ప్రాచీన హోదాతో ప్రయోజనమెవరికి?
- సంతపురి యశోదమ్మ
తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలని వస్తున్న ఉద్యమంలో రెండు సందేహాలను తీర్చ వలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు, అందుకు ఉద్యమిస్తోన్న అన్ని సంస్థలపై ఉన్నది. తెలుగును అధికార భాషగా గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినదంతా చేసి, రాష్ట్రంలో తెలుగును అధికార భాషగా గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినందం తాచేసి, రాష్ట్రంలో తెలుగు అధికారభాషగా అమలవుతూ ఇంకా దానికి రెండవ జాతీయ భాషగాను, ప్రాచీన భాషగాను కేంద్రం గుర్తింపు ఇవ్వవలసిన అవసరం మాత్రమే మిగిలిందా? అధికార భాషా సంఘంగానీ, తెలుగు విశ్వవిద్యాలయంగానీ తెలుగు భాషా పరిరక్షణ సంఘం కానీ ఈ డిమాండు పెట్టడం లేదని కాదు- ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏ కృషి చేసిందో, ఏ చర్యలు చేపట్టిందో, ఏ స్థాయి వరకు తెలుగు అధికార భాషగా అమలవుతున్నదో పారదర్శకంగా ఒక శ్వేత పత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేకుండా మన్మోహన్‌ను కలిసి కేంద్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేయడానికే మన శక్తియుక్తుల న్నిటిని వినియోగిద్దామా? ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. రామచంద్రమూర్తి తెలుగును ప్రాచీన భాష గా గుర్తించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా వేశారు. తెలుగును ప్రపంచంలోనే పదిహేను కోట్లమంది మాట్లాడే ఆరవ పెద్ద భాషగా పేర్కొంటూ ప్రాచీనత్వం గురించి కూడా పేర్కొన్నారు. అదే ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తెలుగును ఉన్నత న్యాయస్థానం కాదు గదా, జిల్లా స్థాయికాదు గదా, మెజిస్ట్రేట్ స్థాయిలో కూడా అధికార భాషగా గుర్తించడం లేదని ఉన్నత న్యాయ స్థానం దృష్టికి తెచ్చి ఉంటే బాగుండేది.
ఒక భాషను అధికార భాషగా గుర్తించడమంటే బోధనాపరంగా ప్రాథమిక విద్యనుంచి విశ్వవి ద్యాలయ స్థాయివరకు ఆ భాషలో బోధన జరగాలి. అంటే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు, ఉర్దూలలో ఆ జనాభా ప్రాతిపదికపై ఆ రెండు భాషల్లో అత్యున్నత స్థాయి వరకు బోధన జరగాలి. ఇప్పటికి అవి కూడ మాద్యమాలుగా ఉన్నయేయో కాని అవి మాత్రమే మాధ్యమాలుగా లేవు. సామాజిక, మాన వీయ శాస్త్రాలు తప్ప విజ్ఞానశాస్త్రం, ఇంజనీరింగ్, వైద్యం మొదలైన సాంకేతిక జ్ఞానమంతా కళాశాల స్థాయి నుంచే ఇంగ్లీషులోనే పొందాల్సి వస్తున్నది. అసలు సాంకేతిక విజ్ఞానం దానికదే ఒక భాష అని కాక మనం అది ఇంగ్లీషు అనుకునే అవగాహనతో ఉన్నాం. ఇంగ్లీషు వాక్యంలో విజ్ఞాన, సాంకేతిక భాష (అది గ్రీకు, లాటిన్, జర్మన్ భాషల్లో ఉండవచ్చు) నేర్చుకునే ఒక కృత్రిమమైన, అసౌక్యకరమైన