"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Friday, December 09, 2005

స్వర్ణోత్సవ సాగరం : Nagarjunasagar to glow in golden glory


HYDERABAD: The entire structure of the Rs 1,300 crore నాగార్జునసాగర్ ( Nagarjunasagar ) dam on the Krishna will be illuminated for three days from Saturday along with the peripheral areas to mark its golden jubilee celebrations.

The event, to mark the 50th anniversary of the foundation of the world's biggest masonry dam, will bring political leaders, engineers, irrigation experts and farmers on a single platform.

Nestled in picturesque surroundings, the sheer size of the dam, about 150 km from Hyderabad, leaves one breathless.

The statues of Gautam Buddha, Acharya Nagarjuna, Dr K L Rao, who toiled to realise the dam, and Mir Jaffer Ali, its first chief engineer who supervised the construction during its crucial years (1955-1963), will be installed by chief minister Y S Rajasekhara Reddy on the left earthen dam.

A huge stupa will also be unveiled in memory of the eight engineers and 154 labourers who died in accidents during the dam construction.



Union minister S Jaipal Reddy and Renuka Chowdhury and a host of state ministers will participate in the celebrations. A souvenir will also be brought out highlighting the features of the dam.

Besides, a conference will be held for engineers and irrigation experts. A photo exhibition showcasing the various stages of construction of the dam will also be organised.

The Nagarjunasagar dam changed the fortunes of the people of Guntur, Prakasam, Nalgonda, Krishna and Khammam districts where it irrigates over 10 lakh acres of land.

The genesis of the project is traced to 1953 when a committee consisting of L Venkatakrishna Aiyer and D V Rao was constituted to prepare a feasibility report on a major irrigation project across the Krishna.

On Dec. 10, 1955, prime minister Jawaharlal Nehru laid the foundation stone for the dam. Work began in 1956 and was completed in 1969.

About 50,000 workers were employed to construct the masonry dam. G V Ramaswamy Reddy, father of hotel baron G V K Reddy, was among the important engineers who supervised the work.

T Subbirami Reddy, present chairman of the Tirumala Tirupati Devasthanams (TTD) was the key contractor.

While the former chief minister Kasu Brahmananda Reddy played an important role in completing the project, Indira Gandhi released the water into the canals in 1967.

The project has a height of 408 ft and storage capacity of 408 tmc ft with 26 crest gates. The right canal is 126 km long and irrigates about 12 lakh acres.

The left canal is 111 km and irrigates over 10 lakh acres. It has one of the largest network of canals and has a power generation capacity of 810 mw.

Nagarjunasagar has emerged as a major tourist place. It has an important Buddhist site named after scholar ఆచార్య నాగార్జున ( Acharya Nagarjuna ) who is said to have set up a centre of learning there.

It was during the building of the dam that ruins of an ancient Buddhist seat of learning were excavated and the relics carefully preserved on a picturesque island called నాగార్జున కొండ ( Nagarjuna Konda ), located in the centre of a man-made lake.


It also has the world's third largest artificial lake located about 4 km from the dam. The other attractions of the dam are the Ettipothala waterfalls and the densely forested Srisailam wildlife reserve.

Courtesy: Times of India

*****

స్వర్ణోత్సవ సాగరం


కూలీల భుజాలపై ఒక్కోరాయి పైకి లేచింది. కర్షక సౌధంకోసం కార్మికుల స్వేదం చిందింది. రాతికట్టే ఆనకట్త్టెంది. బిరబిరల కృష్ణమ్మ నిలిచింది. నాగార్జునకొండ చెంత సేదతీరింది. నది... ఇప్పుడు 'సాగర'మైంది. 1955 డిసెంబరు 10న... తొలిప్రధాని నెహ్రూ చేతుల మీదుగా ఆధునిక ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన. కుడి ఎడమగట్లే ప్రాకారాలు. కనిపించేదంతా గర్భాలయమే. ప్రతినీటిబొట్టూ దైవమే. స్వర్ణోత్సవ సమయంలో. అది ఆనంద సాగరమే. సాగర్‌ నిర్మాణానికి తొలిరాయిపడి నేటికి యాభయ్యేళ్లు. ఆ అద్భుత నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు లక్షలకు లక్షలు. ఆ నీటితో పునీతమవుతున్నవి 21.43 లక్షల ఎకరాలు. ఆ ప్రాజెక్టుతో లబ్ధి పొందుతున్నది ఆరు జిల్లాలు. శంకుస్థాపన జరిగిన తర్వాత పదమూడేళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్త్తెంది. 409 అడుగుల ఎత్తు... 4756 అడుగుల పొడవైన రాతికట్ట నిర్మితమైంది. 408 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో... 26 క్రస్ట్‌గేట్లతో... ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటైంది. 1972లో ఇది జాతికి అంకితమైంది.

