జాతీయ అవార్డు వెనక్కిస్తున్నా: వేటూరి
అవనిగడ్డ - న్యూస్‌టుడే
'తెలుగును ప్రాచీన భాషగా గుర్తించనప్పుడు తనకిచ్చిన అవార్డుకు విలువలేదని ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి వ్యాఖ్యానించారు. తనకిచ్చిన అవార్డును తిరిగిచ్చేస్తున్నానని ప్రకటించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరుగుతున్న 'దివి కృష్ణా మహోత్సవాల'లో భాగంగా సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన సామాజిక సేవకుల సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. తెలుగుపాటకు జాతీయ అవార్డు ఇచ్చినప్పుడు తెలుగుభాషను ప్రాచీన భాషగా ఎందుకు గుర్తించరని ఆవేదన వ్యక్తం చేశారు. 1993లో 'మాతృదేవోభవ' సినిమాలో 'రాలిపోయే పువ్వా... నీకు రాగాలెందుకే' అంటూ వేటూరి రచించిన పాటకు అప్పట్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు. 'తెలుగును ప్రాచీన భాషగా గుర్తించనప్పుడు మనం చూస్తూ ఊరుకుంటే అంతకన్నా ద్రోహం మరొకటి ఉండదు. తెలుగుభాష కోసం త్యాగాలు చేయాల్సివస్తే అఖండ త్యాగం చేసి అమలు చేయాల్సిన అవసరముంది. పక్కనే ఉన్న 'తమిళ, కన్నడ' సోదరులు వారి మాతృభాష కోసం ఏవిధంగా ఉద్యమించి సాధించుకుంటున్నారు.. ఎంత ప్రాధాన్యమిస్తున్నారో గ్రహించాలి. ప్రపంచంలో అచ్చుతో అంతమయ్యే అయిదు భాషల్లో తెలుగు ఒకటి. పోతిరెడ్డిపాడు, పోచంపాడు అంటూ ఆందోళన చేస్తున్నారే కానీ.. మానసిక వికాసం గురించి, మాతృభాష గురించి పట్టించుకోవటం లేదు' అని ఆయన వాపోయారు.
Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , Veturi Sundar Ramamurthy SundarRamamurthi , Krishna Mahotsav Eenadu January 2006 award ancient classical language status return demand TCLD2006 , India Indian
Labels: tcld2006
0 Comments:
Post a Comment
<< Home