<< Home