US consulate in Hyderabad
HYDERABAD, March 3. — The USA would begin its fourth consulate in Hyderabad. It would begin functioning from Dilkusha Guest House, adjacent to Raj Bhavan, before moving to its own premises over ten acres near Hi-Tec City.
“Very befittingly, when Mr George Bush was here, the Centre and the USA agreed to open a US consulate here. This would help thousands of people from the state who till now would go and wait for visas at the US consulate in Chennai”, chief minister Dr YS Rajashekar Reddy told reporters.
He said a $100 million protocol, Indo-US Knowledge Initiative, has been signed. Under the protocol, Andhra Pradesh would be the biggest beneficiary in terms of interaction between agricultural universities and transfer of agricultural technology between two countries.
Dr Reddy flew with Mr Bush aboard Marine One, the US President’s helicopter, from the Hyderabad airport to the agricultural university.
This is the first time that a chief minister of a state travelled aboard a US President’s helicopter. On board, Dr Reddy briefed President Bush about the Telugus in the USA, their dominance in Silicon Valley and Telugu entrepreneurs succeeding in America, official sources told The Statesman. — SNS

Courtesy: The Statesman
హైదరాబాద్‌లో కాన్సులేట్
తాత్కాలికంగా దిల్‌ఖుష అతిథిగృహంలో
హైదరాబాద్ - న్యూస్‌టుడే
తాత్కాలికంగా దిల్‌ఖుష అతిథిగృహంలో
హైదరాబాద్ - న్యూస్‌టుడే
దక్షిణ భారతదేశంలో రెండో అమెరికన్ కాన్సులేట్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ విషయం ప్రకటించింది. తాత్కాలికంగా దీన్ని ఖైరతాబాద్‌లోని దిల్‌ఖుష అతిథిగృహంలో ఏర్పాటు చేస్తారు. 2007 అక్టోబరు నుంచి ఇది పనిచేస్తుందని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విలేఖరుల సమావేశంలో చెప్పారు. శాశ్వత వసతి కోసం గచ్చిబౌలిలో పదెకరాల స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించనుంది. కానీ దీన్ని అధికారికంగా ప్రకటించలేదు. అమెరికా వీసాల కోసం ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రజలు చెన్నైలోని కాన్సులేట్‌కు వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడా అవసరం తప్పుతుంది. హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ ఏర్పడితే మరికొన్ని దేశాలూ తమ కాన్సులేట్లు ఏర్పాటు చేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.
నిజానికి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జులై 21న భారత విదేశాంగ శాఖకు ఓ లేఖ రాస్తూ హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ ఏర్పాటుకు సిఫారసు చేయాలని కోరింది. విదేశాంగ శాఖ మొన్న ఫిబ్రవరి 7న దీనికి సమాధానం ఇస్తూ అమెరికా ప్రభుత్వం ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలిపింది. దీనితో కాన్సులేట్ కోసం తాము ఏమేం సమకూరుస్తామో పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం అమెరికా రాయబార కార్యాలయానికి ఫిబ్రవరి 15న లేఖ రాసింది. కాన్సులేట్ ఏర్పాటు పట్ల తాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున జార్జి బుష్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వైఎస్ విలేఖరులతో చెప్పారు.
వైఎస్‌కు ప్రధాని ఫోన్
జాతీయ విత్తన కేంద్రంలో బుష్ పర్యటన ముగిసిన కొద్దిసేపటికే ప్రధానమంత్రి మన్మోహన్ నుంచి ముఖ్యమంత్రికి ఫోన్ వచ్చింది. బుష్ పర్యటన ఎలా జరిగిందని ప్రధాని ఆరా తీశారు. ''అద్భుతంగా జరిగింది సర్! మహిళా సంఘాలతో ఆయన బాగా మమేకమయ్యారు. మన సాగు విధానాలు చూశారు. జాతీయ విత్తన కేంద్రంలో నిర్ణీత సమయం 50 నిమిషాలకన్నా మరో అర్ధగంట అదనంగా గడిపారు'' అని వైఎస్ చెప్పారు.
దిల్‌కుశ గెస్ట్‌హౌస్‌లో అమెరికా కాన్సులేట్
శాశ్వత కార్యాలయం మాదాపూర్‌లో
వీసాలిప్పుడు ఇక్కడే సులభంగా
రాష్ట్రవాసుల్లో ఆనందం
న్యూస్‌టుడే - ఖైరతాబాద్, సికింద్రాబాద్
ఇప్పటివరకూ అతిథి గృహంగా...
చారిత్రాత్మకమైన కట్టడంగా పేరున్న దిల్‌కుశ అతిథిగృహం నిజాం కాలంలో నిర్మించారు. దీనికెంతో చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. మొత్తం 11 గదులతో అద్భుతమైన వాస్తుకళతో విరాజిల్లే ఈ అతిథిగృహం... పలువురు మంత్రులు, ఎంపీలూ, అధికార ప్రతినిధులూ... ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు వారికి తాత్కాలిక ఆవాసంగా ఉంటూ వచ్చింది. ఎప్పుడైనా రాష్ట్రపతి నగరానికి వస్తే... ఆయన పర్యటనలో ఆయన రాజ్‌భవన్‌లో విడిది చేస్తారు. ఆయన వెంట వచ్చిన అధికారులకూ, సిబ్బందికీ ఈ భవనమే అతిథిసత్కారాలు అందజేస్తుంది.
చెన్నై వెళ్లే బాధ తప్పిందిప్పుడు...
ఇప్పటివరకూ దక్షిణభారత దేశంలో అమెరికన్ కాన్సులేట్ వ్యవహారాలన్నీ చెన్నైలోనే జరిగేవి. అమెరికా వెళ్లదలచిన విద్యార్థులు, ఉద్యోగార్థులు అంతా చెన్నైకే వెళ్లి తమ కార్యకలాపాలన్నీ జరిపించుకోవాల్సి వచ్చేది. ఈ కాన్సులేట్ ద్వారా జారీచేసే వీసాల్లో అత్యధికం మన రాష్ట్రానికే చెందినవే కావడం గమనార్హం. ఏటా చెన్నై కార్యాలయం జారీ చేసే 70 వేలకు పైగా వీసాల్లో 60శాతానికి పైగా రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాంతాల వారికి మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడంతో వీసాల కోసం చెన్నై వెళ్లాల్సిన పరిస్థితి తప్పింది. నగరంలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటుతో అమెరికన్ వీసాలు పొందడం సులభతరం కానుంది.
మనది నాలుగో కాన్సులేట్...
ఇప్పుడు నగరంలో ఏర్పాటు చేయబోయే కాన్సులేట్ కార్యాలయం ఈ తరహా కార్యాలయాల్లో నాలుగోది. వాస్తవానికి న్యూఢిల్లీలో పూర్తిస్థాయి రాయబార కార్యాలయం ఉంది. ఇక వీసాలు ఇచ్చేందుకు అనువైన కాన్సులేట్ కార్యాలయాలు ఇప్పటివరకూ ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో ఉండగా... తాజాగా దీన్ని హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయడంతో ఇది ఈ తరహా వాటిల్లో నాలుగోది అయ్యింది.
పెరగనున్న నగర ప్రాధాన్యం
మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రానికి ప్రాధాన్యం ఉంది. ఇటీవలే ఫ్యాబ్‌సిటీతో పలు పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం వేదిక కావడం ఈ నేపథ్యంలో అమెరికా కాన్సులేట్ కార్యాలయం రావడంతో నగర ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశముంది.
Courtesy: ఈనాడు
Technorati tags: Telugu,తెలుగు
0 Comments:
Post a Comment
<< Home