బౌద్ధ అధ్యయన కేంద్రం అభివృద్ధి: వీసీ
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, డిసెంబరు 7 (న్యూస్‌టుడే): కాలచక్ర మహాప్రవచన కార్యక్రమాల సందర్భంగా విశ్వవిద్యాలయంలోని మహాయాన బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వీసీ బాలమోహన్‌దాస్ వెల్లడించారు. ఈ మేరకు అధ్యయన కేంద్రం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని బౌద్ధ అధ్యయన కేంద్రం విభాగాధిపతిని వీసీ ఆదేశించారు.
బౌద్ధ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సన్నాహాలు
కాలచక్ర మహాప్రచన కార్యక్రమాలకు విశ్వవిద్యాలయ మహాయాన బౌద్ధ అధ్యయన కేంద్రంలో బౌద్ధ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు డాక్టర్ రాంకుమార్‌రత్నం వెల్లడించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Courtesy: ఈనాడు
Keywords: Acharya Nagarjuna University , Telugu , Andhra Pradesh , Amaravati , Guntur , India , Kalachakra 2006 , Buddha Buddhist , stupa , Mahachaitya , Dalai Lama , Eenadu , December 2005 , tourist tourism , Tibet Tibetan , Sakyamuni , Mahayana , Theravada , Vajrayana , course courses
0 Comments:
Post a Comment
<< Home