సింగపూర్ తెలుగువారి భాషాభిమానం భేష
డికె అరుణ
గద్వాల, మే 10 (ఆన్‌లైన్) : సింగపూర్‌లో నివాసముంటున్న తెలుగు ప్రజల ఆహ్వానం మేరకు ఏడు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించిన గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ అక్కడి విశేషాలను వివరించారు. రెండేళ్లకొక మారు సింగపూర్‌లో జరిగే తెలుగు మహాసభలను పురస్కరించుకొని సింగపూర్ తెలుగు మహాసభల సంఘం ఆహ్వానం మేరకు గ త నెల 28వ తేదీన బయల్దేరి ఈ నెల 5వ తేదీన తిరిగి హైదరాబాద్‌కు రావడం జరిగిందని అరుణ తెలిపారు. సింగపూర్‌లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య భారీగానే ఉందని, అక్కడ తమిళ, మళయాల రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని ఆమె అన్నారు.
రాష్ట్రం నుంచి వెళ్లి తెలుగు వారు అక్కడ పెద్దపెద్ద ఉద్యోగాలతో పాటుగా వ్యాపారాలలో స్థిరపడ్డారన్నారు. తెలుగు పాఠశాలలు, కళాశాలలు లేవని, ఇటు నుంచి వెళ్లిన ప్రతి ఒక్కరు తెలుగులోనే మాట్లాడుతుంటారని, అక్కడ పుట్టిన పిల్లలు సైతం స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడటం విశేషమన్నారు. అక్కడ మన వారు తెలుగు భాషను మరువకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ముఖ్యంగా తెలుగుభాష సంఘం ఈ విషయంలో అవిరళ కృషి జరుపుతున్నదన్నారు.
Courtesy: ఆంధ్ర జ్యోతి
Singapore Telugu Association
0 Comments:
Post a Comment
<< Home