విద్యాబోధన వల్ల మళ్లీ అవి ప్రత్యేక ఉన్నత విద్యలుగా పొందాల్సి వచ్చినప్పుడు వేరే శిక్షణ, ప్రత్యేక పరీక్షలు అవసరమవుతున్నాయి. ముఖ్యంగా విద్యా బోధన విషయంలో మన దృష్టి అంతా (ఇవ్వ వలసిన ప్రభుత్వం, తీసుకోవల్సిన వర్గాలు) ఎవరో కొందరు ఉన్నత విద్యల కోసం, సంపాదన కోసం పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు పోవడాన్ని పరిగణనలోకి తీసుకున్నదే. నిజానికి ఇప్ప టికీ ఉపాధి కోసం (బతుకు దెరువు అందామా) విదేశాలకు పోతున్న వాళ్లలో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల కన్నా గల్ఫ్ దేశాలకు పోతున్న వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కంప్యూటర్ నేర్చు కొని పోతున్న వాళ్ల కన్నా కూలి పని చేసుకొని బతకడానికి పోతున్నవాళ్లు ఎక్కువ ఉన్నారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని ఏ స్థాయిలో నయినా మన విద్యా బోధన ఉంటున్నదో దేశమంతా నిర్మాణ పను ల్లో పాల్గొనడానికి సగానికి సగం జనాభా తరలిపోతున్న పాలమూరు లేబర్ కోసం తెలుగునేల మీద భారతీయ భాషలను పరిచయం అయినా చేసే పని ఎవరైనా చేస్తున్నారా? దిన భత్తెం కూడా ఇవ్వ మంటే జంతర్‌మంతర్ దగ్గర ధర్నా చేసి పత్రికల దృష్టిని ఆకర్షించిన పాలమూరు కార్మికులు ఢిల్లీకి పోవడానికి ఏ భాష ఏ పాఠశాలలో నేర్చుకొని ఉంటారు? వాళ్లే వలసపోయే లేబర్ కాబట్టి వాళ్ల చదు వు గురించి ఆలోచించే బాధ్యత మనది కాదంటారా? పదిహేను కోట్ల మంది తెలుగు మాట్లాడే వాళ్లు ప్రపంచంలో ఉంటే మరి పదిహేను కోట్ల మంది కోసం ప్రాచీన భాషగానే తెలుగును కేంద్రం గుర్తించాలని కోరుకున్నామా? ఆ పేరు మీద యునెస్కో నుంచి, కేంద్రం నుంచి వచ్చే అదనపు నిధు ల కోసం అడుగుతున్నామా? నేనిప్పుడు ఎవరికో ఏదో ప్రయోజనముందని ఆరోపించబోవటం లేదు గానీ ప్రజాస్వామ్యంలో ఒక విధాన నిర్ణయం బహుళ ప్రజల, అందులోను అట్టడుగు ప్రజల ప్రయో జనాల కనుగుణంగా ఉండాలా వద్దా? అధికార భాష అన్ని స్థాయిల్లో బోధనా భాషగా ఉండాలంటే ప్రభుత్వం ఒక పాఠశాల విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఉచితంగాను, నిర్భంధంగానూ మాతృభాషల్లో విద్యా బోధనను అమలు చేయాల్సివుంటుంది. ఈ మాట అనగానే 'మీ కయితే ఇంగీ ్లషు కావాలికానీ, బడుగు వర్గాలకు వద్దా?' అని ముఖ్యమంత్రి గద్దించినట్లున్నారు. మొక్కుబడిగా ప్రభుత్వ పాఠశాల మొదలు విశ్వవిద్యాలయం వరకు తెలుగు మాధ్యమంగానయినా ఉందేమోగానీ సింహ భాగాన్ని పొందిన ప్రైవేటు విద్య అంతా ఇంగ్లీషులోనే సాగుతూ భాషావేత్తలు ఆందోళన పడుతున్నట్లుగా 30 శాతం పిల్లలు తెలుగును మరచిపోయే స్థితి ఏర్పడింది. బహుశా ఇదే స్థితి కొన సాగితే తెలుగకు ప్రాచీన భాష గుర్తింపు రావచ్చు గాని అది సంస్కృతం వలె ప్రాచీన భాషగా మిగి లి ప్రజల భాషగా అంతరించిపోవచ్చు.
