అమరావతిలో అందుబాటులో వైద్య నిపుణులు
సమగ్రాసుపత్రిలో ప్రత్యేక కాలచక్ర వార్డు ఏర్పాటు
గుంటూరు ప్రభుత్వాసుపత్రి, డిసెంబరు 22 (న్యూస్‌టుడే): కాలచక్ర ఉత్సవాల సందర్భంగా అమరావతిలో 24 గంటలూ అన్ని విభాగాల నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలుతీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్ కమిషనర్ డాక్టర్ ఎన్.ఎస్.రావు తెలిపారు. అలాగే గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రత్యేక కాలచక్ర వార్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో గురువారం ఉదయం కాలచక్ర ఉత్సవాల సందర్భంగా వైద్యసేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హాజరవుతున్నందున మనమందరం సమష్టిగా కృషిచేయాలని ఆయన హితవుపలికారు. ఇందుకు అవసరమైతే ఇతర జిల్లాల నుంచి వైద్యులు, సిబ్బందిని నియమిస్తామన్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
* గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కాలచక్ర వార్డు ఏర్పాటు
* అమరావతి 30 పడకల ఆసుపత్రిలో 24 గంటలూ నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచడం.
* ప్రాథమిక వైద్య కేంద్రాలు 13 ఏర్పాటు
* గుంటూరు రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్సుస్టాండులతోపాటు విజయవాడ రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్సుస్టాండు, గన్నవరం ఎయిర్‌పోర్టుల వద్ద ప్రాథమిక వైద్యకేంద్రాల ఏర్పాటు.
* పది అంబులెన్స్‌ల ఏర్పాటు.
* తుళ్ళూరు, పెదకూరపాడు, అత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించడం.
* తాడికొండలోని ఆర్.ఎ.సి. సెంటర్‌లో అదనంగా వైద్యులను నియమించడం.
* అత్యవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచడం.
* అమరావతిలో ఏర్పాటుచేసే వైద్య శిబిరాలకు ప్రత్యేక అధికారిగా అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సురేష్‌కుమార్ నియామకం.
* విధులకు నియమించిన వారందరూ 31న అమరావతిలో హాజరయ్యేలా చూడటం.
* మొబైల్ మెడికల్ టీంలను ఏర్పాటు చేయడం
* అన్ని ప్రాథమిక చికిత్స కేంద్రాల వద్ద టెలిఫోన్ సౌకర్యం కల్పించడం.
కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ వై.వి.దుర్గాప్రసాద్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.భగవన్నారాయణ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శోభామోహన్, విజయవాడ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈశ్వర్, సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్, వైద్య విధానపరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్, ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ బి.జగన్నాథనాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సి.పి.నరసింహారెడ్డి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సురేష్‌కుమార్‌లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం వారందరూ అమరావతిలోని మండల రెవెన్యూ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
*****
గుంటూరు, డిసెంబరు 22 (న్యూస్‌టుడే): అమరావతిలో నిర్వహిస్తున్న కాలచక్ర ఉత్సవాలకు ఏర్పాట్లు సరిగా నిర్వహించడంలేదని ఆసరా స్వచ్ఛంద సంస్థ గురువారం కోర్టులో మరో ఫిర్యాదు దాఖలు చేసింది. గుంటూరు నుంచి అమరావతి వరకు ఉన్న మార్గమధ్యం వరకు, అమరావతి గ్రామంలోనూ శానిటేషన్‌తో పాటు ఆక్రమణలను ఇంత వరకు అధికారులు తొలగించలేదనీ, దీని వలన కాలచక్ర ఉత్సవాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. అమరావతి వరకు ఉన్న హోటళ్ళు, మంచినీటి సౌకర్యాలను అధికారులు తనిఖీచేసి మెరుగైన వసతులు కల్పించాలని ఆసరా న్యాయవాది అరెగెకూటి సంజీవరెడ్డి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆరోగ్య, రహదారులు, పంచాయతీరాజ్‌శాఖలు తక్షణం చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కోరుతూ పిటీషన్ దాఖలుచేశారు. ఇంతవరకు అక్కడ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆయన తెలిపారు.
కాలచక్ర పనులపై మరో ఫిర్యాదు
(లీగల్ కంట్రిబ్యూటర్)

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005
0 Comments:
Post a Comment
<< Home