భాగ్యప్రదాయిని!
చెరుకూరి వీరయ్య


నాగార్జునసాగరం... బౌద్ధమతాచార్యుడు నాగార్జునుడు నడయాడిన నేలపై పరవళ్లు తొక్కే కృష్ణమ్మకు మనం పెట్టుకున్న ముద్దుపేరది! లక్షల ఎకరాల తెలుగునేలను సుభిక్షం చేస్తున్న మహత్తర ప్రాజెక్టుకు మనం చేసుకున్న నామకరణమది!!
పేదరికాన్ని పారదోలి, రాష్ట్రానికి పాడిపంటల్ని, భోగభాగ్యాల్ని అందిస్తున్న ఆంధ్రుల అపురూపమైన ప్రాజెక్టు- నాగార్జున సాగర్‌. ఆ పేరు తలచుకుంటే చాలు... ప్రతి తెలుగువాడి మనసూ పులకరిస్తుంది... ఆనందంతో పరవళ్లు తొక్కుతుంది. తెలుగువారి ఇంట బతుకుదీపం వెలిగించిన ఈ ప్రాజెక్టుకు పునాదిరాయి పడి... నేటికి యాభై ఏళ్లు!

''ఇక్కడ... ఈ నాగార్జునసాగర్‌ డ్యామ్‌కు పునాదిరాయి వేయడాన్ని నేనెంతో పవిత్రమైన కార్యంగా భావిస్తున్నాను. ఇది నవభారత మానవతా మందిరానికి పునాది. దేశమంతటా మనం నిర్మించుకోబోయే ఎన్నో ఆధునిక దేవాలయాలకిది సంకేతం''- 1955 డిసెంబర్‌ పదో తేదీన సాగర్‌ డ్యామ్‌కు శంకుస్థాపన చేస్తూ నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అన్నమాటలివి. ఆనాడు ఆయన నోటివెంట జాలువారిన మాటలు ఆ తరవాత అక్షరసత్యాలని రుజవయ్యాయి. గత అర్ధశతాబ్దికాలంలో నెహ్రూజీ అభివర్ణించిన ఎన్నో 'ఆధునిక దేవాలయాలు' దేశమంతటా వెలసి, ఆహార రంగంలో భారత్‌ స్వయంసమృద్ధి సాధించేందుకు దోహదపడ్డాయి. అందులో ఒకటి ప్రతిష్ఠాత్మకమైన నాగార్జునసాగర్‌. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ అనే పేరును సార్థకం చేసిన ఈ ప్రాజెక్టు, ఆరంభంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది. అవన్నీ తలచుకుంటే ఇప్పుడు ఔరా అనిపిస్తుంది.

