"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Monday, March 27, 2006

Infosys' largest campus to be on Telugu land

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే


న్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ హైదరాబాద్‌లో 550 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద ఐటీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో మామిడిపల్లి వద్ద స్థలాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఇన్ఫోసిస్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌ అభివృద్ధి కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సీఎం రాజశేఖరరెడ్డి, ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి కె. రత్నప్రభ, ఇన్ఫోసిస్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ బినోద్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఇప్పటికే ఇన్ఫోసిస్‌కు మణికొండలో 50 ఎకరాల స్థలంలో క్యాంపస్‌ ఉంది. ఇక్కడ రూ.280 కోట్లు వెచ్చించి 4 వేల మంది సాఫ్ట్‌వేర్‌ నిపుణులు పనిచేసేందుకు అనువైన సదుపాయాలను సమకూర్చుకుంది. ఇక్కడే విస్తరణ చేపడుతూ అదనంగా మరో 6 వేల మంది నిపుణులకు అనువుగా సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. దీనికితోడు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి 550 ఎకరాల స్థలాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చింది. ఈ స్థలంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా అతిపెద్ద ఐటీ కేంద్రాన్ని నిర్మించాలనేది కంపెనీ ప్రణాళిక. రూ. 1,000 కోట్ల పెట్టుబడితో 25వేల మంది నిపుణులు పనిచేసేందుకు అనువుగా కేంద్రాన్ని ఈ కొత్త స్థలంలో నెలకొల్పుతామని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో అతిపెద్ద కేంద్రాన్ని నిర్మించడం ద్వారా చరిత్ర సృష్టిస్తామని ఇన్ఫోసిస్‌ ఛీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ) మోహన్‌దాస్‌ పాయ్‌ తెలిపారు. మణికొండలో ఇప్పటికే ఉన్న కేంద్రాన్ని విస్తరించడానికి మరో రూ. 250 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. 'హైదరాబాద్‌లో వచ్చే కొన్నేళ్లలో మేం ఖర్చు పెట్టబోయే రూ. 1250 కోట్ల సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందా... అని మేం వెతుక్కోవలసిన పనిలేదు, ఈ సొమ్ము ఇప్పటికే బ్యాంకులో సిద్ధంగా ఉంది' అన్నారాయన.

పూర్తి సహకారం : వై.ఎస్‌.
''ఇన్ఫోసిస్‌కు పూర్తి సహకారాన్ని అందిస్తాం. నాణ్యమైన విద్యుత్తు సరఫరా, రవాణా/ కమ్యూనికేషన్ల సదుపాయాల కల్పన, నీటి వసతి వంటి విషయాల్లో దూరదృష్టితో ప్రాజెక్టులు చేపడుతున్నాం. 8 లైన్ల అతిపెద్ద అవుటర్‌ రింగ్‌రోడ్డును చేపడుతున్న ఘనత మాదే. దీనికి దగ్గర్లో శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు నిర్మిస్తాం. వచ్చే 20 ఏళ్ల కాలంలో నగర తాగునీటి అవసరాలకు అనుగుణంగా కృష్ణా, గోదావరి జలాలను తీసుకువస్తాం.''

చేసి చూపిిస్తాం: నారాయణమూర్తి
''ఏ పనైనా మేం చెప్పేది తక్కువ... దానికి మించిన ఫలితాలు చూపేందుకు ప్రయత్నిస్తాం, సాధిస్తాం. ఈ కేంద్రం పనులు 4 నెలల్లో ప్రారంభిస్తాం. పనులు పూర్తయ్యాక ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఎంత బాగా చేశామనేది మీరే చూస్తారు (సీఎంను ఉద్దేశించి). అభివృద్ధితోటే పట్టణాలకు వలసలు పెరుగుతాయి. అందువల్ల తగిన వసతులు కల్పించడం తప్పనిసరి. అమెరికా, చైనాల్లో ఇదే జరిగింది.''

ఇవి చేయండి: ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ
1.మామిడిపల్లి మొత్తాన్ని నోటిఫైడ్‌ ఏరియాగా గుర్తించాలి. 2.రెండు లక్షల మంది నివసించడానికి అవసరమైన వసతులను సమకూర్చాలి. 3.'ప్రత్యేక ప్రాంత ప్రణాళికా అథారిటీ'ని ఏర్పాటు చేసి అభివృద్ధిని క్రమబద్ధం చేయాలి. మామిడిపల్లి ప్రాంతంలో రూ.20 వేల కోట్లతో ఏర్పాటయ్యే విజ్ఞాన కేంద్రాల ద్వారా 5 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్లు సౌకర్యాలుండాలి.

Courtesy: ఈనాడు
*****

HYDERABAD: It's official. IT bellwether Infosys is setting up its largest campus—for the time being—in Hyderabad. The 550 acre facility will straddle Mamidipalli and Kancha Imarat villages in Maheshwaram mandal near the upcoming Shamshabad international airport.

The government is selling the land to Infosys at Rs 12 lakh per acre. In the first phase, the company will be given 150 acres and the remaining being delivered as the work progresses.

The campus, similar to Infy's Mysore sprawl, will house employee training and recreation activities apart from core facilities for IT services.

With investment of Rs 1,250 crore in three phases, the Bangalore-based company will make the Shamshabad campus, its second in Hyderabad, its largest nationwide, even in terms of personnel employed. In 10 years, the campus will teem with about 25,000 employees.

"This campus will be the next-generation Hyderabad Development Centre. We believe in the principle of under-promising and over-delivering.

Whatever we have promised to do in the new campus, we will deliver," Infosys's chief mentor N R Naryana Murthy said at the signature ceremony as chief minister Y S Rajasekhara Reddy, IT minister Sabitha Indra Reddy and irrigation minister P Lakshmaiah beamed their happiness.

Not making any direct reference to Infosys' niggles with the Karnataka government, chief financial officer Mohandas Pai said, "We are built on the principle of being deserved to be treated with respect even if we disagree on certain issues.

Hyderabad has offered us that respect and we have decided to come here." Infosys already has a 50 acre, Rs 275 crore campus at Manikonda near Hi-Tec City which employs 5,200 professionals.

According to Pai, the company will invest another Rs 225 crore on the existing facility and hire about 4,000 professionals by December. The Hyderabad centre has an export potential of about Rs 2,000 crore.

In the last 12 months, it has clocked up Rs 850 crore, he said. He chose not to take Bangalore's infrastructure to task at the signing ceremony.

"We have a young leader (CM Kumaraswamy Gowda) in Bangalore. He is working very hard to make things happen and we should give him some time to deliver," he said.

While AP is claiming that the upcoming campus would be Infosys's largest in the country, Karnataka is trying to top that by offering the company about 845 acres for yet another campus in Karnataka.

However, reacting to this offer, Murthy said, "Actually, the government of Karnataka has been very, very kind to approve in principle our plan to buy land in Bangalore. We have not received any land from the (Karnataka) government so far.

Here is a government (in AP) that has given us the land. There in Karnataka we have what is called a consent agreement, which means that we would have to buy the land from various people and that would be executed through the Karnataka Industrial Development Board. That will happen in the near future."

Courtesy: Times of India


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


0 Comments:

Post a Comment

<< Home