ప్రపంచ శాంతికి 'దీక్షా బంధనం'
న్యూస్‌టుడే-అమరావతి
వ్యక్తిగత ఉన్నతి.. ప్రపంచశాంతికి ఏకకాలంలో తోడ్పడే ప్రక్రియకు బౌద్ధమత గురువు దలైలామా గురువారం కాలచక్ర వేదికలో శ్రీకారం చుట్టారు. పవిత్ర మంత్రోచ్ఛారణలు... ప్రత్యేక ప్రవచనాల నడుమ వందల సంఖ్యలో భిక్షువులు.. విద్యార్థులు.. సందర్శకులు దలైలామా ఆధ్వర్యంలో కాలచక్ర దీక్షను తీసుకున్నారు. ఈ దీక్ష కాలచక్ర ఘట్టంలో కీలకమైంది. 'పవిత్రమైన అమరావతి నగరంలో మీరు దీక్షను తీసుకోవడం నిజంగా అదృష్టం' అని దలైలామా వ్యాఖ్యానించారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం సాధించే వ్యాపారి లాగా, మన కోసం కాకుండా మానవాళి కోసం భగవంతుడిని ప్రార్థిస్తే ఫలితం హెచ్చుగా ఉంటుందని ఆయన ఉద్బోధించారు.
*****
బౌద్ధాన్ని వ్యాపారానికి వినియోగించొద్దు
బౌద్ధులకు దలైలామా సూచన
బౌద్ధులకు దలైలామా సూచన
న్యూస్‌టుడే-అమరావతి
బౌద్ధ ధర్మ ప్రచారాన్ని వ్యాపారానికి వినియోగించకండని దలైలామా సూచించారు. కాలచక్ర ప్రక్రియలో భాగంగా వ్యక్తిగత ఉన్నతి కోసం ఆచరించాల్సిన విధానాలపై ఆయన ప్రసంగిస్తూ ఈవిధంగా వ్యాఖ్యానించారు. కాలచక్ర వేదికలో గురువారం ఉదయం వేలసంఖ్యలో హాజరైన బౌద్ధ భిక్షువులు, టిబెటియన్లనుద్దేశించి ఆయన ప్రసంగించారు. 'సర్వ మతాల సారం ఒక్కటే.. దేనికీ వ్యత్యాసం ఉండదు.. బుద్ధుడి ధర్మాన్ని ఆచరిస్తున్న మనం అందరికన్నా అత్యున్నతంగా ఉండడం.. ప్రపంచ మానవాళి కోసం ప్రార్ధించడం వంటివి ఆచరించా'లన్నారు. బుద్ధుడి బోధనలపై సరైన అవగాహన లేక కొంతమంది సక్రమంగా ప్రవర్తించడంలేదని ఆయన పేర్కొన్నారు. స్తూపాలు, కట్టడాలు నిర్మించడం ద్వారా బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయలేమన్నారు. బౌద్ధ ధర్మాల్లో అన్నీ పద్ధతి ప్రకారంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని ఆచరించడంలో విఫలమయ్యే వారి ద్వారానే చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు. వారి అనైతిక ప్రవర్తన ద్వారా చెడు సంకేతాలు వెళ్తున్నాయని వివరించారు. రుజు ప్రవర్తన, సత్యశోధన, వాస్తవాలను అంగీకరించడం వంటివి మొదట్లో కొంత కష్టమే అయినా వాటిని పాటిస్తే క్రమేణా అలవాటుగా మారి మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. బుద్ధుడు ప్రవచించిన సూత్రాలు.. చెప్పిన పద్ధతులన్నీ శాస్త్రీయంగా రుజువయ్యాయని గుర్తుచేశారు. ఆచార్య నాగార్జునుడు, ఆయన శిష్యులు పాటించిన పద్ధతులు ఇప్పటికీ అనుసరణీయాలయ్యాయంటే వాటికున్న ప్రాధాన్యం ఎలాంటిదో అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచశాంతికి పాటుపడండి
జీవన గమనాన్ని మార్చే అత్యుత్తమ ప్రక్రియ కాలచక్ర దీక్ష తీసుకోవడమనీ, దీని ద్వారా ప్రంపంచ శాంతికి పాటుపడండని దలైలమా పిలుపునిచ్చారు. సాటి మనుషులపై ప్రేమ, కరుణను ప్రదర్శించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పారు. స్వార్థాన్ని విడిచి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. దీక్షాధారులతో బోధిసత్వంలోని ప్రమాణాలను చేయించారు.
Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu January 2006 , Nagarjunasagar, Nagarjunakonda
1 Comments:
ugg boots
mont blanc outlet
nike blazer
ugg boots
bears jerseys
nike tn
pandora jewelry
michael kors outlet
ralph lauren
saics running shoes
Post a Comment
<< Home