మదరాసు అడ్డుపుల్లలు
తొలుత కృష్ణానదిపై నందికొండ వద్ద డ్యామ్‌ను నిర్మించాలని హైదరాబాద్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎడమ కాల్వ నిర్మాణానికి సైతం పథకరచన చేసిన ప్రభుత్వం, దీనికి కుడికాల్వనూ జోడిస్తే భారీ ప్రాజెక్టుగా అవతరిస్తుందని భావించి అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం అనుమతిని కోరింది. అప్పటికే కృష్ణానదిపై సిద్ధేశ్వరం వద్ద కృష్ణ- పెన్నారు ప్రాజెక్టును నిర్మించి, కృష్ణా జలాలను చెన్నపట్నానికి తరలించుకుపోవాలని పథకం వేసిన మద్రాసు ప్రభుత్వం ప్రతిపాదిత నందికొండ ప్రాజెక్టును తిరస్కరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొంది. కృష్ణా- పెన్నారు, నందికొండ ప్రాజెక్టులలో కృష్ణా బేసిన్‌ అవసరాలను తీర్చడానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమో పరిశీలించి నివేదిక సమర్పించే బాధ్యతను అప్పటి కేంద్ర జలసంఘం చైర్మన్‌ డాక్టర్‌ ఖోస్లాకు అప్పగించింది. ప్రతిపాదిత నందికొండ డ్యామ్‌ నిర్మాణ స్థలాన్ని ఖోస్లా కమిటీ సందర్శించకూడదన్న దురుద్దేశంతో మద్రాసు ప్రభుత్వం ఎన్నో ఆటంకాలను కల్పించింది. నందికొండ ప్రాజెక్టును ప్రణాళికా సంఘానికి సాధికారికంగా నివేదించలేదనీ, రోడ్డు సౌకర్యంలేని కారణంగా ప్రాజెక్టు స్థలానికి వెళ్లలేమని మద్రాసు చీఫ్‌ ఇంజనీరు మొండికేశారు. ఈ విషయం తెలిసిన డాక్టర్‌ కె.ఎల్‌.రావు (అప్పటి కేంద్ర జల సంఘం డైరెక్టరు) వెంటనే ముక్త్యాలరాజాగా పేరొందిన రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్‌ను కలిసి విషయం చెప్పారు. దాంతో ఆయన రంగంలోకి దిగి అటవీ ప్రాంతంలో చెట్లను నరికించి 20 కిలోమీటర్ల పొడవునా సొంత ఖర్చుతో నాలుగు రోజుల్లోనే జీపులు ప్రయాణించేందుకు వీలుగా రోడ్డు వేయించారు. డాక్టర్‌ ఖోస్లా తన బృందంతో ఈ మార్గంగుండా వెళ్లి ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. కృష్ణా బేసిన్‌ అవసరాలను పూర్తిగా తీర్చకుండా నీటిని మద్రాసుకు తరలించడం సమంజసం కాదని పేర్కొంటూ, నందికొండ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని కమిటీ సిఫారసు చేసింది. దీనిపై అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలచారి ''తమిళ ప్రాంతాలకు నీరు లేదు, ఆంధ్ర ప్రాంతాలకు డబ్బులేదు'' అని వ్యాఖ్యానించారట. ఖోస్లా కమిటీ సిఫారసు మేరకు ప్రణాళికా సంఘం నందికొండ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతో మద్రాసు ప్రభుత్వం వేసే కొర్రీలకు అడ్డుకట్టపడింది.

