రేపటి ఇంజినీర్లకు రూట్ మ్యాప్ !
ముందస్తుగానే కాదు, పకడ్బందీగానూ ఉండాలి... కెరియర్ ప్రణాళిక! భావి ఇంజినీర్లకు ఇప్పుడిది మరీ అవసరం. భారీ సంఖ్యలో ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోతూ... విద్యా ప్రమాణాలు ప్రశ్నార్థకమవుతున్న తరుణమిది! అందుకే... ఇంజినీరింగ్ విద్యార్థులు ఫైనలియర్‌లోకి ప్రవేశించకముందే తమ స్థాయిలోనే మెరుగైన భవిష్యత్ వ్యూహం రచించుకోవాలి! ముందడుగు వెయ్యాలి!
తరగతులూ, సెమినార్లూ, పరీక్షల మధ్య సెమిస్టర్లు దొర్లిపోతుంటాయి. ఈ క్రమంలో వచ్చే మూడో సంవత్సరం... ఇంజినీరింగ్ విద్యార్థికి చాలా కీలకమైనది. ఎందుకంటే- వెుదటి రెండు సంవత్సరాల అనుభవంతో కెరియర్ పట్ల స్పష్టత వస్తుంది. ఉన్నత విద్య చదవాలా, ఉద్యోగ ప్రయత్నం చేయాలా అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కునేది అప్పుడే. దాన్నిబట్టే ప్రణాళిక వేసుకోగలిగేది.
చదువు, ఉద్యోగం అనే రెండిట్లో ఏదో ఒకదానిపైనే దృష్టి పెట్టటం ఒక పద్ధతి. అయితే రెండిటికీ ప్రయత్నించి, చివరికి మెరుగైనదానిపై వెుగ్గు చూపటం శ్రేయస్కరమని ఎక్కువమంది అభిప్రాయం.
ఎంట్రన్సులు ఎప్పుడు?
ఉన్నతవిద్య కోసం ఎంట్రన్స్ పరీక్షలకు మూడో సంవత్సరంలో ప్రిపేరై, నాలుగో సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలపై దృష్టి పెట్టటం ఉత్తమ మార్గమని సీనియర్ విద్యార్థులు సలహా ఇస్తున్నారు. గేట్, జీఆర్‌ఈ, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ లాంటి పరీక్షల స్కోర్ 2-5 ఏళ్ళకు వర్తిస్తుంది కాబట్టీ, ఫైనలియర్లో ఒత్తిడి తగ్గుతుంది కాబట్టీ మూడో సంవత్సరంలోనే ఎంట్రన్సులు రాయాలని సూచిస్తున్నారు.
ఎంటెక్ మనదేశంలోనే చదవాలనుకునేవారు గేట్ రాసి, మంచి స్కోర్ వస్తే ప్రతిష్ఠాత్మక సంస్థలైన ఐఐటీలు/ఎన్‌ఐటీల్లో సీటు కోసం ప్రయత్నించవచ్చు. డీమ్డ్ యూనివర్సిటీలకు ప్రత్యేకంగా ప్రవేశపరీక్షలు రాయాల్సివుంటుంది.
ఐఐఎంలలో ఎంబీఏ చేయాలనుకుంటే CAT రాయాలి. అయితే దీనికి ఏడాది పాటైనా గట్టిగా ప్రిపరేషన్ అవసరమవుతుంది.
విదేశాల్లో ఎం.ఎస్./ పీహెచ్‌డీ చేయాలనుకునేవారు GRE , TOEFL /IELTS రాయాల్సివుంటుంది. వీటికి కనీసం 4 నెలల ప్రిపరేషన్ అవసరం. విదేశాల్లో ఎంబీఏ చేయాలంటే GMAT కు ప్రిపేరవ్వాల్సివుంటుంది.
రాత పరీక్ష కోసం...
ఈసీఈ, సీఎస్‌ఈ, సీఎస్‌ఐటీ, ఈఈఈ బ్రాంచిలవారు సాధారణంగా సాఫ్ట్‌వేర్ రంగం వైపు వెుగ్గు చూపిస్తుంటారు. ఏ కంపెనీ అయినా వెుదట రాతపరీక్ష నిర్వహిస్తుంది. వివిధ కంపెనీల పాత ప్రశ్నపత్రాలను సేకరించి, వాటిని సాధన చేసుకోవాలి.
