ఆర్టీసీ 'బుద్ధా' టూర్ ప్యాకేజీ
ప్రణాళికలు రచిస్తున్న యంత్రాంగం
న్యూస్‌టుడే - గుంటూరు
కాలచక్ర ఉత్సవాలకు విచ్చేస్తున్న బౌద్ధులను ఆసక్తిని గమనించి వారికి అనుగుణంగా టూర్ ప్యాకేజీలను రూపొందించి అదనపు ఆదాయాన్ని గడించేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాతో పాటుగా చుట్టుపక్కల జిల్లాల్లోని బౌద్ధ యాత్రాస్థలాలను గుర్తిస్తున్నారు. వీటితోపాటుగా చారిత్రక ప్రాధాన్యత కల ప్రదేశాలను కూడా కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను రూపొందించనున్నారు. అమరావతికి విచ్చేసిన బౌద్ధ యాత్రికులు పలువురు ఇప్పటికే ఆర్టీసీ అధికారులను యాత్రా స్థలాల గురించి ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలో..
* గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పవిత్ర బౌద్ధ క్షేత్రాలైన ఘంటశాల, భట్టిప్రోలు, నాగార్జునకొండ వంటి బౌద్ధ యాత్రా స్థలాలను కలుపుతూ ఒక ప్యాకేజీని రూపొందించనున్నారు.
* బౌద్ధులతోపాటుగా వస్తున్న ఇతర యాత్రికులను ఆకర్షించేందుకు వీలుగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని చారిత్రక ప్రాధాన్యత ఉన్న దార్శనిక ప్రాంతాలను కలుపుతూ పర్యటన రూపొందిస్తే ఆదాయానికి తోడుగా పర్యాటక రంగం కూడా మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
* ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన గైడ్‌లను రప్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
* పర్యటనకు ఇచ్చే లగ్జరీ బస్సులకు 24 గంటల సమయానికి పగటి ప్రయాణం గంటకు 20 కిలోమీటర్లు, రాత్రి 15 కిలోమీటర్ల చొప్పున లెక్కించి రోజుకు కిలోమీటరుకు రూ.17.50 చొప్పున వసూలు చేస్తారు. అదే నిర్ణయించుకున్న రోజుల్లో మొత్తం తిరిగిన కిలోమీటర్లు ఎక్కువైతే వాటిని రూ.17.50 చొప్పున లెక్కగట్టి తీసుకుంటారు.
* రూపొందించిన ప్యాకేజీ వివరాలను హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటుగా టిబెట్ భాషలోనూ ప్రచారం కల్పించేందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటున్నారు.
Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005
0 Comments:
Post a Comment
<< Home