నల్గొండ జిల్లాలోని నందికొండ గ్రామ పరిధిలో ఈ ప్రాజెక్టును తలపెట్టడంవల్ల తొలుత దీనిని 'నందికొండ ప్రాజెక్టు'గా వ్యవహరించినా, రెండో శతాబ్దికాలంలో ఈ ప్రాంతంలో బౌద్ధమత ప్రచారం చేసిన ఆచార్య నాగార్జునుడి పేరిట నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుగా ఇది నామాంతరం చెందింది. సాగర్‌ జలాశయానికి మట్టి డ్యామ్‌ల నిర్మాణం 1957లో ప్రారంభమై 1967 నాటికి పూర్తి అయింది. జలాశయం నుంచి దిగువ నదిలోకి నీటిని విడుదల చేసే స్పిల్‌వే నిర్మాణం పనులను రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని 1974 నాటికి పూర్తిచేసింది. డ్యామ్‌కు గేట్లను అమర్చడంవల్ల అదనంగా నిల్వ అయ్యే నీటిలో తమకూ వాటా ఇవ్వాలని మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు పేచీకి దిగాయి. వాటి వాదనను బచావత్‌ ట్రిబ్యునల్‌ తిరస్కరించింది. కృష్ణా డెల్టాకు, సాగర్‌ కుడి, ఎడమ కాల్వలకూ అవసరమైన నీటిని అందించాలంటే క్రస్ట్‌గేట్లు తప్పనిసరని తేల్చిచెప్పింది. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ను సిమెంట్‌ కాంక్రీట్‌తో కట్టాలా? లేక రాతితో నిర్మించాలా అన్నది మొదట్లో ప్రధాన సమస్యగా మారింది. అప్పటికే భాక్రానంగల్‌ డ్యామ్‌ను కాంక్రీట్‌తో నిర్మించినందువల్ల అదే సరైన పద్ధతని ఉత్తరాది ఇంజనీర్లు వాదించారు. నాణ్యమైన గ్రానైట్‌ రాయితో నిర్మించాలన్నది దక్షిణాది ఇంజనీర్ల అభిప్రాయం. ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో కె.ఎల్‌.రావు రంగప్రవేశం చేసి, రాతికట్ట నమూనా పలకలను అమెరికాలోని ప్రయోగశాలలకు పంపి పరీక్ష చేయించారు. అక్కడి నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా రాతి కట్టడమే శ్రేయస్కరమని నిర్ణయించారు. దీనివల్ల సుమారు 30 వేల మంది కార్మికులకు పదేళ్లకు పైగా ఉపాధి లభించింది. అలా... ప్రపంచంలోనే అతిపెద్దదైన, ఎత్త్తెన రాతితో నిర్మించిన డ్యామ్‌ రూపుదాల్చింది. సాగర్‌ డ్యామ్‌ ఎత్తు నదీగర్భంపై 409 అడుగులు. యంత్రాల సాయం లేకుండా అంత ఎత్తుకు రాళ్లను, సిమెంట్‌ను ఇతర నిర్మాణ సామగ్రిని చేర్చడమంటే మాటలుకాదు. స్థానికంగా లభించే సరుగుడు బోదెలను బోల్టులు, నట్లతో బిగించి పరంజా తయారుచేసి దాని ఆధారంగా కార్మికులు పైకి వెళ్లేవారు. అలాగే డ్యామ్‌ పైభాగాన్ని కార్మికులు నడచి చేరుకొనేందుకు వీలుగా వెదురుకర్రలతో వాలుమార్గాన్ని నిర్మించారు. ఇది ఎన్నో చుట్లు తిరుగుతూ పైకి వెళ్లేది. డ్యామ్‌ ప్రథమదశ నిర్మాణంలో పరంజాలనే వాడినా, రెండో దశలో మోనోటవర్‌ క్రేన్‌ను ఉపయోగించారు. రాళ్లను, సిమెంటు, ఇసుక, తదితర నిర్మాణ సామగ్రిని ఈ క్రేన్‌ సహాయంతో పైకి తరలించేవారు. రాతికట్ట పని ముమ్మరంగా జరుగుతున్న సమయంలో రోజుకు పదిహేనువేల టన్నుల నిర్మాణ సామగ్రిని వినియోగించేవారు.
అప్పట్లో సాగర్‌ కుడికాల్వ గమనమార్గాన్ని కె.ఎల్‌.రావు నిశితంగా పరిశీలించేవారు. వాస్తవానికి గుంటూరు జిల్లా నకరికల్లు వద్ద కాల్వ ఆగిపోవాలి. దానిని అక్కడ ఆపకుండా తూర్పు కనుమల మధ్య నుంచి కొంతదూరం తీసుకువెళ్లగలిగితే వినుకొండ, పొదిలి, దర్శి, ఒంగోలు తాలూకాలకు నీరందించవచ్చని ఆయన భావించారు. ఆమేరకు ప్రభుత్వానికి నచ్చజెప్పారు.