దీనికి ఇంటర్నెట్ సాయపడుతుంది. www.freshersworld.com, www.koolkampus.com, www.ieg.gov.in వెబ్‌సైట్లూ, యాహూ గ్రూప్స్‌లో jkc0405, chetana ఇందుకు ఉపయోగపడతాయి.
రాతపరీక్ష కోసం Verbal & non-verbal reasoning, Quantitative aptitude, Analytical skills ను పెంపొందించుకోవాలి. ఇవన్నీ ప్లేస్‌మెంట్ సంబంధిత నైపుణ్యాలు. ఈ నైపుణ్యాలపైనే ఐఈజీకి చెందిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ మిషన్ నవంబరు 26- డిసెంబరు 12 తేదీల మధ్య ఉచితంగా శిక్షణ ఇచ్చింది. రాష్ట్రంలోని 52 కాలేజీల్లో 3,150 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు దీన్ని ఉపయోగించుకున్నారు.
ఈసీఈ, సీఎస్‌ఈ, సీఎస్‌ఐటీ, ఈఈఈ బ్రాంచిల వారికి పై నైపుణ్యాలతో పాటు C language, operating systems తెలిసివుండాలి.
ఇంటర్వ్యూలో ఏం అవసరం?
ఇంటర్వ్యూల్లో అభ్యర్థి ఆత్మవిశ్వాస స్థాయి, స్వభావం, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు, సాంకేతిక నైపుణ్యాలూ, ప్రాజెక్టు వర్క్‌లను చూస్తారు.
సాంకేతిక నైపుణ్యాలను పరిశీలించేటప్పుడు 'మీ కోర్సులో మీకు నచ్చిన సబ్జెక్టులేమిటి?' అంటూ అభ్యర్థికే అవకాశాన్ని వదిలేస్తుంటారు. అందుకని కనీసం రెండు సబ్జెక్టుల్లోనైనా పట్టు సాధించాలి. కంప్యూటర్ సంబంధిత విద్యార్థులు C language, Data structures, operating systems, micro processors, computer networks తెలుసుకునివుంటే సరిపోతుంది.
జావా, డాట్ నెట్ లేని విద్యార్థులు కంగారు పడనక్కర్లేదు. ఏ కంపెనీ అయినా తాజా గ్రాడ్యుయేట్లను తీసుకునేటప్పుడు అభ్యర్థి త్వరగా నేర్చుకోగలుగుతాడా? అతడి ఇంజినీరింగ్ సబ్జెక్టులో strong గా ఉన్నాడా లేదా అనేది ప్రధానంగా చూస్తుందని గుర్తించాలి.
ప్రాధాన్యం లేని అనవసర విషయాలకు వెచ్చించే సమయం ఎంతో గుర్తించగలిగితే సమయం ఎంతో ఆదా చేసుకోవచ్చు. ప్రతి గంటనూ కెరియర్ అభివృద్ధి కోసం వెచ్చించాలనే సంకల్పం ఉండాలి. ఆచరణ దానికి తగ్గట్టు ఉండాలి.
మార్కులు మెరుగ్గా...
కాలేజీలో ఉన్నపుడే కెరియర్ ప్రణాళిక వేసుకోవడమంటే కోటలో ఉండి యుద్ధం చేయటం లాంటిది. ీకాలేజీ దాటితే 50 శాతం సంబంధాలు తెగిపోవటమే కాదు, 50 శాతం పోటీ కూడా పెరుగుతుంద'ని జేఎన్‌టీయూ క్యాంపస్ కాలేజ్‌లో ఫైనలియర్ చదువుతున్న (సివిల్) వంశీకృష్ణ చెప్పినమాట విద్యార్థుల అవగాహనను తెలుపుతోంది. గేట్ ప్రిపరేషన్ వల్ల సబ్జెక్టుపై అధికారం వస్తుందని ఈ విద్యార్థి అభిప్రాయపడ్డారు. ీడిగ్రీ పర్సంటేజి చాలా ముఖ్యం. దాని తర్వాతే ఏదైనా. కొన్ని కంపెనీలు 60-75 శాతం మార్కులుంటే గానీ కాల్‌లెటర్లు పంపించటం లేదు' అన్నారు. ఇతనికి నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌లో సైట్ ఇంజినీర్‌గా క్యాంపస్ ప్లేస్‌మెంట్ లభించింది.