రెండో సందేహం, ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవాలైనా, అప్పటి నుంచే ఆరంభమైన ఈ అధికార భాష, ప్రాచీన భాష ఆందోళనలయినా ప్రత్యేక తెలంగాణ వాదాన్ని అడ్డుకోవడానికైతే కాదు గదా?! రాష్ట్రం సమైక్యంగా ఉంటే భాషా సాహిత్యాలు అభివృద్ధి చెందుతాయని, సంస్కృతి పరిఢవిల్లుతుందని చెప్పడానికి కాదు గదా అని. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే వాళ్లందరూ దోపిడీలో వివ క్షతో భాగమని నేను అనుకోవడం లేదు. అనడమూ లేదు. కాని వాళ్లందరూ గ్రహించవలసిన విష యం ఏమిటంటే ధర్మపురి సీతారామ్ రాసినట్లు తెలంగాణ రాష్ట్ర డిమాండు వెనుకబాటుతనమో, అభివృద్ధి పథకాలు చేపట్టకనో వచ్చింది కాదు. దోపిడీ, వివక్షల వల్ల వచ్చింది. ఇది ఒక్క తెలంగా ణకు వర్తించే విషయం కాదు. ఉత్తరాంధ్ర, పల్నాడు, రాయలసీమలు కూడ ఇటువంటి దోపిడీ, వివ క్షలు ఎదుర్కొంటున్నాయి. అయితే అందులో కూడా ఒక గుణాత్మకమైన తేడా ఏమిటంటే ఈ దోపి డీ, వివక్షలకు ఒక రెండున్నర వందల ఏళ్ల చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర వెనుక రాజకీయార్థిక నిర్మాణా లకు సంబంధించిన వ్యత్యాసాలు ఉన్నాయి.
తెలుగువాళ్ల నిజాంరాజ్యంలో బ్రిటిష్ ఆంధ్రలో ఉన్నందువల్ల తెలుగుప్రజల, భాషా సంస్కృ తుల అభివృద్ధి కుంటుపడిందని, ఇటు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నవాళ్లు ఆంధ్ర మహాసభ, ఆంధ్ర సారస్వత పరిషత్తు, దేశోద్ధారక గ్రంథమాలలు పెట్టి -అన్నీ విషయాలలో అటు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రాజకీయనాయకులను, సాహిత్యవేత్తలనే ఆదర్శంగా తీసుకుని లేదా గాంధీగారిని ఆదర్శంగా తీసుకొని ఉద్యమాలు నిర్వహించారు. అప్పుడుకూడ ఆంధ్రప్రాంతంలో తమిళుల ఆధిపత్యం నుంచి బయటపడాలని, బ్రిటిష్‌వారు వెళ్లిపోవాలని చేసిన ఉద్యమంతో ఇట్లా ప్రాచీన ప్రశస్తి అటువైపునుంచి ఎక్కువగా భాషా సాహిత్యాల్లో కనిపించింది. శాతవాహనులనుంచి, ఇక్ష్వాకులు, పల్లవుల నుంచి (వీళ్లేమీ తెలుగు రాజులు కాదు) తెలుగురాజ్యాలు, కళలు, సంస్కృతి ఎంత గొప్పవో కవులు గానం చేశారు. మరొక వైపు అదే కాలంలో తెలంగాణలో ఉన్నవాళ్లకు తెలుగు రాదని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. శాతవాహనులు, కాకతీయులు, విజయనగరరాజుల కాలంలో మినహా మిగతా కాల మంతా తెలుగు వాళ్లు ఇప్పటి వలె ఒకే రాజ్యం కింద ఏమీ లేరు. శాతవాహ నులకాలంలో మొదట ఎక్కువకాలం కరీంనగర్ జిల్లానుంచే అంటే గోదావరి తీరంనుంచే జరిగింది. అదే మొదటి తెలుగు సామ్రాజ్యం. దీర్ఘకాలం సువిశాల రాజ్యాన్ని పాలించిన వాళ్లు కాకతీయులు. వరంగల్ రాజధాని. విజయనగర రాజుల రాజధాని ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌కు వెలుపల హంపీ విజయ నగరం. ఈ మూడు రాజ్యాలు కాని