అన్నమయ్యను జాతీయ వాగ్గేయకారుడిగా గుర్తించాలి
తిరుపతి, న్యూస్‌టుడే: పదకవితా పితామహుడు అన్నమయ్యను జాతీయ వాగ్గేయకారుడిగా గుర్తించాలని తుడా ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతి ఉత్సవాల్లో భాగంగా మహతి సభామందిరంలో రెండో రోజు నిర్వహిస్తున్న చారిత్రక సదస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 8 నెలల కిందట ఇక్కడే సాహిత్యవారోత్సవాలు జరిగినప్పుడు ప్రజాకవి వేమనను జాతీయ కవిగా గుర్తించాలని ప్రతిపాదించామన్నారు. 32వేల సంకీర్తనలు రచించి పద కవితా పితామహుడిగా పేరొందిన అన్నమయ్యను జాతీయ వాగ్గేయకారుడిగా ప్రకటిస్తే అది తెలుగుజాతికే గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఈ సదస్సులకు సచ్చిదానందం అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో తుడా వీసీ మోహన్‌రెడ్డి,తితిదే ధర్మపాలక మండలి సభ్యురాలు చదలవాడ సుధ, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
Courtesy: ఈనాడు
Annamayya Telugu poet saint Annamacharya national level status Andhra Pradesh Carnatic music Eenadu May 2006
0 Comments:
Post a Comment
<< Home