Telugu Department at Emory University, Georgia, USA
అట్లాంటా, మే 5 : ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగాన్ని ప్రవేశపెట్టదలచినట్టు డాక్టర్ జాయ్స్ ఫ్లికిగర్, డాక్టర్ దీపిక బహ్రీ తామా ఉగాది సంబరాల సందర్భంగా అట్లాంటా తెలుగువారికి తెలియజేశారు. ఇందుకు అందరూ తమ వంతు సహాయాన్ని అందించాలని వారు కోరారు. ఏప్రిల్ 30 న జరిగిన 'తామా' ఉగాది ఉత్సవాల కార్యక్రమానికి దాదాపు 110 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు.
ముందుగా తామా కల్చరల్ కో ఆర్డినేటర్ రమేష్ కుమార్ దువ్వూరి సారధ్యంలో, స్థానిక గాయనీ గాయకులు నిర్వహించిన 'సినీ గానలహరి' కార్యక్రమం ప్రేక్షకులకు వీనులవిందు చేసింది. అనంతరం రామ్ దూర్వాసుల నిర్వహణలో 'మనబడి' చిన్నారులు ముద్దుముద్దుగా పాడిన పాటలు అందరినీ అలరించాయి. అనంతరం శ్రీమతి శశికళ, శ్రీమతి రేవతి నృత్య దర్శకత్వంలో ప్రదర్శింపబడిన శాస్త్రీయ నత్యాలు, శ్రీదేవి దడితోట నృత్యదర్శకత్వంలో ప్రదర్శించిన లంబాడి నత్యం ప్రత్యేక ఆకర్షణలు కాగా, పలు జానపద, సినీ నృత్యాలు ప్రేక్షకులను ఎంతో ముగ్ధులను చేశాయి.
తామా ప్రెసిడెంట్ శ్రీ బాలా ఇందుర్తి ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి మరియు ఇంటర్ చదివే విద్యార్ధులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల కార్యక్రమం జూన్ 2006లో నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం నిధుల సమీకరణలో ముఖ్య భూమికను వహించిన డాక్టర్ జగన్మోహనరావు తామా తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
25 సంవత్సరాల తామా చరిత్రను ప్రతిబింబిస్తూ శ్రీ వెంకట్ చెన్నుభోట్ల వ్రాసిన గీతం పలువురి మన్ననలనందుకొన్నది. ఇటీవల మరణించిన శ్రీ విజయ్‌రాఘవన్‌లక్ష్మణ్ కుటుంబ సహాయార్థం తామా నిర్వహించిన కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరికీ డా. మనో నాయుడు, డా. అరుణ్‌ప్రసాద్ కంచర్ల, డా. పి.వి.రావు, డా. మంగరాజు వనపల్లి, దేవేందర్‌రెడ్డి, శ్రీకాంత్ కొండా, శ్రీనివాస్ వంగిమల్ల, శ్రీమతి ప్రమీల పొన్న వోలు, శ్రీమతి లక్ష్మీ వేదాల, రమాకాంత్ రాళ్లపల్లి, పాండురంగారావు సూరపనేని, ప్రసాద్ నిమ్మగడ్డ ట్రోఫీలను బహూకరించారు. వైస్ ప్రెసిడెంట్ శ్రీ రమేష్ చాపరాల మాట్లాడుతూ సిల్వర్‌జూబ్లీ సందర్భంగా టెక్నాలజీ కమిటీ సభ్యులు శ్రీ రాఘవ తడపర్తి, శ్రీ రాజ్‌మనోహర్ మహాకాళ, శ్రీ కమల్ పాతులూరిల సేవలను ప్రశంసించారు. అనంతరం వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.
Courtesy: ఆంధ్ర జ్యోతి
0 Comments:
Post a Comment
<< Home