"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Tuesday, June 06, 2006

Budharaju Ramakrishna: A Legend

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆన్‌లైన్‌): ప్రముఖ భాషావేత్త బూదరాజు రాధాకృష్ణ ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ కళ్యాణనగర్‌లోని తన సొంత ఇంటిలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మరణించారు. 75 ఏళ్ల బూదరాజు రాధాకృష్ణ భాషావేత్తగా, వ్యాకరణవేత్తగా, కవిగా, కాలమిస్టుగా, జర్నలిస్టులకు గురువుగా సుప్రసిద్ధులు. ఈనాడు దినపత్రికలో సుదీర్ఘకాలంపాటు 'సి. ధర్మారావు' పేరుతో 'పుణ్యభూమి' కాలమ్‌ను నిర్వహించిన ఆయన ప్రస్తుతం మనభూమి మాసపత్రికకు 'ధర్మస్థలి' కాలమ్‌లో వ్యాసాలు రాస్తున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలో 1932 మే 3న సువర్చల, నరసింహారావు దంపతులకు బూదరాజు రాధాకృష్ణ జన్మించారు. తెలుగు అధ్యాపకులుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించిన రాధాకృష్ణ అనంతరం తెలుగు అకాడమీలో భాషావేత్తగా 20 ఏళ్లపాటు పనిచేశారు.

హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా, ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేశారు. ఆయన వాస్తు, కళలు అంశాలపై మాండలిక వృత్తి పదకోశాలకు సంపాదకులుగా వ్యవహరించారు. రచయితగా వ్యావహారిక భాషా వికాసం, భాషాశైలి-నియమావళి, సాహిత్యవ్యాసాలు, ఆధునిక వ్యవహారకోశం, భాషాశాస్త్ర వ్యాసాలు, జర్నలిజం-పరిచయం, పురాతన నామకోశం, ప్రసార మాధ్యమాల కోసం రాయడం, మాటల మూటలు, తెలుగు జాతీయాలు, మాటల వాడుక-వాడుక మాటలు, మహాకవి శ్రీశ్రీ, తెలుగు భాషాస్వరూపం, ప్రాచీనాంధ్ర శాసనాలు, తెలుగు శాసనాలు (13వ శతాబ్ది), మంచి జర్నలిస్టు కావాలంటే, మరువరాని మాటలు... వంటి గ్రంధాలను వెలువరించారు.

ఇంగ్లిషులో కూడా తెలుగు భాష, చిన్నయసూరి, శ్రీశ్రీల గురించిన కొన్ని పుస్తకాలకు సంపాదకుడిగా, రచయితగా ఉన్నారు. 'విన్నంత కన్నంత' పేరుతో తన స్వీయానుభవాలను పుస్తకంగా తీసుకువచ్చారు. ఇవేకాకుండా ఆయన ఆనేక సాహిత్య వ్యాసాలు రాశారు. బూదరాజు రాధాకృష్ణకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆదివారం ఆయన మధ్యాహ్నం నుంచే హైదరాబాదు నగరంలోని ఆయన సన్నిహితులు, అభిమానులు, శిష్యులు పులువురు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన మృతదేహానికి సోమవారం అంతిమ సంస్కారం జరుగుతుందని బంధువులు తెలిపారు.

Courtesy: ఆంధ్ర జ్యోతి
*****

Hyderabad : Famous writer, scholar and revolutionarists Budaraju Radhakrishna passed away on Sunday .

Buddaraju was suffering from respiratory ailments. He was born in Vetapalem in 1932. He achieved PhD from Andhra Viswa Kalasala Parishad in 1965 by writing historical essay on ancient Telugu language.

For 15 years he worked as Telugu lecturer and for another 20 years he worked as Telugu Academy Research head. He retired in 1988. He has written articles in Eenadu in the name of Punyabhoomi with the alias of Dharma Rao.

He was appointed as the head of Eenadu Journalism College principal and worked for a decade creating many journalists. He has written more than 50 books and proved his skills in Telugu and Sanskrit and increased the quality in newspaper language. He researched on the different accents of Telugu language.

He has faced many problems due to his self reliance and uncompromising nature. Chief Minister Y.S. Rajashekhar Reddy, opposition leader N. Chandra Babu Naidu and Eenadu chief editor Ramoji Rao expressed their deepest condolences for the demise of Budaraju Radhakrishna.

Courtesy: AndhraCafe


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'