రూ. 20 లక్షలతో మ్యూజియం అభివృద్ధి
అమరావతి, డిసెంబరు 10 (న్యూస్‌టుడే): బౌద్ధ కట్టడాలకు పూర్వ కళ తెచ్చేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాయశక్తులా ప్రయత్నం చేస్తుందని సంస్థ రాష్ట్ర సూపరింటెండెంట్ జితేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన కాలచక్ర కార్యక్రమానికై అమరావతి పురావస్తు ప్రదర్శనశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మహాస్థూపం అభివృద్ధికి రూ.10 లక్షలు, మ్యూజియం అభివృద్ధికి మరో రూ.10 ఖర్చు చేయనున్నట్లు వివరించారు.
స్థూపం చుట్టూ వలయ ప్రాకారాలు, స్థూపాన్ని సందర్శకులు తాకి పాడుచేయకుండా రెండు దశల్లో స్టీల్ రెయిలింగ్ పనులు చేపడుతున్నట్లు వివరించారు. స్థూప ప్రాంగణంలో గార్డెనింగ్ పెంచుతామని చెప్పారు. మహాస్థూప వాస్తవిక రూపాన్ని తయారు చేసేందుకు కొన్ని ఆటంకాలున్నాయని విలేకర్ల ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. స్థూపంపై ఫలకాలు (డ్రమ్ స్లాబ్స్) 100 వరకు మద్రాసులో, 30 వరకు లండన్‌లో ఉన్నాయని వివరించారు. వీటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చితేనే స్థూపం వాస్తవిక రూపం సంతరించుకుంటుందన్నారు. కార్యక్రమంలో నాగార్జున మ్యూజియం సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, అమరావతి సూపరింటెండెంట్ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra , Buddha Buddhist , Amaravati , Guntur , India , Kalachakra 2006 , stupa , Dalai Lama , museum , Eenadu December 2005
0 Comments:
Post a Comment
<< Home