మరో ఫైనలియర్ విద్యార్థి (ఈఈఈ) మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్‌కు సైన్యాధికారి కావాలని వెుదట్నుంచీ లక్ష్యం. అందుకే కిందటి సంవత్సరం ఫిబ్రవరిలో SSB నోటిఫికేషన్ చూసి, దరఖాస్తు చేశారు. సుదీర్ఘమైన ఎంపిక ప్రక్రియలో నెగ్గి ఆర్మీ టెక్నికల్ ఇంజినీర్ (లెఫ్టినెంట్) గా ఎంపికయ్యారు. ఇతనికి సత్యం కంప్యూటర్స్‌లో సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌గా ప్లేస్‌మెంట్ కూడా లభించింది.
వారానికోసారి జరుపుకున్న గ్రూప్ డిస్కషన్లు కంప్యూటర్ సైన్స్ విద్యార్థి రాహుల్ వెంకట్‌కు బాగా ఉపయోగపడ్డాయి. ీఒక బ్రాంచి వాళ్ళు చేశారని మరో బ్రాంచి వాళ్ళు... ఇలా హాస్టల్లో అందరూ గ్రూప్ డిస్కషన్లు నిర్వహించుకున్నా'మని తెలిపారు. ఇతనికి క్యాన్‌బే సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో ప్లేస్‌మెంట్ వచ్చింది. ీక్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వొకాబ్యులరీపై ప్రిపేరైతే మంచిదని సీనియర్లు చెప్పారు. థర్డ్ ఇయర్‌లో క్యాట్ కోచింగ్‌కు వెళ్ళాను. దీనిలో ఇవి కవరయ్యాయ'ని చెప్పారు.
'సబ్జెక్టు మీద పట్టు ముఖ్య'మని చెపుతున్న రాజేష్‌కు (ఈసీఈ) టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌గా ప్లేస్‌మెంట్లు లభించాయి. గ్రూప్ డిస్కషన్లలో పాల్గొనటం, స్నేహితులతో ఇంగ్లిష్‌లో సంభాషించటం ఉపకరిస్తాయని చెప్పారు. సీనియర్స్ గైడెన్స్ కెరియర్‌కు చాలా అవసరమని ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. వారిని ఫోన్స్, ఈ- మెయిల్స్ ద్వారా తరచూ సంప్రదిస్తూ తమ కెరియర్‌కు బాటలు వేసుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు ఉండవు కాబట్టి ఎక్కువమంది పీజీ చేస్తుంటారు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరంలో గేట్ రాయటం మంచిది. స్కోర్ సరిగా రాకపోతే ఫైనలియర్లో రాసే అవకాశం ఉంటుంది. పాఠ్యపుస్తకాలనూ, ప్రామాణిక self learning books శ్రద్ధగా చదివి మంచి స్కోర్ కోసం ప్రయత్నించాలి. కోచింగ్ సదుపాయాలు లేవని నిరాశపడకుండా గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలి. గేట్ స్కోర్ బాగుంటే ఉపకారవేతనాలు కూడా వస్తాయి. ఐఐఎంలాంటి ప్రముఖ సంస్థల్లో ఎంబీఏపై కూడా దృష్టి పెట్టవచ్చు. విదేశీ విద్య ఈ రోజుల్లో చాలామందిని ఆకర్షిస్తోంది. వీటి ప్రవేశపరీక్షలకు ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ప్రైవేటు రంగంలోనే కాకుండా జాతీయస్థాయిలో యూపీఎస్‌సీ నిర్వహించే ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ (IES) ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు. అభిరుచీ, ఆసక్తులను బట్టి సివిల్ సర్వీసులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను ప్రత్యామ్నాయాలుగా ఎంచుకోవచ్చు. - డా. జి. తులసీ రాందాస్, ప్రిన్సిపల్, జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ - హైదరాబాద్ |