రెండువేల సంవత్సరాల తెలుగు పాలనలో చాళుక్యులైనా, రెడ్డి, వెలమరాజులనా తెలుగు భాషా సాహిత్యాలను తక్కువేమీ పోషించలేదు. అప్పుడు తెలుగువాళ్లంతా కొత్త రాజ్యంలో లేరు. అటు కొండవీడులో, ఇటు రాచకొండలో రెడ్డిరాజుల ఆశ్రయం పొందిన శ్రీనాథుడు మొదట చెప్పాడు-'దేశ భాషలందు తెలుగు లెస్స' అని. ఒక భాష లెస్స కావడానికి బలవంతంగా ఒక రాష్ట్రంలో కలిపి ఉంచాలన్న నియమమేమీ లేదు. బహుశా అది దోపిడీ వివక్షల కారణంగా అపోహ లకు దారి తీసి- ఇదిగో ఇప్పటివలె గిడసబారిపోతుంది. కనుక స్పష్టం చేసుకోవాల్సింది- గుర్తింపు కోరుకుంటున్న ప్రాచీన భాష తెలుగు కృష్ణా, గోదావరి జిల్లాలకు చెందిన రాజకీయార్థిక ఆధిక్యతల వల్ల, పత్రికలవల్ల ఇవ్వాళ ఆధిపత్యం చేస్తున్న తెలుగా- ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో ముఖ్యం గా దళితులు, మహిళలు, అట్టడుగు వర్గాలు మాట్లాడే దేశి తెలుగా- లేక రాజ మహేంద్రవరంలో నన్నయతో, రాజరాజనరేంద్రుని ప్రోత్సాహంతో ప్రారంభమై ఇప్పటికీ ఆధిపత్య స్థానంలో కొనసాగు తున్న మార్గ తెలుగా? మార్గ అనడంలో కేవలం సంస్కృత అనే అర్థమే లేదు. అది ఆనాడు నిజం కావచ్చు. మన ఆలోచనల్లో భావజాలంలో సంస్కృతిలో ఉన్న ఆధిపత్య భావ జాలం ఎస్టాబ్లిష్మెం టుకు చెందిన ధోరణి అంతా మార్గ పద్ధతే. భాషా సాహిత్య సాంస్కృతిక అభివృద్ధులను అసంకల్పి తంగానైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోటీ ఉద్యమంగా నిర్మించే ప్రయత్నం చేయకండి. మీరం దరూ చెప్తున్నట్లు పదిహేను కోట్ల మంది తెలుగు వాళ్లు ఒకే ఒక్క పరిపాలన కింద లేరు గదా. రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలలో తెలుగు అధికార, ప్రాచీన భాషగా గుర్తింపు పొంది వికసించడం హిందీ, తమిళ రాష్ట్రాల వలె గర్వకారణమే కదా. మన దేశంలో మాతృభాష కాకున్నా ఎక్కువ మంది మాట్లా డగలిగే భాషలు, అర్థంచేసుకునే భాషలు హిందీ, ఉర్దూలే. అది చారిత్రక, అధికార కారణాల వల్ల మొదట, సినిమాల వల్ల ఇప్పటికీ సాధ్యమవుతున్నది. పదిహేను కోట్లో, ఇంకా ఎక్కువో తెలుగు, తమిళం మాట్లాడే వాళ్లు ఎవరూ మాతృభాష తెలుగు, తమిళం కాని వాళ్లలో ఉండరు. ప్రేంచంద్, కిషన్‌చందర్ మొదలైన వాళ్లు ఎందరో ఉర్దూలో రాశారు. రెండవ జాతీయ భాషగా తెలుగును గుర్తిం చాలన్న డిమాండ్‌ను పక్కనబెట్టి మొదట రాష్ట్రంలో అన్ని ప్రాంతాల తెలుగు, ఉర్దూలకు అధికార మిచ్చి అటువంటి అందరి , అన్ని ప్రాంతాల తెలుగుకు ప్రాచీన భాష గుర్తింపు కావాలని ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలతో పోరాడుదాము.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Telugu classical ancient language status demand Andhra Pradesh tcld2006
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home