వ్యయం అతిస్వల్పం
సాగర్‌ ప్రాజెక్టుకు మొదట 1960లో కేంద్రం అనుమతించిన అంచనా వ్యయం రూ. 91.12 కోట్లు. కాగా 1969లో ప్రణాళికాసంఘం సవరించిన అంచనావ్యయం రూ. 163.54 కోట్లు. ఆ తరవాత ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో మార్పులు, చేర్పులు జరిగాయి. అయినప్పటికీ 2005 నవంబర్‌ మాసాంతానికి సాగర్‌ ప్రాజెక్టుపై వెచ్చించిన మొత్తం కేవలం 1300 కోట్ల రూపాయలకు మించలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రాజెక్టు కింద 20.94 లక్షల ఎకరాల (ఎడమ కాల్వ కింద 9.76 లక్షలు, కుడి కాల్వ కింద 11.18 లక్షలు) భూమి సాగవుతోంది. దీనినిబట్టి చూస్తే, ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎకరానికి రూ. 6,200కు మించలేదన్నమాట. ప్రస్తుతం ఏ భారీ ప్రాజెక్టును నిర్మించాలన్నా దాని నిర్మాణ వ్యయం ఎకరాకు రూ. 80 వేల నుంచి లక్ష రూపాయలకు తక్కువ కావడం లేదు. గత ఇరవయ్యేళ్లుగా సాగర్‌ ప్రాజెక్టు కింద ఏడాదికి సగటున కనీసం రూ. 1500 కోట్ల విలువైన ఫలసాయం లభిస్తోంది. జల విద్యుదుత్పాదన వల్ల ఏటా రూ. 400 కోట్ల ఆదాయం వస్తోంది.
యాభయ్యేళ్లు గడిచినా చెక్కు చెదరని సాగర్‌ డ్యామ్‌, సాంకేతిక నిపుణుల ప్రతిభాపాటవాలకు నిదర్శనం. డ్యామ్‌ మాత్రమే కాకుండా క్రస్టుగేట్లు, ఇరువైపులా ఉన్న మట్టి కట్టలు, ప్రధాన కాల్వల రెగ్యులేటర్లు... అన్నీ ఇప్పటికీ పటిష్ఠంగా ఉండటం విశేషం. కుడికాల్వ కింద స్థిరీకరించిన 11.18 లక్షల ఎకరాల ఆయకట్టు పూర్తిగా అభివృద్ధి చెందింది. ఎడమ కాల్వ కింద మాత్రం 10.18 లక్షల ఎకరాల స్థిరీకృత ఆయకట్టులో 9.88 లక్షల ఎకరాల భూమి మాత్రమే అభివృద్ధికి నోచుకుంది. అభివృద్ధి చెందని 30 వేల ఎకరాల భూమి కృష్ణా జిల్లాలోని వేంపాడు మేజరు డిస్ట్రిబ్యూటరీ పరిధిలో ఉంది. ఈ కాల్వ పైభాగంలో తవ్వకం బాగా లోతుగా ఉండటం, గట్లు జారిపడటం వంటి కారణాల వల్ల నీటి ప్రవాహానికి అవరోధాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా గత ఇరవయ్యేళ్లుగా ఈ 30 వేల ఎకరాల భూమి బంజరుగా పడి ఉంది. కాల్వ అడుగు భాగాన, ఇరువైపులా కాంక్రీటుతో గట్లు నిర్మించడంతోపాటు కాల్వ పైభాగాన కూడా కప్పు ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. నీటి పంపిణీలో చోటుచేసుకుంటున్న నిర్వాహక లోపాల వల్ల కొందరు రైతులకు నష్టం జరుగుతున్న మాట నిజమే. అధికారులు పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకు వెడితే ఈ సమస్యను అధిగమించడం కష్టం కాదు. ఇలాంటి చిన్నా చితకా సమస్యలను మినహాయిస్తే- నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు మన రాష్ట్రానికి లభించిన అపురూపమైన వరం అనడంలో సందేహంలేదు. డాక్టర్‌ కె.ఎల్‌.రావు చెప్పినట్లు ఈ బృహత్పథకం రూపకల్పనలోనూ, నిర్మాణంలోనూ విదేశీ నిపుణుల సాయం అర్థించకపోవడం భారత ఇంజనీర్ల ఆత్మవిశ్వాసానికి, వారి పనితనానికి నిదర్శనం. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్టు... మన రాష్ట్రానికి చెందిన ఇంజనీర్లకు గర్వకారణం.
(రచయిత నీటిపారుదలరంగ నిపుణులు)

Courtesy: ఈనాడు


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home