కాలచక్ర బౌద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు
గుంటూరు రైల్వే డివిజన్ సమాయత్తం
* ఏసీ గదుల అద్దె (24 గంటల సమయానికి) రూ. 250, నాన్ ఏసీ గది రూ. 150.
* డార్మెటరీలో 10 మంచాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మంచానికి 24 గంటలకు రూ. 50. 12 గంటలు వినియోగించుకొంటే రూ.30 వసూలుచేస్తారు.
* స్టేషన్‌కు పశ్చిమం వైపున స్త్రీలకు ప్రత్యేక గదిని అదనపు సౌకర్యాలతో నిర్మిస్తున్నారు.
* ప్రధాన స్టేషన్లోని రెండు రెస్ట్ రూములను తీర్చి దిద్దుతున్నారు. ప్లాట్‌ఫారం 1, 4, 5ల్లో ఉన్న విశ్రాంతి గదులలో అధునాతన వసతులు కల్పిస్తున్నారు.
* కాలచక్ర ఉత్సవాల సమయంలో ఆర్టీసీ, ప్రయివేటు బస్సులను స్టేషన్ వద్దకు అనుమతిస్తారు.
* ఉత్సవాలకు వేదికైన అమరావతి బస్సుస్టాండులో రైల్వే రిజర్వేషన్, విచారణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే సమాచారం తెలుసుకొనేందుకు కంప్యూటర్‌ను కూడా ఉంచబోతున్నారు.
* గుంటూరు స్టేషన్‌కు రెండు వైపులా ఉన్న రిజర్వేషన్ కేంద్రాల వద్ద రెండు అదనపు కౌంటర్లు ప్రారంభిస్తారు.
* ప్రయాణికులకు అనుగుణంగా రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తారు.
* మంచినీరు సమృద్ధిగా లభించేలా చర్యలు తీసుకొన్నారు.
* భద్రత కోసం అదనపు ఆర్.పి.ఎఫ్. బలగాలు రానున్నాయి.
* అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు 0863-2330761 నంబరుకు సమాచారాన్ని తెలపాలని డి.ఆర్.ఎం. చౌహాన్ తెలిపారు.
*****
కాలచక్రపై ఆర్‌అండ్‌బీ 'షో'
కలెక్టరేట్, డిసెంబరు 26 (న్యూస్‌టుడే) : కాలచక్ర ఉత్సవాల సందర్భంగా ఆర్ అండ్ బీ నిర్మిస్తున్న రోడ్లలో నాణ్యతను రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి తెలియజేసేందుకు అధికారులు ల్యాప్‌టాప్ 'షో' నిర్వహించారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కాలచక్ర ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ఆర్ అండ్ బీ నిర్మించిన రోడ్లను, నిర్మాణదశలో ఉన్న రోడ్లను వీడియో తీసి ల్యాప్‌టాప్ ద్వారా వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రికి చూపారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతపరమైన లోపాలు ఉన్నట్టు పత్రికల్లో వస్తున్న కథనాల గురించి ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న రోడ్లలో ఎక్కడా నాణ్యతాపరమైన సమస్య తలెత్తడంలేదని అన్నారు. నూతన పరిజ్ఞానం ప్రకారం బూడిదను ఉపయోగిస్తున్నామని అది రోడ్డును మరింత గట్టిగాఉండేలా చేస్తుందని ఆర్ అండ్ బీ పర్యవేక్షక ఇంజినీర్ భావన్నరావు వివరించారు. నిర్మాణంలో ఉన్న రోడ్లను చూపించాలని ముఖ్యమంత్రి భావన్నరావును ఆదేశించారు. బూడిదతో నిర్మాణం జరుగుతున్న దశలను కూడా ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. నిర్మాణంలో ఎక్కడా నాణ్యతలోపం లేకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005

0 Comments:
Post a Comment
<< Home