గణిత మహా శతావధాని 'శ్రీ' హర్ష కు ఉగాది పురస్కారం
తిరుపతి,మార్చి 24(ఆన్‌లైన్): గణిత మహా శతావధానిగా పేరు గడించిన తిరుపతివాసి మాస్టర్ కానాల శ్రీహర్ష చక్రవర్తి ప్రతిభాపాటవాలను గుర్తించిన ప్రభుత్వం ఉగాది పురస్కారంతో సత్కరించనుంది. ఈనెల 30వ తేదీ ఉగాది పర్వదినాన హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చేతులు మీదుగా పుర స్కారాన్ని శ్రీ హర్ష అందుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ ఈ పురస్కారం ప్రదానం చేస్తుంది. పెన్ను, పేపర్, కాలిక్యులేటర్, కంప్యూటర్‌లు లేకుండానే గణితం- ఖగోళం- కంప్యూ టర్ గణితానికి చెందిన క్లిష్టాతిక్లిష్టమైన సమస్యలకు క్షణాల్లో సమాధానమివ్వడంలో శ్రీహర్ష దిట్ట. ప్రపంచ ప్రప్రథమ మహాగణిత శతావధానిగా పేరుగడించారు.
పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే శ్రీహర్ష అభినవ ఆర్యభట్ట, సరస్వతీ పుత్ర, ఉద్దండ బాలభాస్కరు లాంటి 26 బిరుదాంకితాలను కైవసం చేసుకున్నారు. ఇప్పటికి 95 అవధానాలు, 2 మహా గణిత శతావధానాలు చేసి 155 సన్మానాలు పొందారు. లేత వయసు నుంచే గణితంలో విశేష ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ వండర్ చైల్డ్‌గా కితాబుపొందారు. తెలుగుజాతి గర్విం చేలా గణిత మేధావి శ్రీహర్ష మరిన్ని సత్కారాలు పొం దాలని ఆశిద్దాం. తనయుడికి ఉగాది పురస్కారం రావడంపై తల్లి దండ్రులు కానాల నల చక్రవర్తి, లక్ష్మీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Courtesy: ఆంధ్ర జ్యోతిTelugu avadhani Sri Kanala Harsha Tirumala Tirupati maths mathematics Ugadi award Andhra Pradesh
2 Comments:
good info... we need poeple like you
Thanks Thyaga gAru.
మీ బ్లాగ్ కూడ చాలా బాగుంది
Post a Comment
<< Home