ఇంటర్‌నెట్ వర్క్' తమ కాలేజీలోని వారితో మాత్రమే కాదు, ఇతర కాలేజీల్లోని సీనియర్లతో కూడా సంబంధాలు ఏర్పరచుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇంటర్మీడియట్‌లోని సన్నిహిత మిత్రులు కొందరైనా వేరే ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరతారు కాబట్టి, వారి ద్వారా అక్కడి సీనియర్లతో పరిచయం పెంచుకోవాలి. నెట్‌వర్క్ విషయంలో ఇంటర్నెట్‌ను చక్కగా వినియోగించుకోవచ్చని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ (ఐఈజీ) డిపార్ట్‌మెంట్ సమాచార అధికారి జి. రమేష్ తెలిపారు. ీయాహూ లాంటి సైట్లు వివిధ అంశాల్లో గ్రూప్స్ నిర్వహిస్తున్నాయి. వీటిలో రిజిస్టరైతే వేలమందితో సంబంధాలు సాధ్యమవుతాయి. ఉన్నత విద్యకూ, కెరియర్‌కూ సంబంధించి ఏ ప్రశ్న అడిగినా మీ గ్రూప్‌లోని వేలమందిలో ఎవరో ఒకరి దగ్గర్నుంచి జవాబు వస్తుంది. * ఉద్యోగాలకు సంబంధించి chetana * ప్రవేశ పరీక్షలకు సంబంధించి unpercentile.com * విద్య, కెరియర్‌కు సంబంధించి jkc0405 ఈ గ్రూపులు విద్యార్థులకు అవసరమైన సమాచారాన్నీ, సలహాలనూ అందిస్తాయి. ఉదాహరణకు groups.yahoo.com లోకి వెళ్ళి jkc0405 గ్రూప్‌ను search చేయవచ్చు' అని ఆయన వివరించారు. తగిన సమాచారం, సహకారం కోసం ఇతరులను సంప్రదించటం చిన్నతనం కాదని గుర్తించాలి. సంకోచం, బిడియం వదిలి స్వేచ్ఛగా సందేహాలను వ్యక్తీకరించటం అలవాటు చేసుకోవాలి. |
'ప్రాజెక్టు గురించి విద్యార్థులకు కచ్చితంగా ఒక dream ఉండాలి. అది నిజంగా అద్భుతమైన ప్రాజెక్టు కావాలి. ఏదైనా నిజజీవిత సమస్యపై చేసేది అయివుండటం మంచిద'ని ఐఈజీ అకడమిక్ డైరెక్టర్ టి. శ్రీనివాసులురెడ్డి సూచించారు. జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ)ల పనితీరును ఆయన ఉదాహరించారు. ఇక్కడ ప్రభుత్వ విభాగాల్లోకి వెళ్ళి వాస్తవిక సమస్యలపై ప్రాజెక్టులు చేస్తుంటారు. దీనివల్ల organisation లో మాన్యువల్ వర్క్‌లో ఉన్న కష్టాలను గుర్తించి, పరిష్కారాలు ఇవ్వగలుగుతున్నారు. టీమ్‌వర్క్... ఎంతో మేలు ఇంజినీరింగ్ విద్యార్థులకు టీమ్ వర్క్ ఎక్కువ ప్రయోజనకరమని శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ీఎవరికి వారు కాకుండా సహాధ్యాయులు కొందరు కలిసి ఒక బృందంగా చర్చించుకుంటూ ప్రిపేరవ్వాలి. ఒకరు చదివిన టాపిక్స్‌ను మరొకరికి వివరించటం వల్ల సబ్జెక్టుపై పట్టు రావటమే కాకుండా సమయమెంతో కలిసివస్తుంది. ఏ విషయంపై అయినా అదనపు సమాచారాన్ని ఇంటర్నెట్‌లో వెదికి దానిపై మిత్రులతో చర్చించాల'ని సూచించారు. |
Courtesy: ఈనాడు
1 Comments:
Awesome man. Nice to see a telugu site
Technical Interview Questions
Post a Comment
<< Home