చారిత్రక కట్టడమిది... హడావుడి వద్దు: కన్నా
అమరావతి, డిసెంబరు21, (న్యూస్‌టుడే): ప్రతిష్ఠాత్మకంగా అమరావతిలో చేపట్టిన ధ్యానబుద్ధ ప్రాజెక్టును సాధ్యమైనంత మేరకు నాణ్యతాలోపాలు తలెత్తకుండా పూర్తి చేయాలని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. అమరావతిలో జరుగుతోన్న కాలచక్ర పనుల పురోగతిని బుధవారం ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణం కాలచక్ర నాటికి పూర్తయితే ఉత్సవాలకు మరింత కళ వచ్చి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ దీర్ఘకాలికంగా నిలిచి ఉండాల్సిన ఈ చారిత్రక సంపదను హడావిడిగా పూర్తి చేయడం తగదన్నారు. ఆలస్యమైనప్పటికీ ప్రాజెక్టును అన్ని హంగులతో తీర్చిదిద్దాలని సిబ్బందికి సూచించారు. ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయనున్న బౌద్ధ చారిత్రక విశేషాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు రెండు కోట్ల రూపాయలతో కాలచక్రకు పూర్తి చేయతలపెట్టిన 'బుద్ధిస్ట్ ఇంటర్‌ప్రిటిషన్ సెంటర్' పనులు నత్తనడకన సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబరు 25 నాటికల్లా పూర్తి కావాల్సిన ఈ కేంద్రంలో మిగిలిఉన్న పనులను ఎప్పటికి పూర్తిచేస్తారంటూ టూరిజం ఎ.ఇ.ని నిలదీశారు. పల్లోటి నికేతన్, జైల్ సింగ్ కాలనీ, ఆగస్టీన్ పాఠశాలల స్థలాల్లో జరుగుతున్న బౌద్ధుల నివేశన ఏర్పాట్లను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. పెద్ద సంఖ్యలో యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య పరిస్థితులపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఆయన అమరేశ్వరుడ్ని దర్శించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. జయలక్ష్మి, జేసీ రాహుల్ బొజ్జా, ఆర్డీఓ జితేందర్, ఎమ్మార్వో ఉదయ్‌భాస్కర్, కాలచక్ర ప్రత్యేకాధికారి చల్లా విజయ్‌మెహన్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ జయరాంబాబు, పౌర సరఫరాల శాఖ మేనేజర్ వసంత కుమార్, వెలుగు పి.డి. పోలా భాస్కర్, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. ఆర్.మల్లికార్జునరావు, స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు.
నిర్వాసితులకు పునరావాసం
అమరావతి బౌద్ధ మహాస్థూపం రహదారిలో ఇటీవల ఆక్రమణలు తొలగింపులో ఇళ్లు కోల్పోయిన వారందరికీ తక్షణమే పునరావాస ఏర్పాట్లు చేయాలని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు. బుధవారం అమరావతి విచ్చేసిన మంత్రికి నిర్వాసితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పునరావాస ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయకపోవడం సమంజసం కాదన్నారు. దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకుని మండల రెవెన్యూ అధికారులు వారికి ఆవాసాలు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. నిర్వాసితులకు ఇంతవరకు పునరావాసం కల్పించకపోవడంపై రెవెన్యూ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
*****
* ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనలతో సందడి
* వెలుస్తున్న ప్రత్యేక హోటళ్లు, స్టాళ్లు
న్యూస్‌టుడే, గుంటూరు
పదిహేను రోజుల్లో మొదలవనున్న కాలచక్ర ఉత్సవాల సందర్భంగా అమరావతిలో వడివడిగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, కాలచక్ర నిర్వాహక కమిటీ ప్రతినిధులు దగ్గరుండి మరీ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా ఎస్పీ సజ్జనార్‌లు విడివిడిగా స్థానిక అధికారులతో సమావేశమై ఇంకా త్వరితగతిన ఏర్పాట్లు పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రత్యేక అధికారి చల్లా విజయమోహన్ కాలచక్ర బోధనలు జరుగుతున్న వేదిక సమీపంలో పారిశుద్ధ్య ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం సాయంత్రంలోగా సౌకర్యాలు తాత్కాలికంగా ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. అనుకున్న తీదీలోగా ధ్యానబుద్ధ ప్రాజెక్టును పరిపూర్తిచేసేలా సాంఘిక సంక్షేమశాఖ సహాయ సంచాలకులు మల్లికార్జునరావు ప్రయత్నిస్తున్నారు. కాలచక్ర నిర్వాహక కమిటీ ఛైర్మన్ కెలసాంగ్ ఈష్ బోధన వేదికను పవిత్రంగా రూపొందించేందుకు శ్రద్ధ తీసుకొంటున్నారు. కాలచక్ర వేదిక, ధ్యానబుద్ధ ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమైనవారు, సందర్శకులతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.
హోటల్ 'బుద్ధా స్పెషల్'
కాలచక్ర బోధనలు వినేందుకు వస్తున్న బౌద్ధులు, సందర్శకుల కోసం బౌద్ధ సంప్రదాయక వంటకాలతో తాత్కాలిక హోటళ్లు వెలిశాయి. మైసూరు, ధర్మశాల, హుబ్లీలలో ఉన్న బౌద్ధ మతస్థులు వీటిని నెలకొల్పారు. అమరావతిలో ఉంటున్న వారు, పనిచేస్తున్న బౌద్ధుల కోసమే ప్రత్యేకంగా వీటిని ప్రారంభించారు. బ్రెడ్, చపాతి, కాయగూరలు, కూరగాయలతో కుర్మా, సాస్‌లు ఇందులో లభిస్తున్నాయి. ప్రస్తుతం నాలుగు హోటళ్లు కాలచక్ర వేదిక సమీపంలో ఉన్నాయి. వీటితో పాటు స్థానికంగా హోటల్ యాజమాన్యం కూడా బౌద్ధుల కోసం ప్రత్యేకంగా ఆహార పదార్థాలు తయారుచేస్తోంది. వీటి నిర్వహణ కోసం అక్కడి నుంచే పనివారిని రప్పించారు.
వడివడిగా 'కాలచక్ర' పనులు

Courtesy: ఈనాడు
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005
Keywords: Telugu , Andhra Pradesh , India , Buddha Buddhist , Amaravati Guntur , Kalachakra 2006 , Dalai Lama , Tibet Tibetan , stupa , mahachaitya , Mahayana , Theravada , Eenadu December 2005
0 Comments:
Post a Comment
<< Home