"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Thursday, June 25, 2009

పాప్ కింగ్" మైకెల్ జాక్సన్ మృతి

పాప్ కింగ్ మైకెల్ జాక్సల్ గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు.

పాప్ సంగీత ప్రపంచాన్ని కొన్నేళ్లపాటు శాసించిన మైకెల్ జాక్సన్ (50) శుక్రవారం వేకువజామున స్థానిక కాలమానం ప్రకారం 2.26 గంటలకు మృతి చెందారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

రాత్రి గుండెపోటు రావడంతో లాస్ ఏంజెలెస్‌లోని ఓ ఆస్పత్రికి జాక్సన్‌ను తీసుకెళ్లారు.

అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే ఆయనలో చలనం లేదని లాస్ ఏంజెలెస్ కౌంటీ కార్నర్స్ కార్యాలయ ప్రతినిధి ఫ్రెడ్ కారల్ సీఎన్ఎన్ ఛానల్‌తో చెప్పారు. రాత్రి 12.30 గంటల సమయంలోనే జాక్సన్‌కు గుండెపోటు వచ్చినట్లు లాస్ ఏంజెలెస్ అగ్నిమాపక శాఖ వైద్య సిబ్బందికి సమాచారం అందించారు.

ఆ సమయంలోనే జాక్సన్ శ్వాస తీసుకోవడం లేదు. అనంతరం ఆయనను వైద్య సిబ్బంది రోనాల్డ్ రీగన్ యూసీఎల్ఏ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లిన తరువాత వైద్యులు ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారు. మైకెల్ జాక్సన్‌కు అంతిమ నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఆస్పత్రి వద్ద, ఆయన నివాసం వద్ద గుమిగూడారు.


Labels:


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


2 Comments:

At 2:31 PM, Blogger RAJESH YALLA గారు చెప్పినారు...

చాలా చక్కగా బ్లాగ్ ను నిర్వహిస్తున్నారు. అబినందనలు.
నా బ్లాగును కూడా చూసి మీ అమూల్యమైన అబిప్రాయాన్ని తెలియపరుస్తారని
ఆశిస్తున్నాను.
మీ రాజేష్ (http://vipanchi.blog.co.in)

 
At 10:30 PM, Blogger Unknown గారు చెప్పినారు...

Send breathtaking gifts to USA and make a beguiling focal point to any celebration. Add unique beauty and style to the occasions of your special ones in USA with our exotic range of gifts.

Please visit:
www.expressgiftbasketsusa.com

 

Post a Comment

<< Home